Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, December 30, 2019

These are the Banking Rules which will be implemented from January 1,2020


These are the Banking Rules which will be implemented from January 1,2020

జనవరి 1 నుంచి అమలయ్యే బ్యాంకింగ్‌ రూల్స్‌ ఇవే
These are the Banking Rules which will be implemented from January 1,2020


  కొత్త ఏడాది వస్తుందంటే ఎవరికైనా ఉత్సాహంగానే ఉంటుంది. ఆ ఏడాదిలో అంతా కలిసి రావాలని అందరూ కోరుకుంటుంటారు. అయితే ఆ విషయం సంగతి అటుంచితే.. బ్యాంకింగ్‌ కస్టమర్లకు మాత్రం కొత్త ఏడాది ఆరంభం నుంచి పలు చార్జిల భారం తప్పనుంది. ఇక ఎస్‌బీఐ తన కస్టమర్ల అకౌంట్లకు మరింత భద్రతను కల్పించేందుకు ఓ నూతన విధానాన్ని కొత్త ఏడాది ఆరంభం నుంచి అమలు చేయనుంది.

రూపే, యూపీఐ చెల్లింపుల చార్జిలు ర‌ద్దు...


  దేశంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపే, యూపీఐ చెల్లింపులపై చార్జిలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఆ రూల్‌ జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది. ఇకపై రూపే, యూపీఐ ప్లాట్‌ఫాంలపై జరిపే చెల్లింపులపై ఎలాంటి చార్జిలు ఉండవు. దీంతో రూపే డెబిట్‌ కార్డుల ద్వారా చెల్లింపులు జరిపితే ఎలాంటి ఎండీఆర్‌ చార్జిలను వ్యాపారులు వసూలు చేయరాదు.

నెఫ్ట్ చార్జిల ర‌ద్దు...


   డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఆర్‌బీఐ ఇకపై నెఫ్ట్‌ (NEFT) చార్జిలను వసూలు చేయకూడదని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. ఈ క్రమంలోనే జనవరి 1వ తేదీ నుంచి ఆ రూల్‌ అమలులోకి రానుంది. దీంతో బ్యాంకింగ్‌ కస్టమర్లు ఎలాంటి రుసుము లేకుండానే నెఫ్ట్‌ విధానంలో నగదు ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు.

ఎస్‌బీఐ ఓటీపీ ఆధారిత న‌గ‌దు విత్‌డ్రా...


   దేశంలోనే అతి పెద్ద బ్యాంకింగ్‌ సంస్థ ఎస్‌బీఐ జనవరి 1వ తేదీ నుంచి ఏటీఎంలలో డబ్బులు డ్రా చేసే విషయంలో నూతన విధానాన్ని అమలు చేయనుంది. ఎస్‌బీఐ కస్టమర్లు ఏటీఎంల నుంచి రూ.10వేలు అంతకన్నా ఎక్కువగా నగదును విత్‌డ్రా చేస్తే ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఏటీఎంలో వెరిఫై చేసుకోవడం ద్వారా నగదును విత్‌డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు గాను ఎస్‌బీఐ కస్టమర్లు ఏటీఎం సెంటర్‌కు వెళ్లినప్పుడు తప్పనిసరిగా తమ వెంట ఫోన్‌ను తీసుకెళ్లాల్సి ఉంటుంది

Thanks for reading These are the Banking Rules which will be implemented from January 1,2020

No comments:

Post a Comment