Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, July 7, 2020

Three semesters for classes 1 to 6


       1 నుంచి 6 తరగతులకు 3 విడతల విధానం
Three semesters for classes 1 to 6

♦సబ్జెక్టుకు 3 పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్‌లు

♦ఒకే పుస్తకంలో తెలుగు, ఆంగ్ల మాధ్యమ పాఠాలు

ఈనాడు - అమరావతి
ప్రభుత్వ పాఠశాలల్లో 1-6 తరగతుల్లో మూడు విడతల విధానాన్ని అమలు చేయనున్నారు. విద్యా సంవత్సరాన్ని 3 విడతలుగా విభజించి, పుస్తకాలను రూపొందించారు. ఒక్కో సబ్జెక్టుకు 3 పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్‌లు అందిస్తారు. ఆంగ్ల మాధ్యమంపై కేసు సుప్రీంకోర్టులో ఉండటంతో ఇప్పుడు ఒకే పుస్తకంలో తెలుగు, ఆంగ్ల మాధ్యమ పాఠ్యాంశాలను ముద్రిస్తున్నారు. కన్నడం, తమిళం, ఉర్దూ లాంటి వాటికి ఒకే మాధ్యమం ఉంటుంది. మొదటి విడత పుస్తకాల ముద్రణ ప్రారంభమైంది.

♦ఇదీ కొత్త విధానం
ఒక్కో సబ్జెక్టులో పాఠ్యాంశాలను మూడుగా విభజించి పుస్తకాలు ఇస్తారు. విడతల వారీగా విద్యార్థుల సామర్థ్యాలు విశ్లేషించి, పరీక్షలు నిర్వహిస్తారు. ఇప్పటివరకు 1-5 తరగతులకు సమ్మెటివ్‌ పరీక్షలు రెండు, ఫార్మేటివ్‌లు-4 నిర్వహిస్తుండగా.. వీటిని నిర్వహించాలా? అంతర్గత పరీక్షలతోనే విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేయాలా? అనే దానిపైనా కసరత్తు కొనసాగుతోంది. విద్యార్థుల బ్యాగు మోత తగ్గించేందుకు, ఒత్తిడి నివారణకు ఈ విధానాన్ని తీసుకొస్తున్నారు.

* భాషలకు సంబంధించి ఒకే మాధ్యమంలో, ఇతర సబ్జెక్టులకు రెండు మాధ్యమాల్లో పాఠాలు ఉంటాయి.

* ప్రతి పుస్తకానికీ ఒక వర్క్‌బుక్‌ ఉంటుంది. విద్యార్థులు వీటిలోనే తరగతి, హోం వర్కులకు సమాధానాలు రాయాలి.

* మొదటి విడత ముగింపులో విద్యార్థులు అప్పటివరకు నేర్చుకున్న పాఠ్యాంశాలపై పరీక్ష ఉంటుంది.

* రెండో విడతలో మొదటి విడత నుంచి 20%, ప్రస్తుత పాఠ్యాంశాల నుంచి 80% ప్రశ్నలుంటాయి.

* మూడో విడతలో.. మొదటి, రెండు విడతల పాఠ్యాంశాల నుంచి 10% చొప్పున, ప్రస్తుత పాఠాల నుంచి 80% ప్రశ్నలు ఇస్తారు.


Thanks for reading Three semesters for classes 1 to 6

No comments:

Post a Comment