Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, December 8, 2019

Special App for Census, Census is done using technology .


 Special App for Census, Census is done using technology .
Special App for Census, Census is done using technology .

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జనగణన-2021 కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులను ఆదేశించారు. 2011 జనగణనలో సమగ్రకుటుంబ సర్వే జనగణన వివరాలను తెలుసుకున్నారు. ఈ 2021లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి జనగణన విధానాలను రూపొందించినట్లు అధికారులుపేర్కొన్నారు 2021లో జనాభా గణన చేసేసేందుకు తీసుకున్న చర్యలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆధికారులకు సీఎస్ వివరించారు, ఈ విషయాన్ని జనగణన డైరెక్టర్ కె.ఇలంభారతి పవర్
పొయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గతంలో పేపర్ విధానం ద్వారా జనగణన వివరాలను సేకరించడం జరిగిందన్నారు. 2020లో పేపర్తో పాటు మొబైల్ యాప్లో, స్వీయగణన ద్వారా జనగణన వివరాలు నమోదు చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించారు. జనగణనకు సంబంధించిన సర్వర్ కు ఈ వివరాలు అనుసంధానించబడుతాయని
వివరించారు. తద్వారా త్వరితగతిన తుది వివరాల జాబితా సిద్ధమవుతుందన్నారు. రాష్ట్ర స్థాయిలో దీన్ని పర్యవేక్షించేందుకు నోడల్ డిపార్ట్ మెంట్ జీఏడీ(జీసీఎం అండ్ ఏఆర్) జిల్లాస్థాయిలో కలెక్టర్ తో పాటు క్షేత్రస్థాయిలో కార్పొరేషన్కమిషనర్లు, తహాసిల్దార్లు ఉంటారు.వివరాలసేకరణలో ఉపా
ధ్యాయులు, ఇతర రాష్ట్రప్రభుత్వ అధికారులు,స్థానికసంస్ధల అధికారులు ఉంటారని వివరించారు. ఈ జనగణన రెండు దశల్లో జరుగుతుందన్నారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబరు మధ్య కాలంలో 45 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు వ్యవధి మించకుండా మొదటి దశలో ఇంటిగణన, గృహాలకు సంబంధించిన గణన వివరాలను సేకరిస్తారు. ఆదే విధంగా రెండో దశలో ఫిబ్రవరి 2021 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు జనాభా వివరాలను సేకరించి నమోదు చేస్తారు. 28 ప్రశ్నలతో కూడిన నమోదు వివరాల పత్రం రూపొందించినట్లు తెలిపారు. నాలుగు విధాలుగా అంటే జనాభా, సామాజిక,సాంస్కృతిక, ఆర్థిక, వలస వంటి తదితర వివరాల సేకరణ జరుగుతుందన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్ రూపొందించడం జరిగిందన్నారు. ప్రయోగాత్మకంగా విజయనగరం(భోగాపురం మండలం), అనంతపురం (ఆత్మకూరు మండలం), గుంటూరు(నరసరావుపేట మండలం) జిల్లాల నుంచి ఒక్కొక్క ప్రాంతాన్ని(మండలం) ఎంచుకొని
వివరాలు నమోదు కార్యక్రమం చేయడం జరిగిందన్నారు. జాబితా తయారీ విషయంలో గతంతో పాలిస్తే కేవలం సంవత్సరం వ్యవధిలోనే తుది జాబితాను తయారు చేయడం
జరుగుతుందని వివరించారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో ముగ్గురికి జాబితా సేకరణ విషయంలో శిక్షణ ఇచ్చామన్నారు, నవంబరు 25వ తేదీ నుంచిడిసెంబరు 7వ తేదీవరకు 58 మంది రాష్ట్ర ప్రభుత్వ ఆధికారులకు హైదరాబాద్లో మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్లో శిక్షణ పొందుతున్నారని తెలిపారు. అనంతరం 2020వ సంవత్సరం జనవరి నెలలో సుమారు2500 మంది ఆధికారులకుజిల్లాల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. అదేవిధంగా 2020
సంవత్సరం ఏప్రిల్ నెలలో సుమారు 1,23,573
మందికి ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. 2019-20వ సంవత్సరానికి గాను. రాష్ట్ర ప్రభుత్వం జనగణన కార్యక్రమం నిర్వహణకు రూ. 14.98కోట్లు నిధులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. జనగణనలో పాల్గొనే సంబంధిత ఆధికారులను బదిలీ చేయ
వద్దనిపేర్కొన్నారు. పంచాయతీలు, గ్రామాలు, మండలాలు వంటి విలీన ప్రక్రియలు ఏదైనా ఉంటే డిసెంబరు 31లోపు పూర్తి చేయాలని కోరారు. సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి శశి భూషణ్ కుమార్, పంచాయతీరాజ్ సెక్రటరీ గోపాల
కృష్ణడ్వివేది, ఇతరశాఖల ఉన్నతాధికారులతో జనగణనవిధి విధానాలపై సీఎస్ చర్చించారు. విధి నిర్వహణలో జనగణనకు సంబంధించిన శాఖాధికారులు తగు శ్రద్ధ వహించి పకడ్బందీగా లోపాలు లేకుండా జనగణన వివరాలు సేకరణ
చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెన్సస్ డైరెక్టర్ కెకె.ఇలంభారతి, జాయింట్ డైరెక్టర్ టి.ఎల్.ఎన్.శేష కుమారి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణద్వివేది, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి శశి భూషణ్ కుమార్, ఎకనామిక్స్ అండ్ స్టాటిక్స్ డైరెక్టర్ వి.ప్రతిమ, రెవెన్యూ సీసీఎల్ఏ, పాఠశాల విద్యాశాఖ, పురపాల, పట్టణాభివృద్ధి శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.

Thanks for reading Special App for Census, Census is done using technology .

No comments:

Post a Comment