Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, July 4, 2020

Departmental Test - An analysis of the E.O test


Departmental Test - An analysis of the E.O test-డిపార్టుమెంటు టెస్టు - E.O పరీక్షపై ఒక విశ్లేషణ

E.O పరీక్ష పాసవ్వడం కష్టమా?

ఎక్కువమంది EO పరీక్షను కష్టంగా భావిస్తారు. అయితే ఒక ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అయితే EO పరీక్ష పాసవ్వడం కష్టం కాదు.

🔷 EO పరీక్షను 120 నిమిషాల్లో పూర్తి చేయవలసి ఉంటుంది. అంటే ప్రతి ప్రశ్నకు సగటున 1ని 20సె మాత్రమే కేటాయించబడింది.

EO పరీక్షలో కష్టతరమైన అంశాలు

Pension Problems,

Constitution of India లో Articles ను, Budget manuel అంశాలలో ఉన్న పేరాలను గుర్తించి రాయవలసి ఉంటుంది.

అలాగే Head of Accounts, Tresury Rules కష్టంగా భావిస్తాం.

EO పరీక్ష ఎలా పాసవ్వాలి?

ముందుగా సిలబస్             

🔹AP Treasury Code,

🔹AP Financial Code,

🔹AP Budget Manual,

🔹AP Pension Code,

🔹Constitution of India,

వీటితో పాటు వర్తమానాంశాలు ప్రిపేర్ అవ్వాలి.

మన దగ్గర Text Books(Bare Acts) ఉంటే ప్రిపేర్ కాకుండా పాసవ్వవచ్చా?

EO పరీక్షకు సంబంధించి టెక్స్ట్ బుక్స్ ఒక్కొక్కటి 100 లేదా 100కు పైగా పేజీలను కలిగి ఉన్నాయి. అన్ని పేజీలలో ఉన్న బిట్స్ ను గుర్తించడం చాలా కష్టం. అందుకని ముందుగా టెక్స్ట్ బుక్స్ లో ఉన్న బిట్ అంశాలను గుర్తించి ముఖ్యాంశాలను అండర్‌లైన్ చేసుకుంటే మంచిది.

EO పరీక్ష ఎలా ప్రిపేర్ కావాలి?

ముందుగా ఏవైనా గత పరీక్షలకు సంబంధించిన రెండు ప్రశ్నా పత్రాలను వాటి సమాధానాలతో సహా క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎందుకంటే వీటిలో 5 నుండి 10 బిట్లు వస్తున్నాయి.

🔹TOPIC WISE ప్రిపరేషన్🔹

🔷 APTC FORMS కు సంబంధించి 7 నుండి 10 బిట్లు వస్తాయి.

🔷 APFC FORMS కు సంబంధించి 4 నుండి 5 బిట్లు వస్తాయి.

🔷 HEAD OF ACCOUNTS కు సంబంధించి 8 నుండి 10 బిట్లు వస్తాయి.

🔷 PENSION RULES కు సంబంధించి 8 నుండి 10 బిట్లు వస్తాయి.

🔷 PENSION PROBLEMS కు సంబంధించి 10 నుండి 15 బిట్లు వస్తాయి.

చాలా మంది వీటిని కష్టతరంగా భావిస్తున్నారు.

అయితే పెన్షన్ లో SERVICE PENSION, NORMAL FAMILY PENSION, ENHANCED FAMILY PENSION, GRATUITY అంశాలను ప్రిపేర్ అయితే వీటికి ఈజీగా సమాధానాలను గుర్తించవచ్చు.

🔷TREASURY RULES కు సంబంధించి 10 నుండి 12 బిట్లు వస్తాయి.

🔷AP FINANCIAL CODE కు సంబంధించి 7 నుండి 8 బిట్లు వస్తాయి.

🔷AP BUDGET MANUAL కు సంబంధించి 10 నుండి 12 బిట్లు వస్తాయి.

🔷CONSTITUTION OF INDIA కు సంబంధించి 8 నుండి 10 బిట్లు వస్తాయి.

🔷 PF RULES కు సంబంధించి 3 నుండి 4 బిట్లు వస్తాయి.

🔷 వీటితో పాటు వర్తమానాంశాలైన CPS, PRC, APGLI కు సంబంధించి 10 నుండి 15 బిట్లు వస్తాయి.

వీటిని క్షుణ్ణంగా ప్రిపేర్ అయినట్లయితే ఈ మార్కులను ఈజీ గా సంపాదించవచ్చు.

మెటీరియల్ ఆధారంగా పైన వివరించిన టాపిక్ ల ప్రాధాన్యతా క్రమంలో ప్రిపేర్ అయినట్లయితే ఈజీ గా EO పరీక్షను పాసవ్వవచ్చు.



































Thanks for reading Departmental Test - An analysis of the E.O test

No comments:

Post a Comment