Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, May 4, 2020

DSC-2020 సమాచారం


DSC-2020 సమాచారం


 టీచర్ల నియామకానికి సంబంధించి 2018 డీఎస్సీ నియామకాలు పూర్తి అయిన తరువాతే కొత్తగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌), ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)ల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టం చేశారు.
► 2018 డీఎస్సీ విషయంలో న్యాయ వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో కొత్త టెట్, డీఎస్సీ నిర్వహించే పరిస్థితి లేదు.
కరోనా , లాక్‌డౌన్‌ వంటి ప్రస్తుత పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు.
► 2018 డీఎస్సీ వివాదాలు పూర్తిగా సమసిపోయి, నియామకాలు పూర్తయ్యాకే కొత్త టెట్, డీఎస్సీలపై నిర్ణయం.
► న్యాయ వివాదాలపై ప్రభుత్వ వాదనలను సమర్థంగా వినిపించి, అర్హత సాధించిన అభ్యర్ధులకు న్యాయం చేస్తాం. ఎస్‌జీటీ, మోడల్‌ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, పీఈటీల పోస్టులపై కోర్టులో వ్యాజ్యాలు కొనసాగుతున్నాయి.
► హిందీ, తెలుగు పండిట్‌ పోస్టుల వ్యాజ్యాలు క్లియర్‌ అయ్యాయి. వీటికి ఈ నెలాఖరుకు నియామక ఉత్తర్వులు ఇవ్వాలనే అభిప్రాయంతో ఉన్నాం అని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ డిఎస్సి-2020 సమాచారం
    ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ నిర్వహణ కు సంబంధించి టెట్ మరియు డిఎస్సిలను వేరువేరుగా నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. ఈసారి టెట్-3 ని ఆన్లైన్ లో నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తుంది. ప్రస్తుతం కోవిడ్ -19 వ్యాప్తి నియంత్రణ కొరకు లక్డౌన్ కొనసాగుతుండడం తో నిర్ణయ తేదీలను ప్రకటించకుండానే నిర్వహణ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
   ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారు 9000 పైచిలుకు పోస్టులతో ఎపి డిఎస్సి -2020 ని నిర్వహించే అవకాశం వుంది. ఎపి డిఎస్సి 2020 కి సంబంధించి సుమారు 3000 పోస్టులు వరకు ఎస్ఏ లు, పీజీటీ, టీజీటీ లు 300 వరకు, ఎస్జీటీ లు 5000 పైగా ఖాళీలు వున్నాయి. ఈ సారి ఎస్జీటీ పోస్టులు ఎక్కువ వుండే అవకాశం వుంది.
ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సి-2020 కి సంబంధించి జిల్లా అధికారులు విద్యాశాఖకు తెలియజేసిన ఉపాధ్యాయ ఖాళీల వివరాలు
శ్రీకాకుళం :550
విజయనగరం :471
 విశాఖ పట్నం :549 
తూర్పు గోదావరి :2097
పశ్చిమ గోదావరి:507
కృష్ణ : 600
గుంటూరు :520
నెల్లూరు :575
అనంతపురం :471
కడప :543
కర్నూలు :1546 
అయితే చిత్తూరు, మరియు ప్రకాశం జిల్లా ఉపాధ్యాయ ఖాళీల వివరాలు లెక్క తెలియాల్సి వుంది.
గమనిక: ప్రభుత్వం ఖాళీలపై సమాచారం ప్రకటించవలసి ఉన్నది.

Thanks for reading DSC-2020 సమాచారం

No comments:

Post a Comment