Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, March 7, 2020

About OBC Reservation and Creamy layer.


 About OBC Reservation and Creamy layer.

About OBC Reservation and Creamy layer.


   వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సంచాలకుల సర్క్యులర్నెంబర్ ఈ/424/2014 తేదీ 28.0 7.2014 ద్వారా జీవో నెంబర్ 20 వెనుకబడిన తరగతిలో సంక్షేమ శాఖ తేదీ 31.10.17 పై సూచనల ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న బీసీ సాధారణ ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు క్రిమిలేయర్ వర్తించదు. అదేవిధంగా గ్రూప్ 3, గ్రూప్ 4 స్థాయిలో మొదట ఉద్యోగమా నియామకము పొంది, ప్రమోషన్ ద్వారా జిల్లా అధికారి వారి వార్షికాదాయం ఎనిమిది లక్షలు దాటిన వీరు కూడా క్రిమిలేయర్ కింద రారు వారి పిల్లలు కూడా ఓ బి సి లుగా పరిగణించ బడుతారు.
1. ఐఏఎస్, ఐపీఎస్, ఐ ఎఫ్ఎస్ గ్రూప్ వన్ ఉద్యోగాలలో నియామకం పొందినవారు
2.తల్లిదండ్రులు డైరెక్టుగా గ్రూప్ 2 ఉద్యోగంలో నియామకము పొందినవారు
3.తల్లిదండ్రులలో ఒక్కరైనా గ్రూప్ 2 ద్వారా ఉద్యోగంలో మొదట నియామకము కబడి లోపు గ్రూప్-1 స్థాయి ఉద్యోగమునకు ప్రమోషన్ పొందిన వారి పిల్లలు మాత్రమే క్రిమిలేయర్ గా పరిగణించబడతారు.
 సాధారణ ఉద్యోగులు, ఉపాధ్యాయులు వారి వార్షిక ఆదాయము 8 లక్షల రూపాయలు దాటిన వారి పిల్లలకు క్రిమిలేయర్ వర్తించదు.
             
     కానీ చాలామంది రెవెన్యూ సిబ్బంది, తహసీల్దార్లు క్రిమిలేయర్ పై సరి అయిన అవగాహన లేక సాధారణ బిసి ఉద్యోగులు, ఉపాధ్యాయుల వార్షికాదాయము ఎనిమిది లక్షలు దాటిన దని వారి పిల్లలకు ఓ బి సి సర్టిఫికెట్లు ఇవ్వటం లేదు. అందువలన వారి పిల్లలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఐఐటి ఇంజనీరింగ్ మెడికల్ ఇతర కోర్సుల లో రిజర్వేషన్లు కోల్పోతున్నారు.కావున అధికారులకు ఈ విషయము తెలిపి,తగిన సర్టిఫికేట్ పొందవచ్చు.

BC రిజర్వేషన్లు-క్రీమీలేయర్


సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశ్యంతో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల వారికి రాజ్యాంగంలో పొందుపరచబడిన నిబంధనల ప్రకారం "రిజర్వేషన్" సౌకర్యం కల్పించబడినది. ఆ మేరకు షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు ఇత్యాది వెనుకబడిన తరగతులకుశ్చెందినవారికి
రిజర్వేషన్ సౌకర్యం వర్తింపజేయబడినది. వెనుకబడిన తరగతులకు రాష్ట్రస్థాయిలో రిజర్వేషన్ సౌకర్యమును 1970వ సం||లో జీ.ఓ.యం.యస్. నెం.1793 ద్వారా కల్పించినప్పటికీ, కేంద్రస్థాయిలో మండల్ కమీషన్ సిఫారసుల మేరకు1993వ సం నుండి రిజర్వేషన్ సౌకర్యం కల్పించబడినది

 కానీ, ఇతర వెనుకబడిన తరగతులకు (OBC) రిజర్వేషన్లు అమలు చేయుటకు వారిలోని క్రీమీలేయర్ (సంపన్నశ్రేణి)ను మినహాయించాలని సుప్రీం కోర్టు ఇందిరా సహానీ VS యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీర్పును వెలువరించినది. సుప్రీం కోర్టు తీర్పు మేరకు ఇతర వెనుకబడిన తరగతులలో క్రీమీలేయర్ (సంపన్నశ్రేణి)ను గుర్తించుటకు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక కమిటీని వేయడం జరిగినది. ఆ కమిటీ చేసిన సూచనల మేరకు వెనుకబడిన తరగతులలో క్రీమీలేయర్ (సంపన్నశ్రేణి)ను గుర్తించడం జరుగుతుంది

సంపన్నశ్రేణి (క్రీమీ లేయర్) అనగానేమి?

