Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, June 23, 2020

AP Government Canceled last semester exams of Degree, PG, B.Tech, Vocational Education Courses


డిగ్రీ, పీజీ, బీటెక్‌, వృత్తి విద్య కోర్సుల చివరి సెమిస్టర్‌ పరీక్షలు రద్దు

అమరావతి: కరోనా వ్యాప్తి రోజురోజుకీ ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో ఏపీ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన సర్కార్‌.. తాజాగా డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సుల చివరి సెమిస్టర్‌ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అన్ని విశ్వవిద్యాలయాల వీసీలు, రిజిస్ట్రార్లు, ఇతర ఉన్నతాధికారులతో విద్యాశాఖ మంత్రి సురేష్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన అనంతరం ఈ నిర్ణయం వెల్లడించారు. అలాగే, డిగ్రీ మొదటి, రెండో ఏడాది చదువుతున్న విద్యార్థులను ప్రమోట్‌ చేయాలని నిర్ణయించింది. డిగ్రీ, పీజీ ఫైనల్‌ సెమిస్టర్‌ రద్దు నేపథ్యంలో గ్రేడింగ్‌ లేదా మార్కులపై నిర్ణయం నిర్ణయం తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. స్థానిక విశ్వవిద్యాయాల ఎగ్జిక్యూటివ్‌ కమిటీలు వీటిపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది.


రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో వర్సిటీల పరిధిలోని అన్ని కోర్సుల చివరి సెమిస్టర్ పరీక్షలు రద్దు చేయాలని అభిప్రాయం వ్యక్తమైంది. పరీక్షల నిర్వహణ, అకడమిక్‌ క్యాలెండర్​పై వర్సిటీల ఉపకులపతులతో మంత్రి ఆదిమూలపు సురేశ్ మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పరీక్షలు రద్దు చేస్తే మిడ్‌ సెమిస్టర్‌, ఇతర అంతర్గత పరీక్షల మార్కులు, వైవా ఆధారంగా చివరి సెమిస్టర్‌ విద్యార్థులకు మార్కులు కేటాయించాలని నిర్ణయించారు. ఏ విధానం పాటించాలనే దానిపై వర్సిటీల పాలక మండళ్లల్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. గత సంవత్సరాల్లో ఫెయిల్‌ అయిన సబ్జెక్టులుంటే వాటికి అంతర్గత మార్కులు, మౌఖిక పరీక్షల ఆధారంగా క్రెడిట్లు కేటాయించనున్నారు.

డిగ్రీ మొదటి రెండేళ్లు, బీటెక్‌ మూడేళ్లు, పీజీ తొలి ఏడాది విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు లేకుండానేపై తదుపరి విద్యా సంవత్సరానికి ప్రమోట్‌ చేయాలని అభిప్రాయపడ్డారు. ఈ అకడమిక్‌ ఏడాది ఆగస్టులో ప్రారంభమవనుండగా వారందరికీ ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించనున్నారు. అంబేడ్కర్‌, రాయలసీమ విశ్వవిదాలయాల్లో ఇప్పటికే పరీక్షలు నిర్వహించగా ఆ జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి మార్కులు ఇవ్వాలని నిర్ణయించారు. కొన్ని వర్సిటీల్లో కేవలం కొన్ని సబ్జెక్టులకే పరీక్షలు జరగ్గా మిగతావాటికి అంతర్గత మూల్యాంకనం ద్వారా క్రెడిట్లు కేటాయించనున్నారు.

Thanks for reading AP Government Canceled last semester exams of Degree, PG, B.Tech, Vocational Education Courses

No comments:

Post a Comment