Railway Jobs: 400 jobs in rail coach factory. . .
రైల్ కోచ్ ఫ్యాక్టరీలో 400 ఉద్యోగాలు . . . మొదలైన రిజిస్ట్రేషన్.
RCE Recruitment 2020
భారతీయ రైల్వే వరుసగా జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. రైల్వేతో పాటు రైల్వే అనుబంధ సంస్థలు కూడా నియామకాలు చేపడుతున్నాయి. ఇండియన్ రైల్వేస్‌కు చెందిన రైల్ కోచ్ ఫ్యాక్టరీ 400 పోస్టుల్ని ప్రకటించింది. కపుర్తలాలో గల యూనిట్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది. ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, మెకానిక్, ఎలక్ట్రీషియన్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది రైల్ కోచ్ ఫ్యాక్టరీ-RCF. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 ఫిబ్రవరి 6 చివరి తేదీ. 10వ తరగతి, ఐటీఐలో వచ్చిన మార్కులతో మెరిట్ లిస్ట్ రూపొందించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను రైల్ కోచ్ ఫ్యాక్టరీ అధికారిక వెబ్సైట్ https://rcf.indianrailways.gov.in/ ఓపెన్ చేసి చూడొచ్చు.
మొత్తం ఖాళీలు- 400
ఫిట్టర్- 100
వెల్డర్ (G & E)- 100
మెషినిస్ట్- 40
పెయింటర్- 20
కార్పెంటర్- 40
మెకానిక్ (మోటార్ వెహికిల్)- 10
ఎలక్ట్రీషియన్- 56
ఎలక్ట్రానిక్ మెకానిక్- 14
ఏసీ & రిఫ్రిజిరేషన్ మెకానిక్- 20
RCF RECRUITMENT 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 8
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 6
విద్యార్హత- 50% మార్కులతో 10వ తరగతి పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.
వయస్సు- 15 నుంచి 24 ఏళ్లు.
ఫీజు- రూ.100
Thanks for reading Railway Jobs: 400 jobs in rail coach factory. . .
No comments:
Post a Comment