Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, June 27, 2020

Health Tips: Passion Fruit Ice Tea ... Taste to Taste ... Health to Health


Health Tips: Passion Fruit Ice Tea ... Taste to Taste ... Health to Health
 : ప్యాషన్ ఫ్రూట్ ఐస్ టీ ... రుచికి రుచి ... ఆరోగ్యానికి ఆరోగ్యం


  ఈ టీ గురించి తెలుసుకునే ముందు మనం అసలు ప్యాషన్ ఫ్రూట్ గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఇవి జామకాయల కంటే చిన్నసైజులో ఉండే... పర్పుల్, ఎరుపు రంగులో కనిపించే... తియ్యటి, పుల్లటి పండ్లు. నిండా పోషకాలు కూడా ఉంటాయి. ఇవి ఎక్కువగా వేడి ఉండే ప్రాంతాల్లో పెరుగుతాయి. ప్రధానంగా వియత్నాం ప్రజలు ఈ పంటను ఎక్కువగా పండిస్తున్నారు. ప్యాషన్ పండ్ల తోటల్లోకి వెళ్లామంటే... తియ్యటి వాసన వస్తుంది. అందువల్ల ఈ పండ్లపై పరిశోధనలు చేశారు. ఇవి ఎంతో మంచివని తేలింది. వీటిలో యాంటీఆక్సిడెంట్స్ (మన బాడీలో విష వ్యర్థాల్ని తొలగించే గుణాలు), విటమిన్ A, విటమిన్ C, ఫ్లేవనాయిడ్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ పండ్లను మందుల తయారీలో ఎక్కువగా వాడుతున్నారు.ఎందుకంటే ఇవి తింటే రిలాక్స్ ఫీల్ కలిగిస్తున్నాయి. ఒత్తిడి దూరం చేస్తున్నాయి. మంచిగా నిద్ర పట్టేలా చేయగలుగుతున్నాయి.

ఇవి కంటిచూపును మెరుగుపరుస్తున్నాయి. రేచీకటికి చెక్ పెడతాయి. వీటిలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకానికి చెక్ పెడుతుంది. ఈ పండ్లలో ఐరన్ ఎక్కువ. అందువల్ల ఇవి మన రక్తంలో ఎర్రరక్త కణాల సంఖ్యను పెంచుతాయి. వీటిలోని కాపర్, పొటాషియం వల్ల రక్తప్రసరణ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. పొటాషియం, సోడియం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. మన ఎముకలు బలంగా ఉండేందుకు కూడా ఈ పండ్లు సహకరిస్తాయి.మరో ముఖ్యవిషయమేంటంటే ప్రపంచవ్యాప్తంగా భయపెడుతున్న కాన్సర్‌కి ఈ పండ్లు చెక్ పెడుతున్నాయి. వీటిలోని ఫ్లేవనాయిడ్స్, ఫెనోలిక్ పదార్థాలు... నోరు, ఊపిరితిత్తుల్లో పుండ్లను తగ్గిస్తూ కేన్సర్‌పై పోరాడుతున్నాయి. పాడైన కణాల స్థానంలో మంచి కణాల్ని ఉత్పత్తి చేస్తు్న్నాయి. ఆస్తమాతో బాధపడేవారు... ఈ పండ్ల తొక్క నుంచీ వచ్చే వాసన పీల్చితే... రిలీఫ్ పొందగలరని తాజా పరిశోధనల్లో తేలింది.

ఎన్నో ప్రయోజనాలు ఉండబట్టే... ఈ ఫ్రూట్‌తో ఐస్ టీ తయారుచేస్తున్నారు. వియత్నాం ప్రజలు ఈ పండును చాన్లియో అంటారు. రోజూ వాళ్లు వీటితోనే ఐస్ టీ తాగుతారు. ఈ టీ తయారీకి కావాల్సినవి... గ్రీన్ టీ బ్యాగ్స్, ప్యాషన్ ఫ్రూట్స్, తేనె, నీరు, ఐస్.

ముందుగా గ్రీన్ టీ తయారుచేసి... అందులో తేనె కలపాలి. దాన్ని కూలింగ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ప్యాషన్ ఫ్రూట్ గుజ్జు వేస్తే... ప్యాషన్ ఫ్రూట్ టీ రెడీ అయినట్లే. దాన్లో ఐస్ ముక్కలు వేసుకొని తాగేయడమే. లక్కేంటంటే ప్యూషన్ ఫ్రూట్ గింజలు కూడా తినేయవచ్చు. అందువల్ల గింజలతో సహా ఐస్ టీ తయారుచేసుకోవచ్చు. గింజలు లేకుండా కూడా చేసుకోవచ్చు.

ప్రస్తుతం మార్కెట్‌లో ప్యాషన్ ఫ్రూట్ టీ బ్యాగ్స్, ప్యాషన్ ఫ్రూట్ ఫ్లవర్ టీ బ్యాగ్స్ దొరుకుతున్నాయి. ఈ-కామర్స్ సైట్లలో కూడా ఇవి లభ్యమవుతున్నాయి. అవి కొనుక్కొని తాగినా... ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని పరిశోధకులు చెబుతున్నారు

Thanks for reading Health Tips: Passion Fruit Ice Tea ... Taste to Taste ... Health to Health

No comments:

Post a Comment