వెనుకబడిన తరగతులకు చెందిన వారిలో సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ది చెందిన వారిని సంపన్నశ్రేణి' (క్రీమీ లేయర్) గా పరిగణిస్తారు.

సంవన్నశ్రేణి (క్రీమీ లేయర్)కి చెందిన వారికి రిజర్వేషన్ సౌకర్యం వర్తిస్తుందా?

సంపన్నశ్రేణికి చెందినవారు వెనుకబడిన తరగతులకు చెందినప్పటికీ, వారు సామాజికంగా , విద్యాపరంగా అభివృద్ధి చెందినవారైనందున రిజర్వేషన్ సౌకర్యమును పొందుటకు అనర్హులు. వారు ఓపెన్ కేటగిరీలో మాత్రమే పోటీపడవలసి ఉంటుంది.

సంపన్నశ్రేణిని( క్రీమీ లేయర్) గుర్తించడమెలా?

కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ చేయబడిన సూచనల ప్రకారం వెనుకబడిన తరగతులలోని
సంపన్నశ్రేణిని ఈ క్రింద తెలియ జేయబడిన విధంగా గుర్తిస్తారు.
 రాజ్యాంగంలో పొందుపరచబడిన క్రింద తెలియజేయబడిన పోస్టులలో ఉన్న వారి పిల్లలు క్రీమీలేయర్(సంపన్నశ్రేణి)గా పరిగణించబడతారు
i.రాష్ట్రపతి
ii.ఉపరాష్ట్రపతి
iii.సుప్రీంకోర్టు, హైకోర్టు మరియు పరిపాలన       ట్రిబ్యునల్ల న్యాయమూర్తులు
iv UPSC & PSC అధ్యక్షులు మరియు సభ్యులు
 v. చీఫ్ ఎలక్పన్ కమీషనర్ (CEC)
vi కంప్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG)
vi) అటార్ఫీ జనరల్ మరియు అడ్వకేట్ జనరల్
vii) అధికార భాషా సంఘ సభ్యులు
ix. కేంద్ర మరియు రాష్ట్ర మంత్రులు, MP, MLA & MLCలు, ఎగువ చట్టసభల ఛైర్మన్ మరియు డిప్యూటీ ఛైర్మన్లు
 x. రాజ్యాంగంలోపొందుపరచబడిన ఇతర పోస్టులలో ఉన్నవారు


II సివిల్ ఉద్యోగులు
క్రింద తెలియజేయబడిన కేటగిరీలకు చెందిన సివిల్ ఉద్యోగుల పిల్లలు క్రీమీలేయర్ (సంపన్నశ్రేణి) గా పరిగణించబడతారు.
◆తల్లి దండ్రులిరువురూ లేక ఏ ఒక్కరైనా ఆల్ ఇండియా సర్వీసులలో (IAS, 1PS & IFS) డైరక్టుగా నియామకం పొందినవారు
◆తల్లిదండ్రులిరువురూ లేక ఏ ఒక్కరైనా గ్రూప్- 1 స్థాయి ఉద్యోగంలో డైరక్టుగా నియామకం పొందినవారు
◆తల్లిదండ్రులిరువురూ గ్రూప్ -2 స్థాయి ఉద్యోగంలో డైరక్టుగా నియామకం పొందినవారు.
◆తల్లిదండ్రులలో ఏ ఒక్కరైనా గ్రూప్ - 2 స్థాయి ఉద్యోగంలో డైరక్టుగా నియామకం కాబడి, 40 సం॥ల లోపు గ్రుప్-1 స్థాయి ఉద్యోగమునకు ప్రమోషన్ పొందినవారు. 40 సం||ల తర్వాత గ్రూప్- 1 స్థాయికి ప్రమోషన్పొందినవారు క్రీమీలేయర్కు చెందరు

