Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, September 21, 2019

Meritlist updates of 'Secretariat' jobs


Meritlist updates of 'Secretariat' jobs

  • 'సచివాలయ' ఉద్యోగాల మెరిట్‌లిస్ట్ అప్‌డేట్స్!
  • మెరిట్ జాబితాలను జిల్లాలకు పంపిన అధికారులు
  • తదుపరి ప్రక్రియను పూర్తిచేయనున్న కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా కమిటీలు
  • ఆ తర్వాతే వెబ్‌సైట్‌లో అభ్యర్థుల జాబితా


AP Grama Schivalayam Recruitment 2019 గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 1,26,728 ఉద్యోగాలకు గానూ 21,69,814 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 19.5 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 1.98 లక్షల మంది అర్హత మార్కులు సాధించారు.

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిర్వహించిన రాతపరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థుల మెరిట్ జాబితాలను అధికారులు సంబంధిత జిల్లాలకు పంపారు. సెప్టెంబరు 20న రాత్రి ఆయా జిల్లాలకు మెరిట్ జాబితాలను చేరవేశారు. ఈ జాబితా ఆధారంగా కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా కమిటీలు తదుపరి ప్రక్రియను పూర్తిచేయనున్నాయి.
పోస్టులు, రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు, మెరిట్ ఆధారంగా జిల్లా ఎంపిక కమిటీ తుది మెరిట్ జాబితాను రూపొందిస్తుంది. ఆ జాబితాలను జిల్లాల వారీగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. అనంతరం అభ్యర్థుల ఫోన్ నెంబర్లకు SMSలు పంపుతారు. జాబితాలో ఉన్న అభ్యర్థులు శనివారం (సెప్టెంబరు 21) నుంచి వెబ్‌సైట్ ద్వారా సర్టిఫికేట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
అనంతరం జిల్లాల్లో ఏర్పాటు చేసే కేంద్రాల్లో సర్టిఫికేట్ల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ మేరకు అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపనున్నారు. పోస్టుల వారీగా సంబంంధిత శాఖలకు చెందిన జిల్లా అధికారులు ధ్రువపత్రాలను పరిశీలిస్తారు.

సర్టిఫికేట్ల పరిశీలనకు వెళ్లేముందు..

  •  ధ్రువపత్రాల పరిశీలనకు వెళ్లే అభ్యర్థులు గెజిటెట్ ఆఫీసర్ సంతకం చేసిన రెండు జతల సర్టిఫికేట్లు, 2 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు వెంటతీసుకెళ్లాలి.
  •  రెసిడెన్స్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు తప్పనిసరి.
  •  ఏపీ పునర్విభజన కారణంగా 02.06.2014 - 01.06.2019 మధ్యకాలంలో తెలంగాణ నుంచి ఏపీకి వలసవచ్చిన అభ్యర్థులు స్థానికత కోసం సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది.
  •  ప్రత్యేక పాఠశాలల్లో చదివిన అంధులు, వినికిడి లోపాలు ఉన్న అభ్యర్థులు తల్లిదండ్రుల రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది.
  •  ఇక దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, స్పోర్ట్స్, NCC విభాగాలకు చెందిన అభ్యర్థులు సంబంధిత సర్టిఫికేట్లను తీసుకెళ్లాలి.

Thanks for reading Meritlist updates of 'Secretariat' jobs

No comments:

Post a Comment