Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, August 6, 2020

Colleges to open on October 15: CM Jagan


అక్టోబరు 15 న తెరుచుకోనున్న కాలేజీలు : సీఎం జగన్
Colleges to open on October 15: CM Jagan

 అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. రాష్ట్రంలోని ఉన్నత విద్య విధానంపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖయమంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉన్నత విద్యలో గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ను 90 శాతానికి తీసుకెళ్లాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి మంత్రి ఆదిమూలపు సురేష్, ఆంధ్రప్రదేశ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ వంగాల ఈశ్వరయ్య, సంబంధిత శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సతీష్‌చంద్ర తదితరులు హాజరయ్యారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెనల ద్వారా పెద్ద చదువులకు అండగా నిలుస్తున్నామని సీఎం జగన్‌ అన్నారు. దీని వల్ల కచ్చితంగా గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో పెరగాలన్నారు. పాఠ్య ప్రణాళికలో మార్పులు తీసుకు రావాలని, డిగ్రీ కోర్సులో అప్రెంటిస్‌ చేర్చినట్లు తెలిపారు. మూడేళ్ల డిగ్రీ కోర్సులో 10 నెలల అప్రెంటిస్‌షిప్‌ను చేర్చినట్లు పేర్కొన్నారు. దీనికి అదనంగా ఒక ఏడాది నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అంశాలపై శిక్షణ కూడా ఉంటుందని, ఆ తర్వాతే దాన్ని డిగ్రీ ఆనర్స్‌గా పరిగణిస్తామన్నారు. వృత్తి విద్యా డిగ్రీలకు సంబంధించి 4 ఏళ్లలో కూడా 10 నెలలు తప్పనిసరి అప్రెంటిస్‌షిప్‌ ఉంటుందన్నారు. దీనికి అదనంగా 20 అడిషనల్‌ క్రెడిట్స్‌ సాధించేవారికి కూడా ఆనర్స్‌ డిగ్రీ ఇవ్వాలని ఆదేశించారు. అడ్మిషన్లు పొందినప్పుడే సాధారణ డిగ్రీ కావాలా? లేదా ఆనర్స్‌ డిగ్రీ కావాలా? అన్న దానిపై ఐఛ్చికాన్ని తీసుకుంటామని వెల్లడించారు


చదువులు చెప్పే విధానంలో మార్పులు రావాలి: సీఎం
మంచి పాఠ్య ప్రణాళిక వల్ల డిగ్రీలకు విలువ ఉంటుందని ముఖయమంత్రి తెలిపారు. ప్రభుత్వ కాలేజీలను మెరుగు పరుద్దామన్న ఆలోచన గతంలో ఎవ్వరికీ రాలేదని, ఇప్పుడు ప్రభుత్వ కాలేజీల్లో అత్యున్నత ప్రమాణాలతో బోధన అందించాలని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అక్రమాలకు పాల్పడే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదే విధంగా పాత మెడికల్‌ కాలేజీలను మరమ్మతు చేసి వాటిలో నాడు - నేడు కార్యక్రమాల కోసం రూ.6 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యా రంగం మీద తమ ప్రభుత్వం దృష్టి పెట్టింది కాబట్టి .. వీటి గురించి ఆలోచిస్తున్నామన్నారు. ఇన్నాళ్లుగా వీటి గురించి ఎవ్వరూ ఆలోచన చేయలేదని, ప్రభుత్వ ఆసుపత్రిలో సెల్‌ఫోన్‌ వెలుగులో ఆపరేషన్లు ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఎలుకలు కొరికి శిశువు చనిపోయిన పరిస్థితి ఎందుకు వచ్చిందని? జనరేటర్లు పని చేయని పరిస్థితి ఎందుకు వచ్చిందని అధికారులను నిలదీశారు.

కాలేజీల్లో కూడా నాడు - నేడు కార్యక్రమాలు
కాలేజీల్లో కూడా నాడు - నేడు కార్యక్రమాలు చేయాలని, దీనికి సంబంధించి కార్యాచరణ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. నాడు - నేడు పనులతో అత్యుత్తమ ప్రమాణాలను తీసుకు రావాలని సూచించారు. కర్నూలులో క్లస్టర్‌ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. కడపలో ఆర్కిటెక్చర్‌ యూనివర్శిటీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలుగు, సంస్కృతం అకాడమీల ప్రారంభానికి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌. కురుపాంలో ట్రైబల్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ పనులు మొదలుపెట్టేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో యూనివర్శిటీలు పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

'పాడేరులో ట్రైబల్‌ యూనివర్శిటీ ఏర్పాటు చేసేందుకు అంగీకారం. ప్రతి ఏటా కచ్చితమైన నిధుల కేటాయింపుతో.. వచ్చే మూడు నాలుగేళ్లలో వాటి నిర్మాణాలు పూర్తి చేయాలి. యూనివర్శిటీల్లో ఖాళీల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌. దాదాపు 1110 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం. ప్రభుత్వ కాలేజీలు స్వావలంబన దిశగా సాగాలి. అక్టోబరు 15న కాలేజీలు తెరవాలని నిర్ణయం. సెప్టెంబరులో సెట్‌ల నిర్వహణ పూర్తి కావాలని నిర్ణయం. కాలేజీలు తెరిచిన తర్వాత విద్యాదీవెన, వసతి దీవెన ఇచ్చేందుకు సన్నద్ధం కావాలి' అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తెలిపారు.

Thanks for reading Colleges to open on October 15: CM Jagan

No comments:

Post a Comment