Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, January 18, 2020

Find out where to use your Aadhaar ...


మీ ఆధార్‌ను ఎక్క‌డ వాడారో తెలుసుకోండిలా...
Find out where to use your Aadhaar ...

Find out where to use your Aadhaar ...

 ఇప్పుడు ప్ర‌భుత్వాలు ప్ర‌తిదానికి ఆధార్ కార్డు అడుగుతున్నాయి. పాన్ కార్డ్, మొబైల్, బ్యాంక్ లోన్లు.. ఇలా దేనికైనా ఆధార్‌నే అడుగుతున్నారు....
ఇప్పుడు ప్ర‌భుత్వాలు ప్ర‌తిదానికి ఆధార్ కార్డు అడుగుతున్నాయి. పాన్ కార్డ్, మొబైల్, బ్యాంక్ లోన్లు.. ఇలా దేనికైనా ఆధార్‌నే అడుగుతున్నారు. మ‌న వ్య‌క్తిగ‌త రుజువుగా ఇప్పుడు ఆధార్‌ను మించింది లేదు. దీంతో మనం కూడా ప్రతిదానికీ ఆధార్‌నే ఇస్తున్నాం. ఇందులో మన కంటిపాప‌, వేలి ముద్ర‌లు, చిరునామా వంటి వివ‌రాల‌న్నీ ఉంటాయి. ఇది దుర్వినియోగం అవుతున్నదన్న ఆందోళనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీ ఆధార్‌ను ఎప్పుడు ఎక్కడ ఎలా వాడారో తెలుసుకునే అవకాశం ఉందని మీకు తెలుసా? ఆధార్ కార్డు జారీ చేసే యూఏడీఏఐ వెబ్‌సైట్ ఈ అవకాశాన్ని కల్పిస్తున్నది. దీనికోసం ఏం చేయాలో తెలుసుకుందాం.
ఆధార్‌ను ఎప్పుడు ఎక్కడ ఎలా వాడారో తెలుసుకునే విధానం

ఆధార్ వెబ్‌సైట్లో స‌ర్వీసెస్ ట్యాబ్‌లో - యూఐడీఏఐ ఆధార్ ఆథెంటికేషన్ హిస్టరీ పేజ్‌కు వెళ్లాలి
అక్క‌డ కుడివైపు కింద ఆధార్ స‌ర్వీసెస్ అనే ట్యాబ్ ఉంటుంది.
మీ ఆధార్ నంబర్‌తో పాటు క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.
ఇలా చేయండి - ఆ త‌ర్వాత జనరేట్ ఓటీపీ క్లిక్ చేస్తే.. రిజిస్టర్డ్ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది.
మీ మొబైల్ నంబ‌రుకు ఓటీపీ వ‌చ్చేందుకు ఆధార్ వెబ్‌సైట్లో మొబైల్ నంబ‌రు న‌మోదయి ఉండాల‌ని మ‌ర‌వ‌కండి.
 తర్వాతి పేజీలో మీకు ఎలాంటి సమాచారం కావాలో కోరుతూ కొన్ని ఆప్షన్స్ డిస్‌ప్లే అవుతాయి. బయోమెట్రిక్, డెమొగ్రాఫిక్‌లాంటివి.
 ప్రస్తుత తేదీ నుంచి గరిష్ఠంగా ఆరు నెలల కిందటి వరకు మీరు ఆధార్‌ను ఎలా ఎక్కడ వాడారో తెలుసుకోవచ్చు.
కావాల్సిన వివ‌రాలు ప్ర‌త్య‌క్షం - చివరి కాలమ్‌లో ఓటీపీ ఎంటర్ చేసి సబ్‌మిట్ చేస్తే మొత్తం మీకు కావాల్సిన వివ‌రాలు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాయి.
మీరు ఏ రోజు, ఏ సమయానికి, ఎలాంటి పని కోసం ఆధార్‌ను ఇచ్చారన్న వివరాలు వస్తాయి.
 అయితే ఇందులో మీ ఆధార్ వాడిన కంపెనీ లేదా ఏజెన్సీ పేర్లు మాత్రం చూపించదు.

అనుమానం వ‌స్తే లాక్ చేయండి అందుకోస‌మే మీకు ఏదైనా అనుమానం వ‌స్తే మీ ఆధార్ వివ‌రాలు మీరు అనుమతిస్తేనే అవ‌తలి వాళ్లు వాడుకునేలా చేయొచ్చు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో ఆధార్ వివ‌రాల‌ను లాక్ చేయ‌వ‌చ్చు. ఏదైనా ఏజెన్సీ లేదా సంస్థ ఆ వివ‌రాల‌ను తెలుసుకోవాల్సి వ‌చ్చినప్పుడు మీరు అన్‌లాక్ చేయ‌వ‌చ్చు.
https://resident.uidai.gov.in/aadhaar-auth-history

Thanks for reading Find out where to use your Aadhaar ...

No comments:

Post a Comment