Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, December 19, 2019

Expectations for the 11th PRC


Expectations for the 11th PRC
ఉద్యోగుల్లో ఆశలు రేపుతున్న పే రివిజన్ లో
 భారీ అంచనాల్లో ఉద్యోగులు
11వ పీఆర్ సీ కోసం ఎదురుచూపులు
Expectations for the 11th PRC

Expectations for the 11th PRC

 రాష్ట్రంలో ఉద్యోగులు , ఉపాధ్యాయుల వేతన సవరణ జరగడానికి నియమించిన పేరివిజన్ కమిషనర్ అందించే నివేదిక కోసం ఉద్యోగులు , ఉపాధ్యాయులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు . ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఉద్యోగుల వేతనాలను పెంపుదల చేయడా నికి విశ్రాంత ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం పీఆర్సీ కమిషనర్‌గా నియమిస్తుంది . వీరు రాష్ట్రంలో ధరలు , పెరిగిన నిత్యావసర సరకుల ధరలు వంటి విషయాలను అధ్యయనం చేసి ప్రస్తుతం ఇస్తున్న వేతనాలను ఏ మేరకు పెంపు దల చేయాలన్న విషయాన్ని అంచనా వేసి ప్రభుత్వా నికి నివేదిక అందిస్తారు . ఈ నివేదికను ఆమోదించిన త ర్వాత కమిషనర్ సిఫారసు మేరకు ఎప్పటి నుంచి ఈ వేత నాల పెంపుదల అవసరమో గుర్తించి అప్పటి నుంచి పెంపుదల చేస్తుంది . ఈ పెంపుదల వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు అదనపు భారం పడుతుంది . అయిన్పటికీ ప్రతి ఐదేళ్లకొకసారి ఈ విధంగా వేతనాల పెంపుదల జరుగుతుం ది . అందువల్ల పీఆర్సీ కమిషనర్ అందించే నివేదిక కోసం ఉద్యోగులు , ఉపాధ్యాయులు , ఇతర కార్పొరేషన్ ఉద్యోగులు ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటారు . పీఆర్సీ అమలు జరి గిన ప్రతిసారి ప్రస్తుతం ఉన్న జీతాల కన్నా కనీసం పది శాతం అయినా అదనంగా వేతనాలు పెరుగుతాయి . కొన్ని పీఆర్సీ ల సమయంలో సగానికి సగం వేతనాలు పెరిగిన సందర్భాలు కూడా ఉన్నా యి . అందువల్ల ఉద్యోగులు ఈ కమిషనర్ అందించే నివేదిక కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు . రాష్ట్ర ప్రభుత్వ పేరివిజన్ ఇప్పటి వరకు పదిసార్లు జరిగింది . ప్రతి ఐదేళ్లకొకసారి రివిజన్ జరుగుతుంది . అయితే కొంతమంది కమిషనర్ల నియామకం జరిగిన తర్వాత ఆలస్యంగా నివేదిక అందించడం వల్ల కూడా ఒకోసారి ఆలస్యం జరుగుతుంది . ప్రస్తుత కమిషనర్ విశ్రాంత ఐఏఎస్ అధికారి అసుతోశ్ మిశ్రా నియామకం జరిగి ఏడాది పూర్తయింది . రెండు నెలల పాటు అతని ప దవీ కాలాన్ని పొడిగించారు . తాజాగా రెండు రోజుల కిందట రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు నెలలు అతని పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిం ది . పదవీ కాలం పూర్తయ్యే లోపల ఆయన ప్రభు త్వానికి నివేదిక అందించవలసి ఉంటుంది . ఇప్పటి వరకు జైరాంబాబు , శంకర గురుస్వామి , సీఎరావు , గోనెల వంటి సీనియర్ అధికారులు కమిషనర్లుగా పని చేశారు . ఉద్యోగులకు సంబం ధించి వివిధ విషయాలను అధ్యయనం చేసి వారికి ఏది అవసరమో దానిని మంజూరు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంటారు . వారు సిఫారసు చేసిన అంశాలను తప్పనిసరిగా ప్రభుత్వం అమలు చేయవలసి ఉంటుంది . అందు వల్ల ఈ కమిషనర్లకు వారి పదవీ కాలంలో ఉద్యోగుల ఇబ్బందులను పరిష్కరించవలసిన ఆర్థిక సమస్యలను ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు నివేదికల రూపంలో అందిస్తుంటారు . వీటిని పరిశీలించి అందులో సాధక బాధలు , ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులను అంచనా వేసి సిఫా రసులో పేర్కొంటారు . ఈ కమిషనర్లకు ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించి అవసరమైన సిబ్బందిని , కేంద్ర , రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యాలయాలు కేటాయిస్తుంది . రాష్ట్రంలో వివిధ ప్రాంతాలను పర్యటించడానికి కూడా అవకాశం కల్పిస్తుంది . ఈ కమిషనర్లు నివేదిక సమర్పించే వరకు , వీరి పదవీ కాలం ఉంటుంది . నివేదిక అందించిన తర్వాత నుంచి ఉండదు . ప్రస్తుత కమిషనర్ నివేదిక ఎప్పుడు అందిస్తారోనని ఉద్యోగులు ఆశతో ఎదురు చూస్తున్నారు .
మధ్యంతర భృతితో అందజేత
 ప్రస్తుతం అమలు చేయవలసిన 11వ వేతన సవరణ వాస్తవానికి 2018 జూలై నుంచి అమలు చేయాలి . కాని నివేదిక ఆలస్యం కావడం వల్ల ఇప్పటి వరకు అమలు కాలేదు . ఈ కమిషనర్ , పదవీ కాలం కొత్త ఏడాది ఫిబ్రవరి వరకు ఉంటుంది . ఈలోగా ఎప్పుడైనా నివేదిక అందించాలి . లేదా పదవీ కాలం పూర్తయిన తర్వాత కూడా అందించవచ్చు . ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో పెట్టి ఆమోదం తీసుకు న్న తర్వాత మాత్రమే అమల్లోకి వస్తుంది . ఇవన్నీ జరగడానికి 2020 ఫిబ్రవరి నెలా ఖరు తర్వాత మరో రెండు నెలలు కాలం పట్టే అవకాశం ఉంది . అందువల్ల ఈ పీఆర్సీ సిఫారసులు అమలు చేయడానికి నియామకం జరిగిన తర్వాత రెండేళ్ల కాలం పట్టే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంటున్నారు . పీఆర్సీ ఆలస్యం జరుగుతున్నందున అంతవరకు ఉద్యోగుల మూల వేతనం ఎంత వస్తుందో , అందులో 27 శాతం తాత్కాలిక భృతి ( ఇంటీరియం రిలీఫ్ ) గా ఇస్తారు . పీఆర్సీ కమిషనర్ నివేదిక అందించిన తర్వాత పెరిగిన వేతనాలకు ఈ ఇంటీరియం రిలీఫ్ ను అంతవ రకు పొందుతున్న కరవు భత్యాన్ని కలిపి వేతనాన్ని నిర్ణయించవలసి ఉంటుంది . అందువల్ల ప్రస్తుతం ఉద్యోగులు పొందుతున్న వేత నాలు 27 శాతం పైబడి పెంపుడల జరిగే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి .

Thanks for reading Expectations for the 11th PRC

No comments:

Post a Comment