Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, December 30, 2019

Private college that do not meet standards - ప్రమాణాలు పాటించని ప్రైవేటు కళాశాలలపై కొరడా!


Private college that do not meet standards -ప్రమాణాలు పాటించని ప్రైవేటు కళాశాలలపై కొరడా!

   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మా, తదితర కాలేజీలపై కొరడా ఝులిపిస్తున్న రాష్ట్ర ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఇక ప్రైవేటు అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, డిగ్రీ కళాశాలలపైనా దృష్టి సారించనుంది.
Private college that do not meet standards - ప్రమాణాలు పాటించని ప్రైవేటు కళాశాలలపై కొరడా!
  ఈ కళాశాలల్లో ప్రమాణాలు లేకపోగా ఫీజులు అధికంగా వసూలు చేస్తుండడంతో వాటిని గాడిలో పెట్టేందుకు అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఈ కాలేజీల్లో ఫీజులను ప్రభుత్వ విభాగాలు, యూనివర్సిటీలు నిర్ణయిస్తున్నాయి. అయితే.. నిర్దేశించిన ఫీజుల కంటే అంతకు రెండు మూడు రెట్లు అధికంగా ఆయా కాలేజీలు వసూలు చేస్తున్నాయి. కొన్ని యాజమాన్యాలు ప్రభుత్వం ఇచ్చే ఫీజురీయింబర్స్‌మెంట్ నిధుల కోసమే ఈ కాలేజీలను నడిపిస్తున్నాయి. వీటిలో విద్యార్థులు, బోధనా సిబ్బంది కనిపించరు.. ల్యాబ్‌లు, ఇతర సదుపాయాలు అసలే ఉండవు. అయినా అన్నీ ఉన్నట్లు రికార్డుల్లో చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రైవేటు కళాశాలలపై దృష్టి సారించాలని ఉన్నత విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ భావిస్తోంది. ఫీజులను నిర్ణయించడంతోపాటు ఆయా కాలేజీల్లో నిబంధనల మేరకు సదుపాయాల కల్పన, ప్రమాణాల పెంపునకు వీలుగా చర్యలు చేపట్టనుంది.

భూమి లేదు.. ప్రయోగాలు కానరావు

  అగ్రికల్చర్ సంబంధిత కోర్సులు నిర్వహించే కళాశాలలకు ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐకార్) కొన్ని నిబంధనలను నిర్దేశించింది. అయితే.. పలు ప్రైవేటు కళాశాలలు ఈ నిబంధనలను పట్టించుకోవడం లేదు. పలు కళాశాలలకు నిర్ణీత విస్తీర్ణంలో భూమి, ల్యాబ్‌లు, బోధన సిబ్బంది, ఇతర సదుపాయాలు లేవు. ప్రయోగాలు అసలే కానరావు. వీటిలో చదివే విద్యార్థులకు తూతూమంత్రంగానే పాఠాలను బోధిస్తున్నారు. ఫలితంగా వారిలో ఎలాంటి నైపుణ్యాలు ఉండడం లేదు.

ముఖ్యమంత్రి ఆదేశాలతో కమిషన్ అడుగులు

  నిబంధనలు పాటించకుండా.. కనీస సదుపాయాలు లేకుండా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్, డిగ్రీ కాలేజీలపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నత విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్‌కు సూచించారు. దీంతో ఈ కాలేజీల్లో పరిశీలనకు కమిషన్ శ్రీకారం చుడుతోంది. అవి ఇష్టానుసారం ఫీజులు వసూలు చేయకుండా కట్టడి చేయడంతోపాటు ఏ కోర్సుకు ఎంతమేరకు ఫీజులు ఉండాలో నిర్ణయించనుంది.

నిబంధనల మేరకు అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్, ఫారెస్ట్రీ తదితర కాలేజీల్లో ఉండాల్సినవి..

