Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, January 23, 2020

Jobs at the Vizag Steel Plant-వైజాగ్ స్టీల్ ప్లాంటులో ఉద్యోగాలు


Jobs at the Vizag Steel Plant- వైజాగ్ స్టీల్ ప్లాంటులో ఉద్యోగాలు


  రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని విశాఖపట్నం(వైజాగ్) స్టీల్‌ ప్లాంట్.. టెక్నికల్ విభాగంలో మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌ను అందుబాటులో ఉంచింది. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన విద్యార్హతలు ఉన్నవారు నిర్ణీత మొత్తంలో దరఖాస్తు ఫీజు చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. జనవరి 24 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఫిబ్రవరి 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. ​పోస్టుల వివరాలు...: మేనేజ్‌మెంట్ ట్రైనీ (టెక్నికల్): 188 పోస్టులు పోస్టుల కేటాయింపు.: జనరల్-72, ఓబీసీ-69, ఎస్సీ-24, ఈడబ్ల్యూఎస్-23. సిరామిక్స్: 04, కెమికల్: 26, సివిల్: 05, ఎలక్ట్రికల్: 45, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిక్స్: 10, మెకానికల్: 77, మెటలర్జి: 19, మైనింగ్: 02. ​అర్హత..: 60 శాతం మార్కులతో సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.ఎస్సీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. 01.01.2020 నాటికి 27 సంవత్సరాలకు మించకూడదు. 01.01.1993 తర్వాత జన్మించిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

ఇతర వయో నిబంధనలు వర్తిస్తాయి. సరైన విద్యార్హతలు ఉన్నవారు నిర్ణీత మొత్తంలో దరఖాస్తు ఫీజు చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.590 చెల్లించాలి. ఎస్సీ, దివ్యాంగులు రూ.295 చెల్లించాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్ విధానంలోనే ఫీజు చెల్లించాలి. ఆన్‌లైన్ రాతపరీక్ష,ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. రాతపరీక్ష హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.

రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపికచేస్తారు.
 ​పరీక్ష విధానం:
 ➦ ఆన్‌లైన్ రాతపరీక్షలో జనవరల్ అవేర్‌నెస్, న్యూమరికల్ ఎబిలిటీ/ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లిష్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
➦ ప్రతి విభాగం నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది.
➦ పరీక్షలో నెగెటివ్ మార్కులు లేవు. ఆన్‌లైన్ రాతపరీక్ష రాసిన అభ్యర్థులు ప్రతి విభాగంలోనూ 50 శాతం మార్కులను సాధించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఓబీసీ, దివ్యాంగులు 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్ష కోసం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

వీటిలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయనగరంలో పరీక్ష నిర్వహించనున్నారు. వీటితో పాటు ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, పాట్నా, భువనేశ్వర్, చెన్నై, రాంచీ నగరాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపికచేస్తారు. ఇంటర్వ్యూ సమాచారాన్ని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.

మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాలకు ఎంపికైనవారికి ఏడాది శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తిచేసుకున్న వారికి ఏడాది ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభంలో బేసిక్ పే కింద నెలకు రూ.20,600 ఇస్తారు. ప్రీ రివైజ్డ్ పే స్కేలు రూ.20,600-3%-46,500 గా ఉంటుంది. శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు. ప్రీ రివైజ్డ్ పే స్కేలు కింద రూ.24,900-3%-50,500గా వేతనం ఇస్తారు. వీటికి ఇతర భత్యాలు అదనంగా ఉంటాయి. ​ముఖ్యమైన తేదీలు..: ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24.01.2020 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 13.02.2020 ఫీజు చెల్లించడానికి చివరితేది: 14.02.2020

Thanks for reading Jobs at the Vizag Steel Plant-వైజాగ్ స్టీల్ ప్లాంటులో ఉద్యోగాలు

No comments:

Post a Comment