Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, March 4, 2020

AP Cabinet Meeting Highlights 04-03-2020


AP  Cabinet Meeting Highlights 04-03-2020

   వెలగపూడిలోని సచివాయలంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. అనంతరం సమాచారశాఖ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ...కేబినెట్‌ భేటీ వివరాలను వెల్లడించారు. ఉగాది రోజు రాష్ట్ర వ్యాప్తంగా 26లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపినట్లు చెప్పారు.

‘‘స్థలం పొందిన లబ్ధిదారులు ఇల్లు కట్టుకోవడానికి అనుమతి పత్రంతో పాటు, ఐదేళ్ల వరకు స్థలం బ్యాంకులో తనఖా పెట్టుకోవడానికి.. ఐదేళ్ల తర్వాత విక్రయానికి హక్కు కల్పిస్తూ పట్టా ఇవ్వబోతున్నాం. ఇందుకోసం అందరు తహశీల్దార్లకు జాయింట్‌ సబ్‌ రిజిస్టార్లుగా హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నాం. ఇళ్ల స్థలాల కోసం పంపిణీ చేసేందుకు 43,141 ఎకరాల భూమిని సిద్దం చేశాం. ఇందులో 26,976 ఎకరాల ప్రభుత్వ భూమి, 16,164 ప్రైవేటు భూమి ఉంది. యుద్ధ ప్రాతిపదికన ప్లాట్లు అభివృద్ధి చేసి లబ్ధిదారులకు ఇవ్వబోతున్నాం. ఈ కాలనీలన్నింటికీ వైఎస్సార్‌ జగనన్న కాలనీలుగా నామకరణం చేస్తాం’’ అని మంత్రి పేర్ని నాని వివరించారు.

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ సమావేశం బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. సచివాలయంలో జరుగుతున్న ఈ కేబినెట్‌ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చలు జరుపుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో రిజర్వేషన్ల ఖరారు అంశాలపై ప్రధానంగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. దీంతో పాటు ఉగాదికి 25లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీపై సన్నద్ధత, ఓడరేవుల నిర్మాణం, బడ్జెట్‌, ఆర్థిక విధివిధానాలు తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే ఎన్‌సీఆర్‌పై కేబినెట్‌లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

Thanks for reading AP Cabinet Meeting Highlights 04-03-2020

No comments:

Post a Comment