Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, December 2, 2019

December 3rd of each year is a World Disabled Day, so we have a brief mention of the disabled, KKV Naidu.


December 3rd of each year is a World Disabled Day, so we have a brief mention of the disabled, KKV Naidu.

December 03

World Disabled Day -
December 3rd of each year is a World Disabled Day, so we have a brief mention of the disabled, KKV Naidu.
December 3rd of each year is a World Disabled Day, so we have a brief mention of the disabled, KKV Naidu.

డిసెంబర్ 03
ప్రపంచ వికలాంగుల దినోత్సవం -

ప్రతి సంవత్సరము డిసెంబర్ 03 అంటే మనకు గుర్తుకొచ్చేది ప్రపంచ వికలాంగుల దినోత్సవము.వికలాంగుల గురించి క్లుప్తంగా-కెకెవి నాయుడు.

మనందరకూ  ‘జాన్ మిల్టన్’  బ్రిటీష్  కవిగా తెలుసు.ఆయన 1652లో తన 44వఏట కంటిచూపు కోల్పోయాక  ‘పారడైజ్ లాస్ట్ ‘ అనే అత్యద్భుత  కావ్యం రాశాడు.

ప్రపంచానికి మధురాతి మధురమైన సంగీతాన్ని అందించి గొప్పసంగీత కర్తగా చరిత్రలో చెరగని స్థానంపొందిన జర్మనీకి చెందిన ప్రపంచప్రసిధ్ధ సంగీతకారుడు ‘భీదోవెన్‘ కు బ్రహ్మచెముడు !

ప్రాచీన గ్రీకు మహాకవి  ‘హోమర్ ‘ అంధుడు!

ఆమెరికాకు చెందిన ‘ హెలెన్ కెల్లర్ ‘ 1880 జూల్ 17న జన్మించింది. పుట్టినపుడు మామూలుగానే ఉన్నా 19నెలల వయస్సులో ఆమెకు జబ్బుచేయడంతో చెముడు,మూగతనం,గ్రుడ్డితనం వచ్చాయి . గ్రుడ్డి , చెముడు వల్ల ఆమెకు స్నేహితులు లేకపోడంతో ఏకాకిగా ఐపోయింది.కాని మానశిక శక్తివల్ల ఆమె ఏకాకితనాన్ని లెక్కచేయలేదు.

అమోఘమేధతో  ఆమె ' బ్రెయిలీ ‘ లిపినినేర్చుకుని,పాండిత్యం సంపాదించింది.ఎన్నో అద్భుత గ్రంధాలు రచించింది.ప్రపంచమంతా పర్యటించి వికలాంగులకు ఎన్నో పాఠశాలలు ఏర్పాటుచేసింది. ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటుచేసింది. ఆమెతనవంటి వారికి ఉపయోగపడేలా ఎన్నో ఏర్పాట్లు చేసింది. ఆమె తనడైరీలో " నా ఏకాకితనంలో చదువుకోవడానికి,  ఆలోచించడానికి, నేర్చుకోవడానికి ఎంతో  అవకాశం,సమయం లభించాయి " అనివ్రాసుకునంది!

 చూశారా వంటరితనాన్ని ఎలా ఉపయోగించుకుని మనందరికీ మార్గదర్శకురాలైందో!ఆమెను వికలాగురాలని ఎవరంటారు?

 అమెరికాలోని మరో అద్భుత వ్యక్తినిచూస్తే ఆశ్చర్యంకలుగుతుంది 'జేంస్ తర్జర్ ' కు పసితనంలోనే ఒక కన్ను ప్రమాదవశాత్తూ పోయింది.... పెద్దయ్యాక రెండోకంటికీ చూపు పోయింది..,...ఐనా ఆయన న్యూయార్క్ పత్రికకు వ్యాసాలు వ్రాసేవాడు. అనేక పుస్తకాలూ,  నాటాకాలూ కూడా  వ్రాశాడు. అంతేకాక ఆయన పెద్దపేరుపొందిన పెద్ద కార్టూనిస్టు...

 మనదేశానికి చెందిన కొలహాపూర్ లోని ' గిల్ బిలే ' అనే వ్యక్తి చేతులు లేకుడానే పుట్టాడు. ఐనా అతడు సైకిలెక్కి తనంతట తానే తొక్కగలడు!
నీటిలో ఈదగలడు!
ఆత్మవిశ్వాసం ఉంటే చేయలేనిదే లేదని నిరూపించాడు!