1.అగ్రి బీఎస్సీ ఆనర్స్ కోర్సుకు సంబంధించి ఆయా విభాగాలను కలుపుకొని ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కనిష్టంగా 31 మందికి తగ్గకుండా ఉండాలి. 45 మంది వరకు ల్యాబ్ అసిస్టెంట్లు, 43 మంది వరకు ఫీల్డ్ అసిస్టెంట్లు తప్పనిసరి. భూమి మైదాన ప్రాంతాల్లో అయితే 30 హెక్టార్లు, కొండలు, తీరప్రాంతాల్లో అయితే 16 హెక్టార్లు ఉండాలి.

2.అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సులు నిర్వహించే ప్రతి కళాశాలలో బోధనా సిబ్బంది 115 మంది ఉండాలి. వీరు కాకుండా బోధనేతర సిబ్బంది, 20 హెక్టార్ల భూమి తప్పనిసరి. నిర్ణీత సంఖ్యలో భవనాలు, ల్యాబ్‌లు, లైబ్రరీలు, బోధన, ప్రయోగాలకు సాంకేతిక పరికరాలు అవసరం.

3.బీటెక్ బయోటెక్నాలజీ కోర్సును అందించే కాలేజీల్లో నాలుగు విభాగాల్లో 34 మంది ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి. ఫీల్డ్, ల్యాబ్ అసిస్టెంట్లు, ఇతర బోధనేతర సిబ్బంది 55 మంది ఉండాలి. భవనాలతోపాటు 14 హెక్టార్ల భూమి తప్పనిసరి.

4.డెయిరీ టెక్నాలజీ కోర్సులో 6 విభాగాల్లో 35 మంది ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి. వీరు కాకుండా ఫీల్డ్, ల్యాబ్ అసిస్టెంట్లు, వందలాది పరికరాలు తప్పనిసరి. భవనాలతోపాటు 14 హెక్టార్ల భూమి ఉండాలి.

5.ఫిషరీస్ కోర్సుల కాలేజీల్లో 7 విభాగాల్లో 38 మంది వరకు ప్రొఫెసర్లు, ఇతర బోధనా సిబ్బంది తప్పనిసరి. వీరికి సహాయకులుగా మరో 20 మంది ఉండాలి. భవనాలతోపాటు 26 హెక్టార్ల భూమి ఉండాలి. కోస్తా తీరాలకు దగ్గరగా, ఫిషింగ్ హార్బర్లకు సమీపంలో కళాశాలలు ఉండాలి.

 6.ఫుడ్ టెక్నాలజీ కోర్సులకు 110 మంది ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, రీసెర్చ్ అసిస్టెంట్లు, ల్యాబ్ టెక్నీషియన్లు ఉండాలి. బోధనేతర సిబ్బంది వీరికి అదనం. ల్యాబ్‌లు, భవనాలతోపాటు 4 హెక్టార్ల భూమి ఉండాలి.

7.ఫారెస్ట్రీ కోర్సులకు కోర్సులకు 44 మంది ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లుండాలి. 18 మంది ఇతర సిబ్బంది అవసరం. 50 హెక్టార్ల భూమి ఉండాలి.

8.హోమ్ సైన్‌‌స కోర్సుకు 49 మంది బోధన సిబ్బంది, 49 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, అసిస్టెంట్లు, ఇతర బోధనేతర సిబ్బంది ఉండాలి.

9.హార్టికల్చర్ కోర్సులకు 50 మంది బోధన సిబ్బంది, 76 మంది బోధనేతర సిబ్బంది, 40 హెక్టార్ల భూమి ఉండాలి.

10.సెరికల్చర్ కోర్సులకు 48 మంది బోధన సిబ్బంది, 95 మంది బోధనేతర సిబ్బంది, 40 హెక్టార్ల భూమి అవసరం. అలాగే డిగ్రీ కాలేజీల్లో కూడా నిబంధనల మేరకు సిబ్బంది, ఇతర సదుపాయాలు లేవు

Thanks for reading Private college that do not meet standards - ప్రమాణాలు పాటించని ప్రైవేటు కళాశాలలపై కొరడా!

No comments:

Post a Comment