Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, March 21, 2020

Rajinikanth in 'Man vs. Wild' episode to be telecast on March 23 with Bear Grills


Rajinikanth in 'Man vs. Wild' episode to be telecast on March 23 with Bear Grills


బేర్ గ్రిల్స్‌తో మార్చి 23న ప్రసారం కానున్న 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' ఎపిసోడ్‌లో రజనీకాంత్ కనిపించనున్నాడు. డిస్కవరీ ఛానెల్‌లో ఈ వైల్డ్ షో ప్రసారం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీతో వైల్డ్ షో చేసిన తర్వాత మ్యాన్ వర్సెస్ వైల్డ్ షోలో బేర్ గ్రిల్స్ తో రజనీ తనదైన స్టయిల్‌తో ఆకట్టుకుంటున్నాడు. రజనీకాంత్‌ తొలిసారి బుల్లితెరపై కనిపించనున్నడంతో అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. డిస్కవరీ ఛానల్‌లో శుక్రవారం రిలీజ్ అయిన స్నీక్ పీక్ ఎపిసోడ్ హైలెట్‌గా నిలిచింది. కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో బేర్ గ్రిల్స్, రజనీ ఇద్దరూ కలిసి కొన్ని అడ్వంచర్లతో ఆకట్టుకున్నారు. ఈ ఎపిసోడ్‌లో రజనీ భారతదేశం నీటి సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటోంది వంటి అంశాలను ప్రస్తావించారు.
అంతేకాదు.. రజనీ తన జీవితంలో సూపర్ స్టార్ స్థాయికి ఎలా ఎదిగాడు అనేది కూడా వివరించారు. తన బస్ కండక్టర్ గా ఉద్యోగం చేస్తున్న రోజుల్లో కె.బాలచందర్ తనకు సినిమాల్లో అవకాశం ఇచ్చారని రజనీ గుర్తు చేసుకున్నారు. తాడుతో సాయంతో ఎత్తైన ప్రదేశానికి ఇద్దరూ చేరుకున్నారు. నిజమైన అడ్వెంచర్ అంటే ఇదేనంటూ రజనీ అంటుండగా. బేర్ గ్రిల్స్.. రజనీ కాలికి షూ లేస్ ఊడిపోవడం గమనించి సరిచేశాడు. కాగా గ్రిల్స్.. మీరు చాలా ఫిట్ గా ఉన్నారని, మీరు ఏమనుకోనంటే మీ వయస్సు ఎంతో చెబుతారా? అని రజనీని అడిగాడు. దానికి రజనీ నవ్వుతూ.. తనకు 70 ఏళ్లు అని అనడంతో గ్రిల్ షాక్ అయ్యాడు.. వావ్.. మీరే మా అందరికి స్ఫూర్తి అంటూ గ్రిల్ ఎమోషనల్ అయ్యాడు. మార్చి 23న డిస్కవరీ ఛానల్లో రాత్రి 8 గంటలకు వైల్డ్ ప్రిమియర్స్ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

To View the trailer

Thanks for reading Rajinikanth in 'Man vs. Wild' episode to be telecast on March 23 with Bear Grills

No comments:

Post a Comment