 మనదేసానికి చెందిన మరో వ్యక్తి 'భరత్ రాజ్ ' రెండుచేతులూలేక పోయినా కాళ్ళతోనే అన్నిపనులూ చేసేస్తాడు! ప్రింటింగ్ ప్రెస్ లో ఉద్యోగంచేస్తూ తనను తానే పోషించు కుంటున్నాడు! తనస్నేహితులకు ఉత్తరాలు వ్రాస్తుంటాడుట! పొయ్యి వెలిగించి వంటచేస్తూ తనకే కాకతనతల్లికీ ఇంతవండి పెడ్తూ తల్లి ఋణంతీర్చుకుంటున్నాడు!

లండకుచెందిన ' నార్మన్ ' కి ఏదో ప్రమాదంలో కాళ్ళు తెగిపోయాయిట!   1981లో అతడు చంకకఱ్ఱల సాయంతో  అర్జంటీనాలోని 17వేల అడుగుల అత్తైన పర్వతాన్ని అధిరోహించి క్షేమంగా దిగివచ్చాడుట కూడా!

“లక్ష్యాన్ని మరువకపోడమే విజయానికి కీలకం ..”అంటాడు బెంజిమిన్ డిజ్రేలి.

మరి వీరంతా  వికలాంగులంటే ఎవరునమ్ముతారు.

ప్రపంచం లో పనికి రాని వాడంటూ ఎవరూ ఉండరు. అలాగని అందరూ తెలివైనవాళ్ళే ఉండరు . అంగవికలురూ ఇతరులవలెనే అనెక పనులు సక్రమంగా చేయగలరని నిరూపణ చేస్తూనే ఉన్నారు. తెలివికి,తెలివిలేని తనానికి అంగవైకల్యానికీ సంబంధంలేదు.

ఒకపని  చేయగలగడం,చేయలేకపోవడం అనేవి వ్యక్తుల సామర్ధ్యం మీద,ఆధారపడి ఉంటుంది తప్ప మరోటికాదు. మనం చేయగలిగినది ఎవరైనా చేయలేక పొతే మనం వాళ్ల కన్నా గొప్ప వాళ్ళం అనుకోవడంసర్వసాధారణమైపోయింది.అయితే వికలాంగులను అర్ధం చేసుకోడానికి ఐరిస్ అనే ఆవిడ ఏమంటారంటే "కూర్చున్న చోటినుండి లేవలేక పోవడం శారీరక సమస్య ఐతే, అలా లేవలేక పోవడానికి సరైన సహకారాన్ని అందించక పోవడమే అసలైన వైకల్యం అంటారు".

వికలాంగులు దేంట్లోనూ తీసుపోరు. వారి ప్రతిభ అనూహ్యమైనది.

 అసలు ‘వికలాంగులంటే ఎవరు?!’

తల్లి గర్భంలోఉండగా ఏవో కారణాల రీత్యా పుట్టుకతోనే అంగవికలురైనవారు,
పుట్టినతర్వాత  ఏ ప్రమాదానికో,  దురదృష్టవశాత్తూఏ అనారోగ్యాం బారినో పడి అవయవాలు కోల్పోయినవారు, నిజానికి వికలాంగులు

మనం 'వికలాంగులు 'అనే పదం వాడడం లేదు. ఆంగ్లంలో హేండీ క్యాప్డ్ లేదా డిజేబుల్ద్, అంటుంటాం.

వ్యాధులలోకొన్ని మానసికంగా ఏర్పడతాయి,శారీరక అనారోగ్యం నుండి కూడా మానసిక వ్యాధులు ఏర్పడతాయి. మానవులకు నిత్యం సాంఘీకజీవితంలో కలిగే సంఘర్షణలవలన , ప్రకృతి వైపరీత్యాలైన యుధ్ధము, క్షామము ,భూకంపము, సునామీ , రోడ్డుప్రమాదాల వంటి విపత్కర పరిస్థితులవల్ల నాడీ సంబంధ వ్యాధులు ,మనోవైకల్యం ఎర్పడి మనోరుగ్మతలూ, శారీరక వైకల్యం సైతం కలుగవచ్చు. దీనికి మానవ తప్పిదాలు  కారణంకావచ్చు., విధివైపరీత్యాలూ కావచ్చు., వాతావరణ పరిస్థితులు కావచ్చు.

 ఏదిఏమైనా ఫలితం కొందరు మానవులు వికలాంగులవడం సంభవిస్తుంటుంది.  వీటిలో కొన్నింటిని   పూర్తిగా సరిచేయవచ్చు,
కొన్నింటిని పాక్షికంగా సరిచేయవచ్చు,
మరికొన్నింటిని ఏవిధమైన వైద్య సహాయం వల్లా సరి చేయలేక పోవచ్చు, ఫలితంగా  వాటికి బలైన మానవులు జీవితాంతం వికలాంగులు గానే జీవించవలసి రావడం దురదృష్టం..

