Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, December 16, 2019

Google Bolo- The best Language Learning Android App


Google Bolo- The best Language Learning Android App
Designed for primary grade children, Bolo helps to improve their English & Hindi reading skills, by encouraging them to read aloud - just as they would naturally do - and giving them instant feedback - even when completely offline.

  టెక్నాలజీ ,సెర్చి ఇంజిన్ దిగ్గజం 'గూగుల్' ఇండియా నుంచి మరో కొత్త యాప్ వచ్చేసింది. 'బోలో' పేరుతో చిన్నారుల కోసం సరికొత్త యాప్‌ను తీసుకొచ్చింది.ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ వేదికను అభివృద్ధి చేసే దిశగా గూగుల్ ఈ కొత్త యాప్‌ను ప్రత్యేకంగా రూపొందించింది. పిల్లలకు హిందీ, ఇంగ్లీషు భాష నేర్పే యోచనతో ఈ అప్లికేషన్‌ను లాంచ్‌ చేసింది. దీనిద్వారా చిన్నారులు హిందీ, ఇంగ్లిష్ భాషలను సులభంగా నేర్చుకోవచ్చు.
ఈ యాప్‌లో యానిమేటెడ్ క్యారెక్టర్ 'దియా' పిల్లలకు హిందీ, ఇంగ్లిష్ నేర్పించడంతోపాటు కథలు చెప్పడం, మాటలు నేర్పించడం వంటివి చేస్తుంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల కోసం దీన్ని తీసుకొచ్చింది.

పిల్లలే కాదు.. తల్లిదండ్రులు కూడా

  ఈ యాప్ ద్వారా పిల్లలే కాదు.. తల్లిదండ్రులు కూడా కొత్త పదాలు నేర్చుకోవచ్చు. ప్రతి పదానికి అర్థం ఏంటో తెలుసుకోవచ్చు. ఈ యాప్‌లో యానిమేటెడ్ క్యారెక్టర్ 'దియా' పిల్లలకు హిందీ, ఇంగ్లీష్ నేర్పిస్తుంది. అంతేకాదు కథలు చెబుతుంది, మాటలు నేర్పిస్తుంది.
ఆసక్తికరమైన వర్డ్ గేమ్స్ ఫీచర్
గూగుల్ అందించే బోల్ యాప్ లో ఆసక్తికరమైన వర్డ్ గేమ్స్ ఫీచర్ ఉన్నాయి. ఫన్నీగా, ప్లేఫుల్ గా పదాలను పిల్లలు నేర్చుకునేందుకు వీలుగా రూపొందించింది. బోలో యాప్ ను పిల్లలంతా తమ ప్రొగ్రెస్ ను వేర్వేరుగా ట్రాక్ చేసుకోవచ్చు.

ఇంటర్నెట్ కనెక్టవిటీ లేకుండానే

  ఇంటర్నెట్ కనెక్టవిటీ లేకుండానే ఈ యాప్ పనిచేస్తుంది. ఆఫ్ లైన్ లో కూడా బోలో యాప్ పనిచేస్తుంది. ఇందులో ఎలాంటి యాడ్స్ డిసిప్లే కావు. దీంతో పిల్లలు రీడింగ్ పైనే దృష్టి పెట్టేందుకు వీలు ఉంటుందని గూగుల్ తెలిపింది. ఇంటర్నేట్ సౌకర్యం లేని ప్రాంతాల్లో కూడా యాక్సస్ అయ్యేందుకు వీలుగా గూగుల్ ఈ యాప్ ను రూపొందించింది.

స్పీచ్ రికగ్నిషన్, టెక్ట్స్-టు-స్పీచ్ టెక్నాలజీ

  ఈ యాప్‌‌‌ను స్పీచ్ రికగ్నిషన్, టెక్ట్స్-టు-స్పీచ్ టెక్నాలజీల సాయంతో ప్రాథమిక విద్యార్థుల కోసం రూపొందించినట్లు గూగుల్‌ వెల్లడించింది. ఆండ్రాయిడ్ వినియోగదారులు దీనిని గూగుల్‌ ప్లే ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. యాడ్‌ ఫ్రీ ఉన్న ఈ 'బోలో' యాప్‌ ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేయడం విశేషం.

200 గ్రామాల్లో కొన్ని నెలలపాటు

  గూగుల్ ఈ యాప్‌ను 'యాన్యువల్ స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిసెర్చ్‌ సెంటర్‌ (ASER)' సహాయంతో ఉత్తరప్రదేశ్‌లోని 200 గ్రామాల్లో కొన్ని నెలలపాటు పరీక్షించి కేవలం మూడు నెలలలోనే 64 శాతం మంది పిల్లలలో చదివే నైపుణ్యం పెరగడాన్ని గుర్తించినట్లు తెలిపింది.

ఒక్కో రాష్ట్రంలో అక్షరాస్యత శాతం

  నాణ్యమైన పాఠాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఒక్కో రాష్ట్రంలో అక్షరాస్యత శాతం ఒక్కోలా ఉందని పేర్కొంది. బోలో యాప్‌తో పిల్లల్లో చదివే ఆసక్తి, నైపుణ్యం పెరుగుతుందని గూగుల్ ధీమా వ్యక్తంచేసింది.ఈ యాప్ లో రీడింగ్ మెటేరియల్ క్యాటలాగ్ కూడా ఉన్నాయి.

ఎన్నో స్టోరీలు

  ఇందులో ఎన్నో స్టోరీలు ఉంటాయి. పిల్లలు చదివేందుకు వీలుగా ఇంగ్లీష్ భాషలో 40 స్టోరీలు, హిందీ భాషలో 50 స్టోరీలు ఉంటాయి. ఈ స్టోరీలన్నీ పూర్తిగా ఉచితంగా గూగుల్ అందిస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని స్టోరీలను అందించే దిశగా గూగుల్ ప్లాన్ చేస్తోంది.

అన్నీ ప్రాంతీయ భాషల్లోనూ

  అన్నీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో ఈ యాప్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 4.4 (కిట్ కాట్)కు హైయర్ వర్షన్ లో సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ యాప్ ను ప్రాంతీయ హిందీ మాట్లాడేవారి కోసం మాత్రమే డిజైన్ చేశారు. భవిష్యత్తులో ఇండియాలో అన్నీ ప్రాంతీయ భాషల్లోనూ ఈ యాప్ ను అందుబాటులోకి తెచ్చేందుకు గూగుల్ ప్లాన్ చేస్తోంది.
Download... Google Bolo android App

Thanks for reading Google Bolo- The best Language Learning Android App

No comments:

Post a Comment