Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, July 21, 2020

Interesting facts in the UTF‌ survey.


Interesting facts in the UTF‌ survey
            Interesting facts in the UTF‌ survey

♦బడిలో పాఠాలకే తల్లిదండ్రుల మొగ్గు

♦కుదిరిన చోట తెరిపించాలని వినతి

♦అందుబాటులో లేని ఫోన్లు, నెట్‌

♦యూటీఎఫ్‌ సర్వేలో ఆసక్తికర అంశాలు

అమరావతి -: బడి తలుపులు మూతపడ్డాయి. బడి గంటలు మూగబోయాయి! కరోనా విజృంభిస్తూనే ఉంది. మరి... పిల్లల చదువులు సాగేదెలా? ఆన్‌లైన్‌లో పాఠాలు నేర్పించాలా? టీవీలో పాఠాలు చెప్పాలా? అవి ఎవరికి, ఎంత వరకు అందుతున్నాయి? ఏమేరకు అర్థమవుతున్నాయి! ఇదో పెద్ద చర్చ. దీనిపై ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యూటీఎఫ్‌) రాష్ట్రవ్యాప్త సర్వే నిర్వహించింది. రాబోయే విద్యా సంవత్సరం ఎలా ఉండాలి? విద్యార్థులకు నష్టం కలుగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఎలాంటి బోధనా విధానాలు చేపట్టాలి? అనే ప్రశ్నలపై ఈ నెల 8 నుంచి 15వ తేదీ వరకు సర్వే జరిపింది.

 ♦26,869 కుటుంబాల తల్లిదండ్రులతోపాటు...
44,644 మంది విద్యార్థులను కలిసి ముఖాముఖి చర్చించి వారి అభిప్రాయాలను సేకరించారు. 7065 మంది యూటీఎఫ్‌ కార్యకర్తలు, ఉపాధ్యాయులు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలనూ పరిగణనలోకి తీసుకున్నారు.

🌻ఆన్‌లైన్‌ తరగతులు ఉపయోగకరమని 6.5 శాతం మంది తల్లిదండ్రులు మాత్రమే చెప్పారు. 35%మంది ఉపయోగం లేదని తేల్చేశారు. 58.5 శాతం మంది పాక్షికంగా మాత్రమే ఉపయోగమని తెలిపారు. ఇక... ఆన్‌లైన్‌ పాఠాలు అర్థంకావడం లేదని 23 శాతం మంది పిల్లలు చేతులెత్తేశారు. 55 శాతం మంది కొంతమేరకు అర్థమవుతున్నాయని చెప్పారు. కేవలం ఏడు శాతం మంది మాత్రమే ‘ఓకే. మాకు అర్థమవుతున్నాయి’ అని చెప్పారు. ఇంకా ఈ సర్వేలో ఏం తేలిందంటే...

♦టీవీ పాఠాలు ఓకేనా?

ఇంట్లో టీవీ సౌకర్యం ఉన్నవారు 87.8ు. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే 70ు మాత్రమే.

సప్తగిరి చానల్‌లో పాఠాలు చూస్తున్న వారు 62.4ు

టీవీ పాఠాలు అర్థమయ్యే వారు 44.9ు.

ఆన్‌లైన్‌, టీవీలో పాఠాలు చూసే వారిలో 37.3 శాతం మందికి మాత్రమే సందేహాలు వస్తే తీర్చేవారు అందుబాటులో ఉన్నారు.

ఆన్‌లైన్‌ పాఠాలు వినేందుకు కావాల్సిన ఇంటర్నెట్‌ సౌకర్యం 72.2ు పాఠశాలకు లేదు.

♦తల్లిదండ్రుల మాట...

ఆన్‌లైన్‌ పాఠాల వల్ల ప్రయోజనం లేదు. ఇది తప్పనిసరి పరిస్థితుల్లో, తాత్కాలికంగా మాత్రమే పనికొస్తుంది.

అవకాశం ఉన్న ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలతో పాఠశాలలను ప్రారంభించాలి.

‘0’ సంవత్సరంగా మార్చరాదు. పని దినాలు, సిలబస్‌ తగ్గించాలి.

ప్రతి పాఠశాల వద్ద ఆరోగ్య సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవాలి. 

♦ఆన్‌లైన్‌ పాఠాల కోసం ..

ఆన్‌లైన్‌ బోధనకంటే టీవీ చానల్‌ ద్వారా బోధన కొంత మేలు.

సప్తగిరి చానల్‌ చాలదు. ప్రభుత్వమే పూర్తిస్థాయిలో ఒక చానల్‌ పెట్టాలి.

ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వాలి.

ఫైబర్‌ నెట్‌ వర్క్‌ ద్వారా అందరికీ నెట్‌ సౌకర్యం ప్రభుత్వమే కల్పించాలి.

టీవీ పాఠాల బోధనకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, విద్యార్థుల స్థాయికి తగినట్టు తయారు చేయాలి. 

♦టీచర్లు ఏం చేయాలంటే...

ఉపాధ్యాయులు ఒక్కొక్కరు కొంత మంది విద్యార్థులను దత్తత తీసుకోవాలి. 

పాఠశాలలకు వెళ్లలేని పరిస్థితుల్లో ఫోన్‌ ద్వారా, సోషల్‌ మీడియా ద్వారా, వాట్సాప్‌ గ్రూపుల ద్వారా ఏదో ఒక రూపంలో టచ్‌లో ఉండాలి. 

అడ్మిషన్లు తప్పనిసరిగా చేపట్టాలి. పై తరగతులకు ప్రమోట్‌ చేశామనే విషయం విద్యార్థులకు, తల్లిదండ్రులకు తెలపాలి.

♦అకడమిక్‌ పరంగా ...

రాబోయే విద్యా సంవత్సరపు ప్రణాళిక ప్రభుత్వం వద్ద స్పష్టంగా ఉండాలి. విద్యా వేత్తలు, మేధావులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో చర్చించి ప్రణాళిక తయారు చేయాలి.

♦ప్రత్యామ్నాయం కాదు యూటీఎఫ్‌

కరోనా మహమ్మారి ప్రభావంతో విద్యా రంగం కుదేలయ్యిందని... ప్రభుత్వ పాఠశాలలపై ఆ ప్రభావం అధికంగా ఉందని యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.బాబురెడ్డి తెలిపారు. పాఠశాలలు మూతపడటం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, తక్షణమే ప్రారంభించాలని అందరూ చెబుతున్నారని తెలిపారు. అసలు పాఠశాల విద్యకు ఆన్‌లైన్‌ బోధన ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదన్నారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పాఠశాలలు తెరిచే అవకాశం ప్రధానోపాధ్యాయులకు ఇవ్వాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. తమ సర్వే ఫలితాలను త్వరలోనే విద్యాశాఖ మంత్రికి అందజేస్తామని ఆయన తెలిపారు. 

Thanks for reading Interesting facts in the UTF‌ survey.

No comments:

Post a Comment