Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, June 6, 2020

Seven principles for schools


Seven principles for schools
పాఠశాలలకు సప్త సూత్రాలు
Seven principles for schools
 కరోనా వైరస్‌ దృష్ట్యా వచ్చే విద్యా సంవత్సరంలో విద్యాసంస్థలు తీసుకోవాల్సిన చర్యలపై పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. 2020-21 విద్యా సంవత్సరంలో ఆగస్టు 3 నుంచి పాఠశాలలు ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించినందున పాఠశాలలను ఆ దిశగా సన్నద్ధం చేస్తోంది. అన్ని రకాల యాజమాన్యాలకు చెందిన పాఠశాలలకు 'సప్త సూత్రా'లను అమలు చేయాలని సూచించింది. ఒక తరగతిలో 30 మంది విద్యార్థుల కంటే ఎక్కువ ఉంటే రెండు విడతలుగా తరగతులు నిర్వహించాలని తెలిపింది. సాధారణ పరిస్థితులు వచ్చేంత వరకు మధ్యాహ్న భోజన పథకం కింద సరుకులు పంపిణీ చేయాలని సూచించింది. 

మార్గదర్శక వివరాలు ఇలా ఉన్నాయి...

1. పాఠశాలల ఆవరణ : పాఠశాల ఆవరణను క్రిమిసంహారకంగా శుద్ధి చేయాలి. ప్రవేశ ద్వారం వద్ద విద్యార్థుల శరీర ఉష్ణోగ్రతలు పరిశీలించాలి. 30 మంది పిల్లలకు రెండు చొప్పున ఆటోమేటెడ్‌ చేతులు కడిగే యంత్రాలు ఏర్పాటు చేయాలి. వాషబుల్‌ క్లాత్‌ మాస్క్‌లను విద్యార్థులు, ఉపాధ్యాయులకు అందించాలి.

2. స్కూలు నిర్వహణ సమయం : పాఠశాల ఆవరణలో ఉదయం నిర్వహించే ప్రార్థన రద్దు. అయితే తరగతి గదిలో మైకుల ద్వారా చేయించుకోవచ్చు. 30 మంది విద్యార్థులకు మించి ఉంటే ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 12:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు రెండు విడతల్లో తరగతులు నిర్వహించాలి. ప్రతిరోజు 15 నిమిషాలు కొవిడ్‌-19 నివారణ చర్యలను వివరించాలి.

3. విద్యార్థుల ఆరోగ్యం కోసం : విటమిన్‌-ఏ కోసం రెగ్యులర్‌గా ఐరన్‌ మరియు ఫోలిక్‌ యాసిడ్‌ టాబ్లెట్లు కొనసాగించాలి. రెండు వారాలకోసారి శనివారం నాడు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. ఆటల పీరియడ్‌ను రద్దు చేయాలి. శనివారం 'నో స్కూల్‌ బ్యాగ్‌ డే' నిర్వహించాలి.

4. మధ్యాహ్న భోజన పథకం : సాధారణ పరిస్థితులు వచ్చే వరకు మధ్యాహ్న భోజన పథకం కింద సరుకులను అందించాలి.

5. పరీక్షల ప్రొటోకాల్ : పరీక్షా కేంద్రాల వద్ద శరీర ఉష్ణోగ్రతను పరిశీలించడం తప్పనిసరి. ఒక్కో గదిలో 10 మంది మాత్రమే పరీక్షలకు అనుమతించాలి.

6. స్పాట్‌ వాల్యుయేషన్‌ సెంటర్లు : మూల్యాంకన కేంద్రాలను జిల్లాస్థాయిలో ఏర్పాటు చేయాలి. స్పాట్‌ కేంద్రాల్లో క్రిమిసంహారక మందులు స్ర్పే చేయాలి.

7. లాక్‌డౌన్‌ సూచనలు : స్కూలు పాయింట్‌ వద్దే విద్యార్థులందరికీ వర్క్‌ షీట్లు అందజేయాలి. టీవీల ద్వారా సూచనలకు సంబంధించిన వీడియోలను ప్రసారం చేయించాలి. వారాంతపు అసైన్‌మెంట్లు నిర్వహించాలి.

Thanks for reading Seven principles for schools

No comments:

Post a Comment