Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, July 9, 2020

New colors for schools to be finalized ..


               బొమ్మల బడి......చదువుల ఒడి


➪ పాఠశాలలకు కొత్త రంగులు ఖరారు..

➪ ఆహ్లాదకరంగా ఉండేలా డిజైన్లు

➪ అమరావతి, ఆంధ్రప్రభ:

✰ ప్రభుత్వ పాఠశాలల్లో చేరే పిల్లలకు ఆహ్లాదకర వాతావరణం మధ్య బోధన ఉండేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.

✰ అందులో భాగంగా నాడు- నేడు కింద రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను సమూలంగా మార్చే ప్రక్రియలో మరో అడుగు ముందుకేశారు.

✰ సర్కారు బడికి అంటే ఆడుతూ.. పాడుతూ విద్యార్థులు ముందుకు ఉరికే విధంగా కొత్త డిజైన్లు వేయాలని నిర్ణయించారు.

✰ ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ప్రీ స్కూల్, కిండర్ గార్డెన్ తరగతి గదుల్లో రంగురంగుల గోడలు, రకరకాల బొమ్మల మధ్య బోధన జరుగుతుంది.

✰ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలను వాటిని తలదన్నేలా రూపుదిద్దేందుకు చక్కటి ఆహ్లాదకరమైన రంగులు, చిన్నారుల చిత్రాలు, అక్షరాలు, బొమ్మలను వేయాలని ఆదేశాలు జారీ చేశారు.

✰ గురువారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో విద్యారంగం నాడు- నేడు సమీక్షలో భాగంగా పనుల పురోగతితోపాటు పాఠశాలలకు వేయాల్సిన రంగులపైనా వివిధ నమూనాలను పరిశీలించారు.

✰ పిల్లలను ఆకట్టుకునేలా.. నాణ్యమైన రంగులు, చిత్రాలతో బడి వాతావరణాన్ని తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.

✰ అందులో భాగంగా ఒక మోడల్ ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

✰ పాఠశాలలు పునః ప్రారంభంఅయ్యేలోగా వేగవంతంగా పనులు పూర్తి చేసి విద్యార్థులను స్వాగతించాలని సూచించారు.

Thanks for reading New colors for schools to be finalized ..

No comments:

Post a Comment