Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, December 30, 2019

Here are 4 things you need to complete by December 31st!


Here are 4 things you need to complete by December 31st!

డిసెంబర్‌ 31లోగా మీరు పూర్తి చేయాల్సిన 4 పనులు ఇవే..!
Here are 4 things you need to complete by December 31st!

  మరి కొద్ది గంటల్లో 2019 ఏడాది ముగిసి 2020 కొత్త సంవత్సరం రానుంది. కొత్త ఏడాదిలో ఏమేం చేయాలో ఇప్పటికే చాలా మంది ప్రణాళికలు వేసుకుంటుంటే.. డిసెంబర్‌ 31వ తేదీలోపు పూర్తి చేయాల్సిన పలు ముఖ్యమైన పనులను చాలా మంది పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే ఆ తేదీలోపు ప్రతి ఒక్కరూ పూర్తి చేయాల్సిన 4 ముఖ్యమైన ఆర్థిక సంబంధ పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాo.

ఆధార్‌-పాన్‌ లింక్‌...

  దేశంలో ఉన్న పాన్‌ కార్డు హోల్డర్లు అందరూ తమ కార్డులను ఆధార్‌ కార్డులకు లింక్‌ చేసుకోవాలని ఇన్‌కమ్‌టాక్స్‌ విభాగం గతంలోనే ఎన్నో డెడ్‌లైన్లు విధించింది. అందులో భాగంగానే డిసెంబర్‌ 31, 2019వ తేదీని అందుకు ఆఖరి గడువుగా ప్రకటించింది. రేపటిలోగా ఆ రెండు కార్డులను లింక్‌ చేయకపోతే ఆ తరువాత అవి పనిచేయవని ఇన్‌కమ్‌టాక్స్‌ విభాగం చెబుతోంది.
               Click Here ....More Details

ఇన్‌కమ్‌టాక్స్‌ రిటర్న్స్‌ ఫైలింగ్‌...

  2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాలకు గాను ఇంకా ఇన్‌కమ్‌టాక్స్‌ రిటర్న్స్‌ను ఫైల్‌ చేయని వారు 2019, డిసెంబర్‌ 31వ తేదీ లోపు రూ.5వేల ఆలస్య రుసుముతో ఆ రిటర్న్స్‌ను ఫైల్‌ చేసేందుకు ఐటీ శాఖ గడువిచ్చింది. ఇక డిసెంబర్‌ 31వ తేదీ దాటితే రూ.10వేల ఆలస్య రుసుముతో రిటర్న్స్‌ ఫైల్‌ చేయాల్సి ఉంటుంది.

ఎస్‌బీఐ ఏటీఎం కమ్‌ డెబిట్‌ కార్డు మార్పు...

  పాత ఎస్‌బీఐ ఏటీఎం కమ్‌ డెబిట్‌ కార్డులను వాడుతున్న వారు 2019, డిసెంబర్‌ 31వ తేదీ లోపు ఆ కార్డులను కొత్త ఈఎంవీ చిప్‌ ఆధారిత కార్డులతో మార్చుకోవాల్సి ఉంటుందని ఎస్‌బీఐ తెలిపింది. ఇప్పటికే ఈ విషయమై ఎస్‌బీఐ పలుమార్లు గడువు తేదీలను నిర్ణయించినా, డిసెంబర్‌ 31వ తేదీని మాత్రం ఆఖరి గడువుగా ఎస్‌బీఐ తెలిపింది. కనుక పాత ఎస్‌బీఐ ఏటీఎం కార్డులు ఉన్నవారు కొత్త డెబిట్‌ కార్డులను తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే పాత కార్డులు 1వ తేదీ నుంచి పనిచేయవు.

అడ్వాన్స్‌ టాక్స్‌ చెల్లింపు...

  దేశంలోని ఈశాన్య రాష్ర్టాలకు చెందిన వారు తమ అడ్వాన్స్‌ టాక్స్‌ను చెల్లించేందుకు డిసెంబర్‌ 31వ తేదీని ఆఖరి గడువుగా సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌ నిర్ణయించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ముందస్తు పన్ను చెల్లించే ఈశాన్య రాష్ర్టాలకు చెందిన వారు రేపటిలోగా పన్నులను చెల్లించాలి

Thanks for reading Here are 4 things you need to complete by December 31st!

No comments:

Post a Comment