Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, June 23, 2020

Jobs in SBI with degree and PG qualification ..


Jobs in SBI with degree and PG qualification ..
డిగ్రీ, పీజీ చేసిన వారికి ఎస్‌బీఐలో జాబ్స్‌..

🔰భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) దేశవ్యాప్తంగా తమ బ్యాంకుకు చెందిన బ్రాంచుల్లో పనిచేసేందుకు గాను ఆసక్తిఉన్న భారతీయ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎగ్జిక్యూటివ్‌ (ఎఫ్‌ఐ అండ్‌ ఎంఎం), సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (సోషల్‌ బ్యాంకింగ్‌ అండ్‌ సీఎస్సార్‌) విభాగాల్లో మొత్తం 326 ఖాళీలు ఉన్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. ఇందుకుగాను బ్యాంక్‌ నేరుగా రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను చేపట్టింది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఏ ఎస్‌బీఐ బ్రాంచిలోనైనా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఇక ఈ ఉద్యోగాలకు గాను దరఖాస్తు ప్రక్రియను మంగళవారం నుంచి ఎస్‌బీఐ ప్రారంభించింది. జూలై 7వ తేదీ వరకు దరఖాస్తుల సమర్పణకు గడువు విధించారు.

 🍁పోస్టుల వివరాలు -

🔰 ఎగ్జిక్యూటివ్‌ (ఎఫ్‌ఐ అండ్‌ ఎంఎం), సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (సోషల్‌ బ్యాంకింగ్‌ అండ్‌ సీఎస్సార్‌)

🔅సంస్థ - స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)
🔅 విద్యార్హతలు - ఎగ్జిక్యూటివ్‌ పోస్టుకు రూరల్‌ ఎకానమీ లేదా అగ్రికల్చర్‌లో డిగ్రీ లేదా పీజీ చేసి ఉండాలి. అలాగే అల్లైడ్‌ యాక్టివిటీస్‌ లేదా హార్టికల్చర్‌ కోర్సు చదివి ఉండాలి. సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుకు ఏ సబ్జెక్టులో అయినా డిగ్రీ లేదా పీజీ చేసి ఉండాలి. సోషల్‌ సైన్సెస్‌ లేదా సోషల్‌ వర్క్‌ కోర్సులు చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
🔅అనుభవం - ఆయా పోస్టులకు గాను వాటిల్లో కనీసం 3 ఏళ్ల అనుభవం ఉండాలి.
🔅స్కిల్స్‌ - ఉంటే మంచిది
🔅 ఉద్యోగం చేయాల్సిన ప్రదేశం - దేశంలోని ఏ ఎస్‌బీఐ బ్రాంచిలోనైనా సరే
🔅శాలరీ స్కేల్‌ - ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వేతనం ఇస్తారు.
🔅రంగం - బ్యాంకింగ్‌
🔅దరఖాస్తులు ప్రారంభమయ్యే తేదీ - జూన్‌ 23, 2020
🔅 దరఖాస్తుల సమర్పణకు ఆఖరి తేదీ - జూలై 13, 2020

🔰వయస్సు అర్హత, ఫీజు వివరాలు…
మార్చి 31, 2020 వరకు 

➡️ఎగ్జిక్యూటివ్‌ పోస్టుకు 30 ఏళ్లు, ➡️సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుకు 35 ఏళ్లు వయస్సు మించరాదు.

🔅 అప్లికేషన్‌ ఫీజు రూ.750ని నెట్‌బ్యాంకింగ్‌, డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజు చెల్లించాల్సిన పనిలేదు.

పోస్టుల వివరాలు…

🔅ఎగ్జిక్యూటివ్‌ (ఎఫ్‌ఐ అండ్‌ ఎంఎం) - 241
🔅సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (సోషల్‌ బ్యాంకింగ్‌ అండ్‌ సీఎస్సార్‌) - 85

మొత్తం పోస్టులు - 326

ఆసక్తి ఉన్న అభ్యర్థులు https://recruitment.bank.sbi/crpd-sco-2020-21-10/apply వెబ్‌సైట్‌ను సందర్శించి ఆయా పోస్టులకు అప్లై చేయవచ్చు.

Thanks for reading Jobs in SBI with degree and PG qualification ..

No comments:

Post a Comment