   పైన తెలియజేయబడిన కేటగిరీలకు చెందిన ఉద్యోగస్థులు సర్వీసులో ఉన్నా, రిటైరైనా లేక మరణించినా వారి పిల్లలు క్రీమీలేయర్ (సంపన్నశ్రేణి) గా పరిగణించబడతారు. అలా గాక, తల్లిదండ్రులిరువురూ లేక ఏ ఒక్కరైనా గ్రూప్ -3 లేక గ్రూప్ - 4 స్థాయిలో తొలుత నియామకం పొందియుండిన ఎడల వారి పిల్లలు ఎట్టి పరిస్థితులలోనూ సంపన్నశ్రేణిగా పరిగణించబడరు. ఒక వేళ గ్రూప్- 3 లేక గ్రూప్ - 4 స్థాయిలో తొలుత నియమింపబడి, 40ఏళ్లోపే గ్రూప్ - 1 స్థాయి ఉద్యోగమునకు ప్రమోషన్ పొందినప్పటికీ వారి పిల్లలు 'సంపన్నశ్రేణి' క్రిందకు రారు.

 సివిల్ ఉద్యోగుల విషయంలో ముఖ్యంగా గమనించవలసిన అంశమేమిటంటే వారు తొలుత నియామకం పొందిన స్థాయిని బట్టి వారి పిల్లలు సంపన్నశ్రేణి క్రిందకు వస్తారా? రారా? అన్న విషయం నిర్ణయించబడుతుంది. 


■ మిలరిటరీ మరియు పారామిలిటరీ దళాలు

మిలిటరీ (Army Navy & Air Force) మరియు పారా మిలిటరీ దళాలలో పనిచేయుచున్న తల్లిదండ్రులలో ఏ ఒక్కరు గానీ లేక ఇద్దరూ 'కల్నల్' స్థాయి ఉద్యోగంలో యున్న యెడల వారి పిల్లలు సంపన్నశ్రేణిగా గుర్తించబడతారు ఆ తక్కువ స్థాయిలో ఉన్నవారికి సంపన్నశ్రేణి వర్తించదు.

■ ప్రొఫెషనల్స్  , వాణిజ్య మరియు వ్యాపార వర్గాలు:

ప్రైవేట్ ప్రాక్టీసు చేస్తున్న డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంట్, ఇన్కంటాక్స్ కన్సల్టెంట్లు ఆర్కిటెక్టులు, కంప్యూటర్ ప్రొఫెషనల్స్ సినీ ఆర్టిస్టులు, రచయితలు, జర్నలిస్టులు, క్రీడాకారులు మొదలగువాగు వారి అదాయాన్ని బట్టి సంపన్న శ్రేణి గా గుర్తించబడతారు. అనగా, మూడు సంవత్సరాల పాటు వరుసగా వారి వార్షికాదాయం నిర్దేశించబడిన ఆదాయ పరిమితిని దాటితే అట్టి వారి పిల్లలు 'సంపన్నశ్రేణి'గా గుర్తించబడతారు.


ఆస్తి దారులు

ఎ. వ్యవసాయ భూమి
i.సాగునీటి సౌకర్యం కలిగి, Land Ceiling Act ప్రకారం ఉండగలిగిన భూమిలో 85% భూమి ఉన్నయెడల, వారి పిల్లలను సంపన్నశ్రేణిగా సరిగణిస్తారు

ii.ఉన్న భూమిలో కొంత సాగునీటి సౌకర్యం కలది. కొంత సాగునీటి సౌకర్యం లేనిది అయిన యెడల, సాగునీటి సౌకర్యం గల భూమి Land Ceiling Act ప్రకారం ఉండగలిగిన భూమిలో కనీసం 40% కంటే ఎక్కువగాఉన్నప్పుడే, మిగతా మెట్ట భూమిని కన్వర్షన్ ఫార్ములా ప్రకారం సాగునీటి భూమిగా మార్చి, రెంటినీ కలిపి .చూసి, Land Ceiling Act ప్రరారం ఉండగలిగిన భూమిలో 80% కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు అట్టి వారి పిల్లలను సంపన్నశ్రేణిగా పరిగణిస్తారు.

iii.ఒక వేళ ఉన్న భూమి అంతా మెట్టభూమియే అయినప్పుడు, ఎంత భూమి ఉన్నప్పటికీ వారి పిల్లలు సంపన్నశ్రేణిగా పరిగణించబడరు ఇచ్చట గుర్తించవలసిన ముఖ్యమైన అంశమేమనగా, భూమి పరిమాణమును బట్టి మాత్రమే సంపన్నశ్రేణి నిర్ణయిస్తారు. ఆ భూమి ద్వారా వచ్చు ఆదాయంతో స మాత్రం సంబంధంలేదు. ఉండవలసిన భూపరిమాణం కంటే తక్కువగా భూమిని కలిగి, ఆ భూమి డ్వారా వచ్చు ఆదాయం సంపన్నశ్రేణి ఆదాయ పరిమితి కన్నా ఎక్కువ ఉన్నప్పటికీ, అట్టి వారి పిల్లలను సంపన్నశ్రేణిగా పరిగణించరాదు

