Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, June 16, 2020

AP budget highlights


AP బడ్జెట్‌ ముఖ్యాంశాలు ఇవే .....

అమరావతి: ఏపీ అసెంబ్లీలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు. రెండోసారి ఆయన అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ను తెలుగులో చదివారు. బడ్జెట్ అంచనా వ్యయం రూ.2,24,789 కోట్లుగా, రెవెన్యూ అంచనా రూ.1,80,392 కోట్లు, మూలధన వ్యయం రూ.44,396 కోట్లుగా బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలియజేశారు.
బడ్జెట్‌లో ముఖ్యాంశాలు ఇవే:

  1. వ్యవసాయానికి రూ.11,891 కోట్లు
  2. వైఎస్‌ఆర్‌ రైతు భరోసాకు రూ.3,615 కోట్లు
  3. ధరల స్థిరీకరణ నిధి రూ.3 వేల కోట్లు
  4. వడ్డీ లేని రుణాల కోసం రూ.1,100 కోట్లు
  5. మైనార్టీ సంక్షేమానికి రూ.1,998 కోట్లు
  6. ఎస్టీల సంక్షేమానికి రూ.1,840 కోట్లు
  7. ఎస్సీల సంక్షేమానికి రూ.7,525 కోట్లు
  8. కాపుల సంక్షేమానికి రూ.2,845 కోట్లు
  9. బీసీల సంక్షేమానికి రూ.23,406 కోట్లు
  10. విద్యశాఖకు రూ.22,604 కోట్లు
  11. వైద్య రంగానికి రూ.11,419 కోట్లు
  12. ఆరోగ్యశ్రీకి రూ.2100 కోట్లు
  13. వైఎస్‌ఆర్‌ గృహవసతికి రూ.3వేల కోట్లు
  14. పీఎం ఆవాజ్‌ యోజన అర్బన్‌కు రూ.2540 కోట్లు
  15. పీఎం ఆవాజ్‌ యోజన (గ్రామీణం) రూ.500 కోట్లు
  16. బలహీనవర్గాల గృహ నిర్మాణానికి రూ. 150 కోట్లు
  17. డ్వాక్రా సంఘాలకు రూ.975 కోట్లు
  18. రేషన్‌ బియ్యానికి రూ.3వేల కోట్లు
  19. కరోనాపై పోరులో ముందున్నాం
  20. కరోనా సందర్భంగా ఆర్థిక వ్యవస్థ కుంటుపడకుండా చర్యలు
  21. 2018-19లో స్థూల ఉత్పత్తి 8శాతమే పెరిగింది


గవర్నర్ బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవే..

ఉత్పాదకత పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్‌ విశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు. దేశంలోనే తొలిసారి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గవర్నర్‌ ప్రసంగించారు. 


1. మేనిఫెస్టోలో లేని 40 హామీలను అమలు చేశాం

2. జల, ఖనిజ వనరులను సద్వినియోగం చేసుకుంటున్నాం 

3. విద్యుత్‌, రవాణా, పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తున్నాం

4. అణగారిన వర్గాలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ హక్కులు కల్పించేందుకు చర్యలు

5. ప్రజలకు విద్య, వైద్యం అందించేందుకు అత్యంత ప్రాధాన్యత

6. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం

7. ఏడాదిలో రూ.42 వేల కోట్లతో సంక్షేమ పథకాలు

8. 18 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్

9. రాష్ట్రంలో సేవారంగంలో 9.1శాతం వృద్ధి. పారిశ్రామిక రంగంలో 5 శాతం వృద్ధి

10. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 8 శాతం వృద్ధి

11. 122 హామీల్లో 77 హామీలు నెరవేర్చాం..39 హామీలు పరిశీలనలో ఉన్నాయి

12. మన బడి పథకంలో 15700 స్కూళ్లలో మౌలిక వసతుల కల్పన

13. దశల వారీగా మూడేళ్లలో 45 వేల పాఠశాలల అభివృద్ధి

14. వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 6.20 లక్షల మందికి సేవలు

15. హైదరాబాద్, చెన్నై, బెంగూళూరులోనూ ఆరోగ్యశ్రీ సేవలు

16. వైఎస్‌ఆర్‌ కంటి వెలుగుతో 67 లక్షల మంది విద్యార్థులకు పరీక్షలు

17. విజయవంతంగా కొనసాగుతున్న వైఎస్‌ఆర్‌ టెలీ మెడిసిన్‌

18. నాడు- నేడు పథకం కింద ప్రభుత్వ ఆస్పత్రులను జాతీయ స్థాయిలో అభివృద్ధి

19. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా ద్వారా ప్రతి రైతుకు 13,500 సాయం

20. కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపజేస్తున్నాం

21. కరువు పరిస్థితుల నుంచి బయటపడేందుకు రూ. 2వేల కోట్ల విపత్తు సాయం

22. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7లక్షల ఎక్స్‌గ్రేషియా

23. ఎక్కడా లేని విధంగా 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు

24. వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కింద 50 లక్షల మందికి లబ్ధి..ఇంటి వద్దే పెన్షన్‌ అందిస్తున్నాం

25. సంక్షేమ పథకాల ద్వారా 3.92 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు

26. సూక్ష్మ, చిన్న పరిశ్రమలను ఆదుకునేందుకు రూ.900 కోట్ల సాయం

27. గ్రామీణ ఉత్పత్తులు విక్రయించేందుకు త్వరలో వైఎస్‌ఆర్‌ జనతా బజార్‌లు

28. ఇళ్ల పట్టాలు, సంక్షేమ పథకాలు మహిళల పేరుతో ఇవ్వడం ద్వారా మహిళా అభ్యున్నతికి చర్యలు చేపడుతున్నాం

29. ప్రతి గ్రామంలో వైఎస్‌ఆర్‌ క్లినిక్‌లు 

30. బలహీనవర్గాల అభ్యున్నతికి 50 శాతం నామినేటెడ్‌ పోస్టులు, పనులు

31. అత్యాచారాల నిరోధానికి దిశ చట్టం 

32. పట్టణాల్లో రక్షిత మంచినీటికి ప్రాధాన్యత ఇస్తున్నాం 

33. 2021 డిసెంబర్‌లోగా పోలవరం పూర్తి 

34. వచ్చే నాలుగేళ్లలో సాగునీటి ప్రాజెక్ట్‌లు పూర్తి చేస్తాం 

35. రివర్స్‌ టెండరింగ్ ద్వారా రూ.2200 కోట్లు ఆదా చేశాం

36. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడులో ఓడరేవుల నిర్మాణం

37. పోర్టుల నిర్మాణానికి మూడేళ్లలో రూ.3200 కోట్లు 

38. పెట్టుబడులను ఆహ్వానించేందుకు త్వరలో కొత్త పారిశ్రామిక విధానం 

39. కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నాం.. రోజుకు 15 వేల టెస్ట్‌లు

40. ఇప్పటికే 5.5 లక్షల టెస్ట్‌లు చేశాం 

41. జాతీయ సగటు కంటే ఏపీలో రికవరీ రేటు అధికం 

42. 38 వేల ఐసోలేషన్ బెడ్స్‌ సిద్ధం.. 1300 వెంటిలేటర్లు ఉన్నాయి

43. 24 వేల మంది వైద్యులు..24500 మంది పారామెడికల్ సిబ్బంది సేవలు

44. గ్రామ వాలంటీర్లు, పోలీసులు సమర్ధవంతంగా పనిచేశారు 

45. 3.2 లక్షల మంది వలస కార్మికుల ప్రయాణ ఖర్చులు భరించాం

Thanks for reading AP budget highlights

No comments:

Post a Comment