కానీ ప్రస్తుత ప్రపంచంలో .......

అన్నీఉండి ఇతరులకోసం ఏమీ చేయడానికి ముందుకు రాని వారు మానశిక వికలాంగులు [మెంటల్లీ డిసేబుల్డ్],

కాళ్ళూ చేతులూ ఉండీ ఇతరుల కోసం ఏ సేవాచేయనివారు ఫిజికల్లీ హేండీకాప్డ్ ,

కళ్ళుండీ ఇతరుల మoచి చూడలేనివారూ,మనతోటివారికి అవసరమైన సహాయమేంటో చూడలేనివారు నిజమైన  బ్లైండ్ పీపుల్.

ఇతరుల ఉన్నతస్థితికి బాధపడిఏడ్చేవారు, మెంటల్లీ రిటార్డెడ్ ,

అన్నీవయవాలూ సరిగా ఉండీ శ్రమచేయగల శక్తి సామర్ధ్యాలుండీ సోమరిగా ఉండే వారే అసలైన వికలాంగులనవచ్చేమో!

అందుకని ముందు మనలో ఉన్న ఇలాంటి అంగవైకల్యాన్ని మనంతట మనం చక్కబరచుకుని, మన అంగవైకల్యానికి ముందు వైద్యం చేయించుకుని  ఆతర్వాత, ఆ అంగవికలురకు చేయకలిగిన సేవ, సహాయం వారిపట్ల మన బాధ్యతగురించీఆలోచించాలి.
 
పుట్టుకతో వికలాంగులైనవారికి ప్రత్యేకమైన శక్తులుంటాయనే విషయమూ సత్యదూరంకాదు. చూపులేనివారు ఒక మారు విన్న స్వరాన్ని మరోమారువినగానే ఆవ్యక్తిని గుర్తిస్తారు.ఒక మారు స్పర్శతగిలినవారినీ రెండోమారు గుర్తించగలుగుతారు.వారికి గ్రహణ శక్తీ అధికంగానే ఉంటుంది!   

వికలాంగులు మానసికంగా ఆధైర్య పడకుండా ఆత్మస్థైర్యంతో అన్ని రంగాల్లో ముందుకు దూసు కెళుతున్నారు.

వికలాంగులు ఈ రోజు క్రీడలను నిర్వహిస్తారు .

వికలాంగ క్రీడాకారులు సాధారణ క్రీడాకారులకు ఏమాత్రం తీసిపోకుండా  ఆత్మస్థైర్యంతో కొన్ని క్రీడలలో పాల్గొంటూనె ఉన్నారు.

 ఇంకా వారిని అటు సమాజమూ,  ఇటు ప్రభుత్వం అన్నిరంగాల్లో రాణించ ప్రోత్సహించాలి.... అవకాశాలు కల్పించాలి.....

 ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వికలాంగుల పునరావసం మరియు వారి సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది.

వికలాంగుల పునరావస నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంచే 1981లో  ఆంధ్రప్రదేశ్‌ వికలాంగుల సహకార సంస్థ. 1983సంవత్సరం వికలాంగుల సంక్షేమ శాఖ స్థాపించడం జరిగింది. ప్రతి జిల్లాలో ప్రభుత్వ పథకాలు అమలు పర్చే నిమిత్తం సహాయ సంచాలకుల కార్యాలయాలు పనిచేస్తున్నవి.  ఆంధ్రప్రదేశ్‌లో వికలాంగులు పునరావాసం మరియు అభివృద్ధి కొరకు సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అంధ ,బధిర, మూగ బాలబాలికలకు ప్రత్యేక పాఠశాలలు ప్రభుత్వం నిర్వహిస్తుంది. వికలాంగుల సంక్షేమ శాఖ,ప్రాథమిక విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ పాఠశాలలు నడుస్తున్నాయి.భారత ప్రభుత్వం ద్వారా సహాయం పొందుతో కొన్ని , పొందకుండానే కోన్ని  ప్రభుత్వే తర సంస్థలు విద్యారంగంలో తమ వంతు సహాయం అందిస్తున్నాయి.

మనంకూడా దివ్యాంగులకు చెయూతనిద్దాం..వారినిగౌరవిద్దాం,అభిమానిద్దాం,చేయగలిగిన సాయం అందిద్దాం, ఆదరిద్దాం,వారిలో ఉన్న అధ్భుతశక్తులు ప్రపంచానికి నిరూపిద్దాం....

Thanks for reading December 3rd of each year is a World Disabled Day, so we have a brief mention of the disabled, KKV Naidu.

No comments:

Post a Comment