Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, December 16, 2019

Excellent feature in Google Assistant!


Excellent feature in Google Assistant!

గూగుల్‌ అసిస్టెంట్‌లో అద్భుతమైన ఫీచర్‌!


గూగుల్‌ అసిస్టెంట్‌లో అద్భుతమైన ఫీచర్‌!
వీడియోలు,సినిమా,క్రీడలు,  బిజినె స్ఫ్యామిలీ ఫోటోలు ట్రెండింగ్
టెక్‌ దిగ్గజం గుగూల్‌ మరో అద్భుతమైన ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇక నుంచి గూగుల్‌ అసిస్టెంట్‌లో ఇంటర్‌ప్రెటర్‌ (దుబాసీ) మోడ్‌ అందరికీ  అందుబాటులో రానుంది. ఈ రియల్‌ టైమ్‌ ట్రాన్సలేషన్‌ ఫీచర్‌ను వాడుకొని ప్రపంచంలోని దాదాపు 44 భాషల్లో మాట్లాడవచ్చు. మన దేశానికి చెందిన బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళ్‌, తెలుగు, ఉర్దూ తదితర తొమ్మిది భాషల్లో ఈ ఫీచర్‌ పనిచేస్తోంది. ఈ ఫీచర్‌ తెరిచి మనకు వచ్చిన భాషలో మాట్లాడితే చాలు.. అది వెంటనే మనకు కావాల్సిన భాషలో అనువాదం చేసి పెడుతోంది. విదేశీ పర్యటనకు, పక్క రాష్ట్రాలకు వెళితే.. అక్కడి భాష తెలియనివారికి ఈ ఫీచర్‌ ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొత్త భాషలు నేర్చుకునేవారికి ఈ ఫీచర్‌ ఎంతో హెల్ప్‌ఫుల్‌గా ఉండనుంది.

మొదట 2019 జనవరిలో కన్జుమర్‌ ఎలక్ట్రానిక్‌ షో (సీఈఎస్‌)లో ఇంటర్‌ప్రెటర్‌ మోడ్‌ గురించి మొదట పరిచయం చేసిన గూగుల్‌.. తమ కంపెనీకి చెందిన గూగుల్‌ హోమ్‌ డివైజెస్‌, స్మార్ట్‌ డిస్‌ప్లేలలో ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఈ స్మార్‌ టెక్నాలజీని అన్ని స్మార్ట్‌ఫోన్లలో అందుబాటులోకి తెచ్చింది. గూగుల్‌ అసిస్టెంట్‌ ద్వారా ఇక ఫీచర్‌ పనిచేస్తుంది. అండ్రాయిడ్‌ ఫోన్‌లలో బైడిఫాల్ట్‌గా గూగుల్‌ అసిస్టెంట్‌ అందుబాటులో ఉండగా.. ఇప్పుడు ఐఫోన్‌లలో కూడా ఇది అందుబాటులోకి వచ్చింది. గూగుల్‌ అసిస్టెంట్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని.. ఈ ఫీచర్‌ను ఐఫోన్‌లో కూడా ఎంచక్కా వాడుకోవచ్చు.
ఈ దుబాసీని వాడటం ఎలా?
గుగూల్‌ అసిస్టెంట్‌ ఇంటర్‌ప్రెటెర్‌ మోడ్‌ను వాడటం చాలా సులువు. మీ స్మార్ట్‌ఫోన్లలోని గూగుల్‌ అసిస్టెంట్‌ను తెరిచి.. ఇంటర్‌ప్రిటెర్‌ మోడ్‌ను డైరెక్ట్‌గా వాడొచ్చు.
‘ఓకే గూగుల్‌ లేదా హే గూగుల్‌’ అనే వాయిస్‌ కమాండ్‌తో గూగుల్‌ అసిస్టెంట్‌ను తెరవచ్చు. లేదా అండ్రాయిడ్‌ ఫోన్లలో పవర్‌ బటన్‌ను ప్రెస్‌ చేయడం ద్వారా గూగుల్‌ అసిస్టెంట్‌ ఓపెన్‌ అవుతోంది.
- "Hey Google, be my Tamil translator" or "Hey Google, help me English From Telugu" వంటి కమాండ్స్‌తో డైరెక్ట్‌గా ఇంటర్‌ప్రిటెర్‌ మోడ్‌ ఓపెన్‌ అవుతోంది.
మీకు ఏ భాష రాకుంటే.. ఆ భాషలో ఇంటర్‌ప్రెటెర్‌ మోడ్‌ను ఓపెన్‌ చేసి సంభాషించడమే. మీకు వచ్చిన భాషలో మాట్లాడితే.. కావాల్సిన భాషలోకి గూగుల్‌ అసిస్టెంట్‌ అనువాదం చేసి ఇస్తుంది. కొత్త కొత్త భాషలు నేర్చుకోవాలనుకునే వారికి ఇదెంతో పనికొచ్చే ఫీచర్‌ అని చెప్పవచ్చు.

DOWNLOAD ..Google Assistant APP



• 

Thanks for reading Excellent feature in Google Assistant!

No comments:

Post a Comment