Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, June 17, 2020

Don't use 52 China apps..Intelligence alerts


 Don't use 52 China apps..Intelligence alerts
ఈ 52 చైనా యాప్స్ వాడనియ్యకండి..ఇంటలిజెన్స్ హెచ్చరికలు !


  భారత్ - చైనా సైనికుల ఘర్షణలలో 20 మంది భారత సైనికులు మృతి చెందడం దేశ వ్యాప్తంగా చైనా పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. చైనా ఉత్పత్తులను నిషేధించడం ద్వారా భారత వీర జవాన్లకు నివాళులు అర్పించాలని సోషల్ మీడియాలో పోస్ట్ లు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ నేపధ్యంలో భారత ఇంటెలిజెన్స్ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. చైనాతో లింక్ ఉన్న 52 మోబైల్ అప్లికేషన్‌లను బ్లాక్ చేయాలని లేదా వాటిని వాడకుండా దేశ ప్రజలకు పిలుపునివ్వాలని సూచనలు చేశారు.

   ఈ జాబితాలో మనవాళ్లు అధికంగా వాడుతున్న జూమ్ యాప్, టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, జెండర్, షేర్‌ఇట్, క్లీన్ మాస్టర్‌తో పాటు మరో 52 అప్లికేషన్లు ఉన్నాయి.
    ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సిఫారసుకు తాజాగా జాతీయ భద్రతా మండలి సచివాలయం మద్దతు ఇచ్చిందని, ఇవి భారతదేశ భద్రతకు హానికరమని భావిస్తున్నట్టు ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు. దీని మీద చర్చలు కొనసాగుతున్నాయని ఆ అధికారి చెప్పారు, ప్రతి మొబైల్ యాప్ కి అనుసంధానించబడిన పూర్తి అంశాలు అలాగే ష్టాలను ఒక్కొక్కటిగా పరిశీలించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

   టిక్‌టాక్, వాల్ట్-హైడ్, విగో వీడియో, బిగో లైవ్, వీబో, వీచాట్, షేర్‌ఇట్, యుసి న్యూస్, యుసి బ్రౌజర్, బ్యూటీప్లస్, జెండర్, క్లబ్‌ఫ్యాక్టరీ, హెలో, లైక్, క్వాయ్, రోమ్‌వే, షెయిన్, న్యూస్‌డాగ్, ఫోటో వండర్, ఎపియస్ బ్రౌజర్, వివావీడ్ క్యూయు వీడియో ఇంక్, పర్ఫెక్ట్ కార్ప్, సిఎం బ్రౌజర్, వైరస్ క్లీనర్ (హాయ్ సెక్యూరిటీ ల్యాబ్), మి కమ్యూనిటీ, డియు రికార్డర్, యుకామ్ మేకప్, మి స్టోర్, 360 సెక్యూరిటీ, డియు బ్యాటరీ సేవర్, డియు బ్రౌజర్, డియు క్లీనర్, డియు ప్రైవసీ, క్లీన్ మాస్టర్ - చిరుత . కాష్‌క్లీర్ డియు యాప్స్ స్టూడియో, బైడు ట్రాన్స్‌లేట్, బైడు మ్యాప్, వండర్ కెమెరా, ఇఎస్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్, క్యూక్యూ ఇంటర్నేషనల్, క్యూక్యూ లాంచర్, క్యూక్యూ సెక్యూరిటీ సెంటర్, క్యూక్యూ ప్లేయర్, క్యూక్యూ మ్యూజిక్, క్యూక్యూ మెయిల్, క్యూక్యూ న్యూస్‌ఫీడ్, వీసిన్క్, సెల్ఫీసిటీ, క్లాష్ ఆఫ్ కింగ్స్, మెయిల్ మాస్టర్, ఎంఐ వీడియో కాల్-షియోమి, ప్యారలల్ స్పేస్


TikTok, Vault-Hide, Vigo Video, Bigo Live, Weibo,  eChat, SHAREit, UC News, UC Browser,BeautyPlus, Xender, ClubFactory, Helo, LIKE,Kwai, ROMWE, SHEIN, NewsDog, Photo Wonder,APUS Browser, VivaVideo- QU Video ,cPerfect Corp, CM Browser, Virus Cleaner (Hi Security Lab),Mi Community, DU recorder, YouCam ,make up,Mi Store, 360 Security, DU Battery Saver, DU Browser,DU Cleaner, DU Privacy, Clean, Master – Cheetah,CacheClear DU apps studio, Baidu Translate, Baidu Map,Wonder Camera, ES File Explorer, QQ International,QQ Launcher, QQ Security Centre, QQ Player, QQ Music,QQ Mail, QQ NewsFeed, WeSync, SelfieCity, Clash of Kings,Mail Master, Mi Video call-Xiaomi, Parallel Space

ఇప్పటికే ఈ ఏడాది ఏప్రిల్‌లో, జాతీయ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ - కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఆఫ్ ఇండియా (సిఇఆర్‌టి-ఇన్) సిఫారసుపై జూమ్ వాడకంపై హోం మంత్రిత్వ శాఖ ప్రజలకి కొన్ని సూచనలు చేసింది. చైనీస్ డెవలపర్లు అభివృద్ధి చేసిన లేదా చైనీస్ లింక్‌లతో కంపెనీలు ప్రారంభించిన అనేక ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ యాప్ లను స్పైవేర్ గా ఉపయోగించుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

Thanks for reading Don't use 52 China apps..Intelligence alerts

No comments:

Post a Comment