Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, January 21, 2020

To repeal the AP Legislative Council….


To repeal the AP Legislative Council….
ఎపి శాసనమండలి రద్దు చేయాలంటే....

To repeal the AP Legislative Council….  ఎపి శాసనమండలి రద్దు చేయాలంటే....

  ప్రభుత్వానికి తలపోటుగా మారిన శాసన మండలిని రద్ద చేసే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. మండలిలో కేవలం 9 మంది బలం మాత్రమే ఉన్న వైసిపికి 36 మంది సభ్యులున్న టిడిపి బిల్లుల ఆమోదం విషయంలో షాక్ ఇస్తున్నది..ఇంగ్లీష్ మీడియం ఇతర బిల్లులు మండలిలో వైసిపి ఆమోదముద్ర వేయించుకోలేకపోయింది. అయితే ఆ బిల్లులను తిప్పిపంపడంతో అసెంబ్లీలో తిరిగి వాటిని ఆమోదింపజేసుకున్నారు.. కాగా, సి ఆర్ డి ఎ రద్దు బిల్లు, వికేంద్రీకరణ బిల్లులు ఆమోదం కోసం వైసిపి ప్రవేశపెట్టే ప్రయత్నాన్ని రూల్ నెంబర్ 71 తో టిడిపి చెక్ పెట్టింది.. 71 రూల్ ప్రకారం అసలు ఆ బిల్లులు మండలిలో ప్రవేశపెట్టేందుకు మెజార్టీ సభ్యుల అనుమతి అవసరం..
   టిడిపి బలం ఎక్కువగా ఉండటంతో అసలు ఆ బిల్లులు మండలిలో ప్రవేశ పెట్టే పరిస్థితి వైసిపికి ఏర్పడింది.. దీంతో మండలిని శాశ్వతంగా వదిలించుకునేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మురం చేసింది. మండలిని రద్దు చేయాలంటే కేబినెట్‌ తీర్మానం చేయాలి.. అనంతరం 2/3వ వంతు మెజారిటీతో అసెంబ్లీ అమోదం అవసరమవుతుంది. అసెంబ్లీ 151 మంది సభ్యులు ఉండటంతో అక్కడ ఆమోదం చాలా సులభం.. అసలు ప్రక్రియ ఇక్కడ నుంచే ప్రారంభమవుతుంది.. అసెంబ్లీ తీర్మానానికి పార్లమెంట్‌ ఉభయసభలు ఆమోదించాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత రాజ్యాంగ సవరణ కూడా చేయాల్సి ఉంటుంది. పార్లమెంట్ లో బిజెపి అధికారంలో ఉండటంతో ఈ తీర్మానాన్ని ఎప్పటికీ ఆమోదిస్తుందో తెలియని స్థితి..

ఎపి మండలి చరిత్ర పరిశీలించినట్లయితే..

ఏపీలో 1958లో ఆర్టికల్‌-168 కింద జూలై 1న శాసనమండలి తొలిసారిగా ఏర్పాటైంది. అప్పటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్‌, 1958 జులై 8న మండలిని అధికారికంగా ప్రారంభించారు. మండలి ఆవిర్భవించిన 27 సంవత్సరాల తర్వాత అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ రద్దు చేశారు. అనవసరమైనది..జనాభాలో ప్రాతినిధ్యం లేనిదని ఎన్టీఆర్‌ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర బడ్జెట్‌పై భారం, చట్టాలు ఆమోదించడంలో జాప్యం కావడంతో రద్దు చేశారు. ఇలా ఎన్నో కారణాలతో ఎన్టీఆర్‌ ప్రభుత్వం మండలిని రద్దు చేస్తూ తీర్మానించారు. తొలిసారి 1985 లో మండలి రద్దు అయింది.. తీర్మానం చేసిన 11 నెలలకు పార్లమెంట్ ఆమోద ముద్ర వేసింది. ఇక మండలి కోసం 1990 జనవరి 22న అసెంబ్లీలో తీర్మానం చేశారు. 1990 మే 28న పార్లమెంటు ఎగువసభలో తీర్మానం పాస్‌ చేశారు. 1991లోక్‌సభ రద్దుతో మండలి పునరుద్దరణ తీర్మానం మరుగునపడింది.
2004లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2004 జులై 8న శాసన మండలి పునరుద్దరణకు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ తీర్మానం చేసింది. 2006 డిసెంబర్లో పార్లమెంట్‌ ఆమోదం పొందింది. 2007 జనవరి 10న రాష్ట్రపతి ఆమోద ముద్రవేశారు. 2007 మార్చి 30న ఏపీ శాసనమండలి మళ్లీ ఏర్పాటైంది. శాసనసభతో పాటు మండలి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అంటే అసెంబ్లీ తీర్మానం చేసిన మూడేళ్లకు పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది. తాజాగా రద్దు బిల్లు పార్లమెంట్ కు పంపితే ఎప్పటికి ఆమోదముద్ర వేస్తుందో వేచి చూడాల్సిందే..

Thanks for reading To repeal the AP Legislative Council….

No comments:

Post a Comment