Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, June 6, 2020

AP government guidelines : సడలింపులతో ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు..రేపట్నుంచి అమల్లోకి !


AP government guidelines:సడలింపులతో ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు.రేపట్నుంచి అమల్లోకి!



కేంద్ర ప్రభుత్వం పలు సడలింపులతో ఈనెల 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించింది. కేంద్రం సడలింపులకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం ఈనెల 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. రేపట్నుంచి నుంచి మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. కంటైన్‌మెంట్‌ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లకు అనుమతినిచ్చింది. ఆహారం పార్శిల్‌ తీసుకువెళ్లేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పింది. 65 ఏళ్లు పైబడిన వ్యక్తులు, 10 ఏళ్లలోపు చిన్నారులు బహిరంగ ప్రదేశాల్లోకి రాకూడదని తెలిపింది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ని మార్గదర్శకాలనూ అన్ని ప్రాంతాల్లో అమలు చేయాలని ఆదేశాలు జారీచేసింది.ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లలో 50 శాతం మందికి మాత్రమే ప్రవేశం కల్పించాలని స్పష్టం చేసింది. ప్రార్థనా మందిరాల్లో తీర్థ ప్రసాదాలు ఇవ్వడం, పవిత్ర జలాలను భక్తులపై చల్లడం నిషేధించింది ప్రభుత్వం.

◆కంటైన్మెంట్ జోన్లలో అన్ని ఆంక్షలు యథావిధిగా అమలు.
◆రాష్ట్రంలో దేవాలయాలు, ఇతర ధార్మిక ప్రదేశాలు తెరుచుకునే అవకాశం.
◆కానీ ఆలయాల్లో విగ్రహాలను, పవిత్ర గ్రంథాలను తాకకుండా దర్శనాలు.
◆తీర్థప్రసాదాలు, పవిత్ర జలాలు భక్తులపై చల్లడం కుదరదు.
◆అన్నదానం లాంటివి నిర్వహించాలంటే భౌతికదూరం తప్పనిసరి.
◆కంటైన్మెంట్ జోన్ల వెలుపల ఇతర ప్రదేశాల్లో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాళ్లు తెరుచుకోవచ్చు.
◆షాపింగ్ మాల్స్ తెరిచినా అందులో ఉన్న సినిమా థియేటర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదు.
◆షాపింగ్ మాల్స్ లో ఏసీ 24 డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్య ఉండేలా చూడాలి.
◆ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లలో 50 శాతం మందికి మాత్రమే ప్రవేశం.
◆హోటళ్లు, రెస్టారెంట్లలో కస్టమర్లు మారిన ప్రతిసారీ టేబుళ్లు, కుర్చీలను శానిటైజ్ చేయాలి.
◆డిజిటల్ చెల్లింపులకు అనుమతి ఉన్న షాపింగ్ మాళ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు ఈవాలెట్ సౌకర్యం కల్పించాలి.
◆బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు.
◆65 ఏళ్లు పైబడిన వ్యక్తులు, 10 ఏళ్ల లోపు చిన్నారులు ఇంటివద్దే ఉండాలి.
◆కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలు విధిగా పాటించాలి.

Thanks for reading AP government guidelines : సడలింపులతో ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు..రేపట్నుంచి అమల్లోకి !

No comments:

Post a Comment