Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, January 23, 2020

LIC Policy: ఈ 23 ఎల్ఐసీ పాలసీలు ఇక ఉండవు... నిలిపివేస్తున్న కంపెనీ


LIC Policy: ఈ 23 ఎల్ఐసీ పాలసీలు ఇక ఉండవు... నిలిపివేస్తున్న కంపెనీ
LIC Policy: ఈ 23 ఎల్ఐసీ పాలసీలు ఇక ఉండవు... నిలిపివేస్తున్న కంపెనీ

మీరు ఎల్ఐసీ పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా? మంచి పాలసీ కోసం వెతుకుతున్నారా? లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC కొన్ని ఇన్స్యూరెన్స్ పాలసీలను నిలిపివేస్తోంది. మొత్తం 23 ఎల్ఐసీ పాలసీలు జనవరి 31 నుంచి ఇక ఉండవు. ఆ పాలసీలను తీసుకోవాలనుకుంటే మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఎల్ఐసీ నిలిపివేస్తున్న పాలసీల్లో జనాల్లో బాగా పాపులర్ అయిన జీవన్ ఆనంద్, జీవన్ ఉమాంగ్, జీవన్ లక్ష్య, జీవన్ లాభ్, సింగిల్ ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్, న్యూ ఎండోమెంట్ ప్లాన్, న్యూ మనీబ్యాక్ 20 ఇయర్స్, అన్మోల్ జీవన్ 2, లిమిటెడ్ ప్రీమియం ఎండోమెంట్ ప్లాన్, న్యూ చిల్డ్రన్ మనీ బ్యాక్ ప్లాన్, జీవన్ లక్ష్య, జీవన్ తరుణ్, జీవన్ లాభ్, న్యూ జీవన్ మంగళ్, భాగ్యలక్ష్మి ప్లాన్ లాంటి పాలసీలున్నాయి.
వాస్తవానికి ఈ పాలసీలు నవంబర్ 30న ఉపసంహరించుకోనున్నట్టు ముందే ప్రకటించింది ఎల్ఐసీ. కానీ ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవప్‌మెంట్ అథారిటీ-IRDAI గడువును జనవరి 31 పొడిగించింది.

మొత్తం 23 పాలసీలను ఉపసంహరించుకొని వాటి స్థానంలో కొత్త పాలసీలను ఎల్ఐసీ ప్రకటించనుంది. పాలసీలను ఎల్ఐసీ ఉపసంహరించడానికి కారణం గతేడాది ఐఆర్‌డీఏఐ కొన్ని నిబంధనల్ని మార్చడమే. అందుకే పాత పాలసీలను నిలిపివేసి కొత్త నియమనిబంధనలతో పాలసీలను ప్రకటించనుంది ఎల్ఐసీ. కొత్త పాలసీలు తీసుకునేవారికి ప్రీమియం రేట్లు ఎక్కువగా ఉండటంతో పాటు బోనస్ తక్కువగా ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది.

LIC Agent Recruitment: ఎల్ఐసీ ఏజెంట్‌ జాబ్‌కు అప్లై చేయండిలా... టెన్త్ పాసైతే చాలు

Thanks for reading LIC Policy: ఈ 23 ఎల్ఐసీ పాలసీలు ఇక ఉండవు... నిలిపివేస్తున్న కంపెనీ

No comments:

Post a Comment