బి 1 .మమిడి, బత్తాయి, నిమ్మ మొ॥ తోటలు:
ఉన్న భూమి సాధారణ వ్యవసాయ భూమి గాక సైన తెలియజేయబడిన తోటలైనచో, వీటిని మామూలు
సాగునీటి పారుదల గల వ్యవసాయ భూమిగా గుర్తించడం జరుగుతుంది. అంటే, Land Ceiling Act ప్రకారం కంటే ఎక్కువగా భూమిని కలిగి. ఆ భూమిలో పైన తెలిపిన తోటలు ఉన్నయెడల, అట్టివారి పిల్లలను సంపన్నశేణిగా పరిగణించబడటం జరుగుతుంది
ii.కాఫీ, టీ, రబ్బరు మొ| తోటలు
ఉన్న భూమి సాధారణ వ్యవసాయ భూమి గాక పైన తెలియజేయబడిన తోటలైనచో, వాటిపై వచ్చు ఆదాయమును బట్టి క్రీమిలేయర్ నిర్ణయం జరుగుతుంది. అనగా, పైన తెలియజేయబడిన విధముగా నిర్దేశించబడిన ఆదాయ పరిమితి కన్నా మించిన ఆదాయమును మూడు సం॥లు వరుసగా పొందిన యెడల, అట్టివారి పిల్లలు క్రీమలేయర్ గా పరిగణించబడతారు
సి.పట్టణలలో ఖాళీ స్థలం / భవనములు
Vealhi Tax పర్తింవజేయబడి, పరిమితికి మించిన ఆస్తిని కలిగిన వారి పిల్లలు సంపన్నశ్రేణిగా పరిగణించబడతారు

క్రీమీలేయర్ అంశాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మరి కొన్ని వివరణలు

1.క్రీమీలేయర్ అంశం ప్రస్తుతం ఉద్యోగాలకు, విద్యా సంస్థల్లో ప్రవేశానికి మాత్రమే వర్తింపచేయలి.
2. ఉద్యోగుల విషయంలో క్రీమీలేయర్ ను వారు తొలుత నియామకం పొందిన ఉద్యోగ స్థాయిని బట్టి మాత్రమే నిర్ణయిస్తారు వారు పొందు జీతభత్యాలతో ఏ మాత్రం సంబంధం లేదు
3.ఒక్కొక్కసారి కొందరు ఉద్యోగులకు కొంత వ్యవసాయ భూమి కూడా వుండవచ్చు అట్టి పరిస్థితులలో వారు క్రీమీలేయరు క్రిందకు వస్తారా ? రారా ? అన్న విషయాన్ని వేరువేరుగా పరిశీలించాలి. ఒకవేళ, వారి తొలి ఉద్యోగ నియామకపు స్టేటస్ ను బట్టి క్రీమీలేయరు క్రిందకు రాని వారు వారికున్న వ్యవసాయ భూపరిమితిని బట్టి క్రీమీలేయరు క్రిందకు రావచ్చు. వ్యవసాయ భూమి విషయంలో పైన తెలియజేసిన విధంగా ఎంత పరిమాణం ఉన్నది అన్నదే ముఖ్యంగానీ ఆ భూమి ద్వారా ఎంత ఆదాయం వస్తున్నదని కాదు. జీత భత్యాలను, వ్యవసాయం ద్వారా వచ్చు ఆదాయాన్ని కలిపిక్రీమీలేయర ను నిర్ణయించరాదు

4.జీత భత్యాలు, వ్యవసాయం ద్వారా వచ్చు ఆదాయము కాక ఇతర సేపలు లేక వ్యాపారం లేక వాణిజ్యం లాంటి ఇతరరంగాల ద్వారా ఆదాయాన్ని పొందుచున్న యెడల, ఇతర రంగాల ద్వారా పొందు ఆదాయం క్రీమీలేయర్ పరిగణనకుఉండవలసిన ఆదాయాన్ని మించిన యెడల, అప్పుడే వారి పిల్లలు క్రీమీలేయర్గా పరిగణించబడతారు.

