Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, December 7, 2019

govt Jobs: Inter-qualified central government job ..SSC-CHSL... Notification Release.


govt Jobs: Inter-qualified central government job ..SSC-CHSL... Notification Release.

govt Jobs: Inter-qualified central government job ..SSC-CHSL... Notification Release.

Govt Jobs: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం... నోటిఫికేషన్ రిలీజ్.


 ఇంటర్ పాసయిన వారికి  గుడ్ న్యూస్. ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రతీ ఏడాది లాగే 2019-2020 సంవత్సరానికి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ CHSL (10+2) ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. దరఖాస్తు లింక్ కూడా యాక్టివేట్ అయింది. ఆసక్తిగల అభ్యర్థులు https://ssc.nic.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. కాంపిటీటీవ్ ఎగ్జామినేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ శాఖలు, కార్యాలయాలు, సంస్థల్లో లోయర్ డివిజనల్ క్లర్క్, పోస్టల్ అసిస్టెంట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ప్రతీ ఏటా రెండు సార్లు కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (10+2) ఎగ్జామ్ జరుగుతుంది. ప్రస్తుతం రెండో దశ నోటిఫికేషన్ విడుదలైంది. ఖాళీల వివరాలను https://ssc.nic.in/ వెబ్‌సైట్‌లో Candidates Corner సెక్షన్‌లో Tentative Vacancy లింక్‌లో తెలుసుకోవచ్చు.

SSC CHSL examination 2019: భర్తీ చేసే పోస్టులు ఇవే...


లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) / జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ (JSA)

పోస్టల్ అసిస్టెంట్ (PA) / సార్టింగ్ అసిస్టెంట్ (SA)

డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO)
డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ

SSC CHSL examination 2019: గుర్తుంచుకోవాల్సిన తేదీలు


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 03

దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 10

ఆన్‌లైన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ- 2020 జనవరి 12

ఆఫ్‌లైన్ చలానా జనరేట్ చేయడానికి చివరి తేదీ- 2020 జనవరి 12

చలానా ద్వారా పేమెంట్ చేయడానికి చివరి తేదీ- 2020 జనవరి 14 బ్యాంకు వేళలు ముగిసేవరకు

కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్- మొదటి దశ- 2020 మార్చి 16 నుంచి 2020 మార్చి 27

రెండో దశ పరీక్ష (డిస్క్రిప్టీవ్ పేపర్)- 2020 జూన్ 28

వయస్సు- 2020 జనవరి 1 నాటికి 18 నుంచి 27 ఏళ్లు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, అన్‌రిజర్వ్‌డ్ వికలాంగులకు 10 ఏళ్లు, అన్‌రిజర్వ్‌డ్ ఓబీసీలకు 13 ఏళ్లు, అన్‌రిజర్వ్‌డ్ ఎస్సీ, ఎస్టీలకు 15 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

ఫీజు- రూ.100

విద్యార్హత- లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) / జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ (JSA), పోస్టల్ అసిస్టెంట్ (PA) / సార్టింగ్ అసిస్టెంట్ (SA), డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) పోస్టులకు 12వ తరగతి పాస్ కావాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ పోస్టులకు సైన్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌తో 12వ తరగతి పాస్ కావాలి.

Thanks for reading govt Jobs: Inter-qualified central government job ..SSC-CHSL... Notification Release.

No comments:

Post a Comment