Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, June 17, 2020

Benefits of Ginger


Benefits of Ginger
అల్లం వలన కలిగే ప్రయోజనాలు


అల్లం ఆరోగ్యానికి మంచిదని తెలిసిందే. అయితే, దీన్ని తినేందుకు చాలామంది ఇష్టపడరు. అల్లంలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే.. తప్పకుండా రోజువారీ డైట్‌లో అల్లాన్ని చేర్చుకుంటారు. ఎందుకంటే అల్లం వల్ల మీ శరీరంలో జీర్ణశక్తి పెరుగుతుంది. కండరాల నొప్పులు తగ్గుతాయి. ఉదయాన్ని టీలో అల్లం కలుపుకుని తింటే అనారోగ్యం దరిచేరదు. అల్లాన్ని పచ్చిగా నమిలినా సరే లేదా తేనెతో కలిపి తిన్నా, జ్యూస్‌లా చేసుకుని తాగినా మంచిదే. మరి అల్లం వల్ల ఆరోగ్యానికి కలిగే ఆ ఆరు ప్రయోజనాలేమిటో చూసేద్దామా!

1 కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో రోజూ అల్లాన్ని తీసుకోండి.
అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు మీ శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

2 లాక్‌డౌన్ వల్ల ఇప్పుడు చాలామంది బరువు సమస్యతో బాధపడుతున్నారు. మున్ముందు కూడా లాక్‌డౌన్ కొనసాగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో బరువు తగ్గడంపై దృష్టిపెట్టండి. అల్లం మీ ఆకలిని తగ్గిస్తుంది. జీర్ణక్రియ సమయంలో మీరు బర్న్ చేసే కేలరీల సంఖ్యను మెరుగుపరచడానికి ఇది సహాయపడుతుంది.

3 మధుమేహం ఉన్నవారు తప్పకుండా అల్లం తీసుకోవాలి. అల్లం రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుందని ఇటీవల ఓ సర్వే పేర్కొంది. అలాగే, మధుమేహం రోగుల్లో ఇన్సులిన్ వ్యవస్థ మెరుగుపడేందుకు అల్లం ఉపయోగపడుతుంది. అయితే, దీన్ని మీరు డైట్‌గా తీసుకోవాలంటే వైద్యుల సూచన తీసుకోండి.


4 వ్యాయమం వల్ల కలిగే కండరాల నొప్పిని తగ్గించడంలో అల్లం ప్రభావవంతంగా పనిచేస్తుంది. అయితే ఇది వెంటనే ఫలితాన్ని చూపించదు. నెమ్మది నెమ్మదిగా ఉపశమనం కలిగిస్తుంది. కీళ్లు, ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడానికి కూడా అల్లం ఉపయోగపడుతుంది.

5 అల్లం జింజెరోల్ కలిగి ఉంటుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు దగ్గు, జలుబు, గొంతు నొప్పి నుంచి త్వరగా కోలుకోవడానికి ఉపయోగపడుతుంది. ఉదయాన్నే ఒక అల్లం టీ తాగితే చాలు అన్నీ క్షణాల్లో మాయమై మంచి ఉపశమనం కలుగుతుంది.

6 కడుపు ఖాళీ కావడానికి అల్లం బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక అజీర్ణ సమస్యలను ఎదుర్కొంటున్నవారికి అల్లం చాలా మంచిది. కడుపులో ఏర్పడే నొప్పులను ఇది తగ్గిస్తుంది. వికారంతో బాధపడుతున్నవారికి ఇది మంచి మందు కూడా.

Thanks for reading Benefits of Ginger

No comments:

Post a Comment