Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, June 26, 2020

Did You Know? Eating rice at night will increase weight ..?


Did You Know?  Eating rice at night will increase weight ..?
మీకు తెలుసా ? రాత్రి పూట అన్నం తింటే బరువు పెరుగుతారాంట .. ?
Did You Know?  Eating rice at night will increase weight ..?

    చాలా మంది ఇప్పుడు హెల్త్ కాన్షియెస్ అయ్యారు. ఎప్పుడు ఏం తినాలి.. ఎలా ఫిట్‌గా ఉండాలనే ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాత్రి పూట అన్నం తినడాన్ని అవాయిడ్ చేస్తున్నారు. దానికి బదులుగా రోటీ, పుల్కా, వేరే ఏదైనా టిఫిన్స్, పండ్లలాంటివి తింటున్నారు. మరి ఇలా చేయడం నిజంగా ఫలితం ఉంటుందా అంటే.. ఉంటుందనే చెబుతున్నారు నిపుణులు.. నార్త్ ఇండియన్స్ ఎక్కువగా చపాతీలే తింటారు. మనలో చాలా మందికి చపాతీలు తిన్నా.. మళ్లీ అన్నం తినాల్సిందే. అందుకే.. ఇక వాటన్నింటి బదులు అన్నమే తిందామని తింటుంటారు. అందరికీ అందుబాటులో ఉండడం, ఈజగా ప్రిపేర్ అవుతుంది కాబట్టి రైస్ అనేది మన అందరి ఫేవరేట్ డిష్.. వాస్తవానికి ఎక్కువగా శారరక శ్రమ చేసేవారు..


   అన్నం ఎంత తిన్నా పర్లేదు.. ఎందుకంటే వారు శారరక శ్రమ పెరిగి ఎక్కువ కేలరలు ఖర్చు అయిపోతుంటాయి. కాన, కూర్చుని పనులు చేసేవారు అన్నం తినే విషయంలో జాగ్రత్తలు అవసరం. వారు కనీసం ఎక్సర్‌సైజ్ చేస్తుండాలి.


  లేకపోతే అధికంగా బరువు పెరిగి గుండె జబ్బులు, షుగర్ వంటి సమస్యలు వస్తాయి. అన్నం తినడం కూడా సమయానికి తగ్గట్లుగా తీసుకోవాలి.. పగటి పూట జీవక్రియలు బాగుంటాయి. ఈ సమయంలో అన్నం బాగా తినొచ్చు.


    అదే రాత్రి పూట అయితే అన్నం తీసుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే బియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తక్షణ శక్తిని ఇచ్చానా.. రాత్రి పూట మన శరీరం ఏ పని చేయదు..


   కేలరీలు ఖర్చు కావు.. దీంతో అవి కొవ్వుగా పెరిగి ఫలితంగా బరువు పెరుగుతారు. ఈ నేపథ్యంలోనే పగటి పూట రైస్ తీసుకున్నా పర్లేదు కానీ, రాత్రి పూట అన్నం తీసుకోకపోవడమే మంచిది.. ఆ సమయంలో ఆహారం ఎంత తేలిగ్గా ఉంటే అంత మంచిది.


    త్వరగా జీర్ణమవుతుంది.. కడుపు కాస్తా ఖాళీగా ఉంటే నిద్ర కూడా బాగా పడుతుంది.. అన్నం తింటే మనకి కడుపు నిండిన భావన కలుగుతుంది. చిన్ననాటి నుంచే బియ్యం మన డైట్‌లో భాగమయ్యాయి.


   అందుకే ఏ వంటకం ఉన్నా మన మెయిన్ డిష్ అన్నమే. ఇందులోనూ ఎన్నో రకాల రైస్‌లు వచ్చాయి రెడ్ రైస్, బ్రౌన్ రైస్ అంటూ చాలా రకాలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల కూడా అంతగా ఉపయోగం ఉండదు. అసలు రాత్రి పూట అన్నం తినకపోవడమే మంచిది. దీని వల్ల కావాలని మనే సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. సాధ్యమైనంత వరకూ అన్నం తినకుండా రోటీ, పుల్కాలు తినడం మంచిదని చెబుతున్నారు.

Thanks for reading Did You Know? Eating rice at night will increase weight ..?

No comments:

Post a Comment