Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, June 20, 2020

Ap లో 10th& inter పరీక్షలు రద్దు....



Ap లో 10th& inter పరీక్షలు రద్దు....


అమరావతి: ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దయ్యాయి. విద్యార్థులు అంతా పాస్ అయినట్టు మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. దీంతోపాటు ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులను కూడా పాస్ చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు ఇప్పటికే పదవ తరగతి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులకు గ్రేడ్‌లు ఇచ్చిన విషయం తెలిసిందే.


రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా పరీక్షలు రద్దు చేశామని తెలిపింది. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని... భవిష్యత్తులో కరోనా కేసులు పెరుగుతాయని సర్వేలు చెబుతున్నాయని మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. రాష్ట్రంలో మెుత్తం 6.3 లక్షల మంది పదోతరగతి విద్యార్థులు ఉన్నారు.
అనేక తర్జనబర్జనల అనంతరం 10వ తరగతి  పరీక్షలు రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఒకవైపు విద్యార్ధులు, తల్లిదండ్రులు మరియు రాజకీయ నాయకులు రద్దు చేయాలని డిమాండ్లు మరో వైపు కరోనా అంతకంతకు పెరుగుతున్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయమై శుక్రవారం పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ విద్యాశాఖ ఉన్నతాధికారులు, జిల్లా విద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసినప్పటికీ, పరీక్షలు నిర్వహిస్తే మరిన్ని ఇబ్బందులు పెరుగుతాయని పరీక్షలు రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. ఇప్పటికే తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాలు 10వ తరగతి  పరీక్షలు రద్దు చేసిన సంగతి తెలిసినదే.
విద్యార్ధులు ఫార్మేటివ్ అసెస్మెంట్- 1 & 2 సమ్మేటివ్ అసెస్మెంట్-1 పరీక్షల్లో విద్యార్థులు సాధించిన ప్రగతి ఆధారంగా గ్రేడ్లు నిర్ణయించనున్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా లాక్ డౌన్ పీరియడ్ లో కూడా ‘విద్యామృతం’ పేరుతో డిడి సప్తగిరి లో వీడియో పాఠాలు , ‘విద్యాకలశం’  పేరుతో రేడియో కార్యక్రమాలను డిజిటల్ తరగతులు నిర్వహించడం తెలిసిందే







Thanks for reading Ap లో 10th& inter పరీక్షలు రద్దు....

No comments:

Post a Comment