5.వివిధ సేవా వ్యత్తుల ద్వారా మరియు వ్యాపార, వాణిజ్య రంగాల ద్వారా ఆదాయం పొందుచున్న వారికి మాత్రమే ఆదాయ పరిమితి పరీక్ష వర్తింపజేసి, క్రీమీలేయర్ క్రిందకు వస్తారా ? రారా ? నిర్ణయించాలి.

6.ఎవరైనా కొందరు ఉద్యోగులు కొంత వ్యవసాయ భూమితో పాటు ఇతర రంగాలనుంచి కూడా ఆదాయాన్ని పొందుచున్నప్పుడు వారికి ఇతర రంగాల ద్వారా వచ్చు ఆదాయాన్ని బట్టి మాత్రమే వారి క్రీమీలేయర్ స్టేటస్ను.నిర్ణయించాలి. అంతే కానీ, వేర్వేరు రంగాల ద్వారా వచ్చు ఆదాయాన్ని కలిపి చూసి క్రీమీలేయర్ స్టేటస్ను నిర్ణయించరాదు.

7.కొందరు Land Ceiling Act ప్రకారం వుండవలసిన భూమిలో 85% కన్నా తక్కువ భూమి వున్నందువలన, ఇతరరంగాల ద్వారా వచ్చు ఆదాయం ఆదాయ పరిమితి కన్నా తక్కువగా వున్నందువలన క్రీమీలేయరు క్రిందకు రాక
పోయినప్పటికీ, వారికి పట్టణాలలో వున్న సంపదను బట్టి వారు క్రీమీలేయరు క్రిందకు వచ్చు అవకాశం కలదు. ఇదిఉద్యోగులకు కూడా వర్తిస్తుంది

8.ఒక వ్యక్తి క్రీమీలేయర్ స్టేటస్ తన తల్లిదండ్రుల స్టేటస్ ను బట్టి మాత్రమే నిర్ణయించాలి. తన స్టేటస్తో సంబంధం లేదు అనగా ఎవరైనా గ్రూప్-1 స్థాయి ఉద్యోగమునకు ఎంపిక కాబడి, మళ్ళీ గ్రూప్-1 స్థాయిలోనే ఉన్న మరో ఉద్యోగము కొరకు గ్రూప్-1 పరీక్షలకు గానీ, సివిల్ సర్వీసు పరీక్షలకు గానీ ప్రయత్నం చేసినప్పుడు, అతని స్టేటస్ను బట్టి అతన్ని
క్రీమీలేయర్ గా పరిగణించరాదు. అలాగే స్త్రీల విషయంలో ఆమె తల్లిదండ్రుల స్టేటస్ను బట్టి క్రీమీలేయర్ స్టేటస్ను నిర్ణయించాలే గానీ, ఆమె భర్త స్టేటస్ ను బట్టి కాదు

పై వివరణలను బట్టి క్రీమీలేయరు ఎవరెవరికి వర్తిస్తుందో స్పష్టంగా అర్ధం చేసుకోవచ్చు. ఇది అందరు ఉద్యోగులకు వారి జీతభత్యాలను బట్టి వర్తిస్తుంది అని అనుకోవడం సరికాదు. (1) ఒక ఉద్యోగి తొలి నియమాకపు స్టేటస్ (i)ఉన్న భూమి యొక్క పరిమాణం (il) ప్రైవేట్ సేవలు లేక వ్యాపారం లేక వాణిజ్య రంగాల ద్వారా వచ్చు
ఆదాయం మరియు పట్టణాలలో ఉన్న ఆస్థి ద్వారా వచ్చు ఆదాయం. లాంటి వాటిని విడివిడిగా పరిగణనలోకి తీసుకొని, ఏ కేటగిరి క్రింద క్రీమీలేయర్గా పరిగణించబడతారో స్పష్టంగా నిర్ణయించాలి. ఏ కేటగిరి క్రిందనూ క్రీమీలేయర్ గా పరిగణించబడడానికి వీలులేనప్పుడు అట్టి వారి పిల్లలు క్రీమీలేయర్ క్రిందకు రారు. వేరువేరు లేటగిరీలక్రింద పొందు ఆదాయాన్ని కలిపి చూడరాదు. అలా కలిపి చూసి, క్రీమీలేయర్ స్టేటస్ను నిర్ణయించరాదు


Thanks for reading About OBC Reservation and Creamy layer.

No comments:

Post a Comment