Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, January 3, 2020

3,234 posts are recruited to prevent sand and alcohol smuggling in the AP.


3,234 posts are recruited to prevent sand and alcohol smuggling in the AP.
ఏపీలో ఇసుక, మద్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు 3,234 పోస్టులు

3,234 posts are recruited to prevent sand and alcohol smuggling in the AP.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక, మద్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఏర్పాటు చేయనున్న చెక్‌పోస్టులు, మొబైల్ యూనిట్లలో సిబ్బంది నియామకానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

 చెక్‌పోస్టులు, మొబైల్ యూనిట్ల కోసం 3,234 పోస్టుల్ని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 24 గంటలు పనిచేసేలా రెండు షిప్టుల్లో సిబ్బందిని నియమిస్తారు. ప్రతి షిఫ్టుల్లో చెక్‌పోస్టు, మొబైల్ యూనిట్‌లో ఒక హెడ్ కానిస్టేబుల్/ కానిస్టేబుల్, ఇద్దరు ప్రత్యేక పోలీసు అధికారులు ఉంటారు. ఇందుకు 3,234 మంది సిబ్బంది అవసరమంటూ డీజీపీ పంపిన ప్రతిపాదనలను హోంశాఖ ఆమోదించింది. ఈ 3,234 పోస్టుల్లో 1,078 మందిని పోలీసు విభాగం నుంచి కేటాయిస్తారు. మిగిలిన పోస్టుల్లో ప్రత్యేక పోలీసు అధికారులను ఔట్ సోర్సింగ్ విధానంలో నియమిస్తారు. ఇందుకు అయ్యే ఖర్చును ఏపీఎండీసీ నుంచి వెచ్చిస్తారు. నిర్వహణ వ్యయాన్ని ఏపీఎండీసీ, ఆంధ్రప్రదేశ్ బెవరేజస్ కార్పొరేషన్ నుంచి దామాషాలో తీసుకుంటారు. ప్రత్యేక పోలీసు అధికారుల నియామకానికి అర్హత నిబంధనలను డీజీపీ ఖరారు చేశారు.

ప్రత్యేక పోలీసు అధికారుల నియామకానికి అర్హతలు

  1. మాజీ సైనికులు (ఎక్స్ సర్వీస్‌మెన్), పారామిలటరీ దళాల్లో, పోలీసు శాఖలో పనిచేసి రిటైరైన వారు, గతంలో హోంగార్డుగా సేవలందించిన వారు, ప్రముఖ సంస్థల్లో సెక్యూరిటీ గార్డులుగా శిక్షణ పొందిన వారిని ప్రత్యేక పోలీసు సిబ్బందిగా నియమిస్తారు.
  2. అవసరమైన సిబ్బంది లభించని పక్షంలో పోలీసు శాఖ శరీర దారుఢ్య పరీక్షలు నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తుంది. 65 ఏళ్ల లోపు వారికి ప్రాధాన్యమిస్తారు.
  3. పతిభ ఆధారంగా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఈ నియామకాలు చేపడతారు.

Thanks for reading 3,234 posts are recruited to prevent sand and alcohol smuggling in the AP.

No comments:

Post a Comment