Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, December 28, 2019

Staff Selection Commission -Combined Graduate Level (CGL) Jobs -2020


Staff Selection Commission -Combined Graduate Level  (CGL)Jobs -2020


ఎస్‌ఎస్‌సీ-కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్(సీజీఎల్)

    గ్రూప్-బీ, గ్రూప్- సీ పోస్టులు :కేంద్ర ప్రభుత్వ కొలువు సాధించడం చాలామంది యువత కల. కేంద్రంలో గ్రూప్-బీ, గ్రూప్-సీ పోస్టులు ప్రధానమైనవి. వీటిని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ‘కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్(సీజీఎల్)’ పరీక్ష ద్వారా భర్తీ చేస్తుంది. గ్రూప్-బీ పోస్టుల్లో రెండు గెజిటెడ్ ఆఫీసర్(అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్) పోస్టులుంటాయి. అలాగే సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్, ఇంటెలిజెన్స్ బ్యూరో, రైల్వే మినిస్టరీ, విదేశాంగ శాఖ, సీబీఐ, ఇన్‌కమ్ ట్యాక్స్, పోస్టల్ డిపార్ట్‌మెంట్, రెవెన్యూ డిపార్ట్‌మెంట్,ఎన్‌ఐఏ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, కస్టమ్స్ డిపార్ట్‌మెంట్‌లలో గ్రూప్-బీ,సీ పోస్టులుంటాయి. వీటిలో ఫీల్డ్ జాబ్, డెస్క్ జాబ్ రెండు రకాలుంటాయి. ఫీల్డ్ జాబ్‌లో భాగంగా వివిధ కంపెనీలు, పరిశ్రమలు, కర్మాగారాలు సందర్శించి వారి నుంచి సమాచారం సేకరించడం, ప్రభుత్వ అనుమతులు, నిబంధనల ప్రకారం నడుపుతున్నారా లేదా, ట్యాక్సులు సక్రమంగా కడుతున్నారా లేదా వంటి విషయాలను పరిశీలించాలి. ఫీల్డ్ ఉద్యోగులు సేకరించిన సమాచారం ఆధారంగా డెస్క్ ఉద్యోగుల విధులుంటాయి.

అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు 10+2లో మ్యాథమెటిక్స్‌లో 60శాతం మార్కులు వచ్చుండాలి(లేదా) గ్రాడ్యుయేషన్‌లో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా చదివుండాలి.

దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్ 15, 2020

దరఖాస్తుకు చివరితేదీ: అక్టోబర్ 15, 2020

పరీక్ష తేదీ: దరఖాస్తుల ప్రారంభానికి ముందే వెబ్‌సైట్‌లో తెలియజేస్తారు.

ఎంపిక :ఎంపిక ప్రక్రియ నాలుగంచెల్లో జరుగుతుంది. టైర్-1,2 పరీక్షలను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. టైర్-3 డిస్క్రిప్టివ్ పరీక్ష. టైర్-4 కంప్యూటర్ స్కిల్ టెస్ట్. గతంలో ఉన్న ఇంటర్వ్యూ విధానం తీసేసి.. ఆ స్థానంలో టైర్-3, 4లను ప్రవేశ పెట్టారు. ప్రతి విభాగంలో నిర్దేశిత మార్కులు సాధిస్తేనే.. తర్వాతి పరీక్షలకు అర్హత లభిస్తుంది. ఆన్‌లైన్ పరీక్షలో రుణాత్మక మార్కులు (1/4 వంతు) ఉన్నాయి.

పరీక్ష విధానం :


  1. టైర్-1: ప్రతి విభాగం నుంచి 25 ప్రశ్నల చొప్పున మొత్తం నాలుగు విభాగాల్లో 100 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. పరీక్ష సమయం 60 నిమిషాలు.
  2. టైర్-2: టైర్-1లో కనీస అర్హత మార్కులు పొందిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకున్న పోస్టులకు అతీతంగా పేపర్-1, పేపర్-2 పరీక్షలు రాయాలి.
  3. పేపర్-1లో మ్యాథమెటిక్స్, అర్థమెటిక్స్ అంశాల నుంచి 100 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. పరీక్ష సమయం 2 గంటలు.
  4. పేపర్-2లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 200 ప్రశ్నలు వస్తాయి. 200 మార్కులకు జరిగే ఈ పరీక్ష సమయం 2 గంటలు.
  5. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారు పేపర్-3 రాయాలి. స్టాటిస్టిక్స్ విభాగం నుంచి 100 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. పరీక్ష సమయం రెండు గంటలు.
  6. గ్రూప్-బీ గెజిటెడ్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న వారు పేపర్-4 రాయాలి. ఎకనామిక్స్, ఫైనాన్స్ అంశాల నుంచి 100 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. పరీక్ష సమయం రెండు గంటలు.
  7. టైర్-3: ఇంగ్లిష్ లేదా హిందీ మాద్యమాల్లో ఏదైనా ఒకటి ఎంచుకొని పెన్, పేపర్ విధానంలో డిస్క్రిప్టివ్ పరీక్ష రాయాలి. ఎస్సే, లెటర్, అప్లికేషన్ రైటింగ్ సంబంధిత ప్రశ్నలు వస్తాయి. 100 మార్కులకు జరిగే ఈ పరీక్ష ను 60 నిమిషాల వ్యవధిలో పూర్తి చేయాలి.
  8. టైర్-4: కంప్యూటర్ స్కిల్ టెస్ట్ లేదా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో అభ్యర్థుల టైపింగ్ సామర్థ్యాన్ని పరిశీలిస్తారు.

ఏ విభాగం నుంచి ఎన్ని మార్కులు..?
టైర్-1, 2 పరీక్షల్లో పేపర్-3, 4 మినహా మొత్తం 600 మార్కులకు సీజీఎల్ పరీక్ష జరుగుతుంది. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 250 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్, కాంప్రహెన్షన్‌ల నుంచి 250 మార్కులు ఉంటాయి. కాబట్టి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్‌ల నుంచి అత్యధిక మార్కులు తెచ్చుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ.

Thanks for reading Staff Selection Commission -Combined Graduate Level (CGL) Jobs -2020

No comments:

Post a Comment