Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, March 3, 2020

If you follow the six precautions, the corona virus will not get infected.


If you follow the six precautions, the corona virus will not get infected.


ఆరు జాగ్రత్తలు పాటిస్తే కరోనా రాదు.

వేడి వాతావరణంలోనూ కరోనా వైరస్ 48 గంటలు బ్రతుకుతుంది

1.కరోనా గాలి ద్వారా వచ్చే వైరస్ కాదు. అంటే... గుంపుగా జనం ఉన్నా... అక్కడి గాలిలో కరోనా వైరస్ ఉండదు. కానీ... ఆ జనంలో ఎవరికైనా కరోనా వైరస్ ఉంటే... వాళ్లు దగ్గినా, తుమ్మినా... అప్పుడు వచ్చే నీటి బిందువుల్లో (తుంపర్లలో) కరోనా వైరస్ ఉంటుంది. అది గాలిలో ఎగురుతూ వచ్చి మనపై పడితే... వైరస్ మనపై చేరే ప్రమాదం ఉంటుంది. అంటే వైరస్ మనకు చేరకుండా ఉండాలంటే... మనపై ఏ తుంపర్లూ పడకూడదన్నమాట. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోండి.

2.ఈ వైరస్ ఉన్న వ్యక్తులు ప్రయాణాల్లో బస్సుల్లో, రైళ్లలో, విమానాల్లో, ఆటోల్లో ఎక్కడైనా సరే, ఏదైనా వస్తువును (రాడ్లు, సీట్లు, డోర్లు వంటివి) ముట్టుకుంటే...వాటిపై వైరస్ ఉండే ఛాన్సుంటుంది. అదే వస్తువును మనమూ ముట్టుకుంటే... ఆ వైరస్ మనపై చేరే ప్రమాదం ఉంటుంది. కాబట్టి... వీలైనంతవరకూ అలాంటివేవీ ముట్టుకోకుండా జాగ్రత్త పడాలి. చేతులకు గ్లోవ్స్ వాడితే మంచిదే. లేదంటే ప్రయాణం తర్వాత చేతుల్ని సబ్బుతో బాగా కడిగేసుకోవాలి. అలాగే... ప్రయాణ సమయాల్లో హ్యాండ్ శానిటైజర్ వాడాలి. రెండు, మూడు చుక్కలు చేతిలో వేసుకొని... రెండు చేతులకూ రాసుకోవాలి. అలా ప్రయాణం చేసిన ప్రతిసారీ రాసుకుంటే... వైరస్ మన చేతులకు చేరదు.

3.ముఖానికి మాస్క్ పెట్టుకుంటే చుట్టూ ఉన్నవాళ్లు మనల్నే చూస్తూ... అమ్మో ఇతనికి వ్యాధి ఉందేమో అనుకునే ఛాన్స్ ఉంటుంది. అయినప్పటికీ మాస్క్ వాడటం మేలు కాబట్టి... అది వాడొచ్చు. లేదంటే కనీసం కర్చీఫ్ అయినా ముఖానికి (ముక్కూ, నోరూ మూసుకునేలా) కట్టుకుంటే మంచిదే.

4.వైరస్ ఉన్నవారికి కనీసం 2 మీటర్ల దూరంలో ఉండాలి. కానీ ఎవరికి వైరస్ సోకిందో మనకు తెలియదు కదా. కాబట్టి... మనలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండేలా జాగ్రత్త పడాలి. వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు, గింజల వంటివి ఎక్కువగా తినాలి. ముఖ్యంగా పుల్లటి పండ్లను బాగా తినాలి. వాటిలోని C విటమిన్... ఇలాంటి వైరస్‌లను బాడీలోకి రానివ్వకుండా చేస్తుంది.

5.జలుబు, దగ్గు, నీరసం, ఆయాసం వంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ వైరస్ వెంటనే సోకుతోంది. కాబట్టి... ఇలాంటి అనారోగ్యాలు ఉన్నవారు మరింత ఎక్కువ జాగ్రత్త పడాలి. బయటి ప్రయాణాలు మానుకుంటే బెటర్.

6.ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వైరస్ సోకితే... భయపడాల్సిన పనిలేదు. మనో ధైర్యంతో నాకేంకాదు... కచ్చితంగా రికవరీ అవుతా అని మనసులో మాటిమాటికీ అనుకుంటూ ధైర్యంగా ఉండాలి. ఈ ధైర్యం పెరిగేకొద్దీ... బాడీలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అది వైరస్‌తో పోరాడుతుంది.

Thanks for reading If you follow the six precautions, the corona virus will not get infected.

No comments:

Post a Comment