Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, August 6, 2020

Little Boy Destruction .. Why Target Hiroshima?


లిటిల్ బాయ్ విధ్వంసం .. టార్గెట్ హిరోషిమానే ఎందుకు ?




ప్రపంచ చరిత్రలో అత్యంత దుర్దినం.. హిరోషిమాపై దాడి



ఆగష్టు 6.. జపాన్‌తో పాటు ప్రపంచ చరిత్రలో అత్యంత విషాదభరితమైన, దుర్దినంగా నిలిచిపోయింది. జపాన్‌లో అతి పెద్ద దీవిగా పేరుగాంచిన హిరోషిమాలో అమెరికన్‌ బాంబర్‌ బి-29'లిటిల్‌ బాయ్‌'సృష్టించిన విధ్వంసానికి నేటికి సరిగ్గా 76 ఏళ్లు. సామ్రాజ్యవాద కాంక్ష, దేశాల మధ్య ఆధిపత్యపు పోరు కారణంగా వేలాది మంది ఉన్నచోటే పడి చచ్చిపోయిన ఈ ఉదంతం మానవాళి చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయింది. జన జీవనంతో హడావుడిగా ఉన్న నగరం క్షణాల్లో శ్మశానంలా మారిపోయిన వైనం శత్రుదేశాల ప్రజల చేత కూడా కన్నీళ్లు పెట్టించింది. అయితే ఆ మహా విస్ఫోటనం అక్కడి జీవాల్ని మాత్రమే మాయం చేయగలిగింది గానీ... హిరోషిమా వాసుల ఆత్మవిశ్వాసాన్ని కాదు!



గడ్డిపోచ కూడా మొలవదని ఆ భావించిన ఆ చోటు.. ఇప్పుడు ఆకాశ హార్మ్యాలు, అత్యాధునిక సదుపాయాలు, అధునాతన రహదారులు, నియాన్ దీపాల వెలుగుజిలుగులతో 'నక్షత్రాల దీవి'లా అలరారుతోంది. నేటికీ జపాన్ ఆర్థిక నిర్మాణంలో అతి ముఖ్యమైన నగరంగా ఉనికిని చాటుకుంటోంది. కాలంతో పోటీపడి.. వినాశనానికి 'విశ్వాసం'తో సమాధానం చెప్పి సగర్వంగా నిలబడింది. రాబోయే తరాలు బాగుండాలని.. ఒక తరం చేసిన సాహసం, త్యాగాల ప్రతిఫలంతో మానవతకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అణుబాంబు దాడి చేయడానికి హిరోషిమాను ఎంచుకోవడానికి గల కారణం? అసలు ఆరోజు ఏం జరిగింది? ఎంత మంది చనిపోయారు? అణుబాంబు దాడి తదనంతర పరిణామాలేమిటి? అన్న అంశాలను పరిశీలిద్దాం.





టార్గెట్‌ హిరోషిమానే ఎందుకు?

జపాన్‌లో ఉన్న 6,852 దీవుల్లోని అతి పెద్ద దీవి ఇది. హిరోషిమా అంటే వెడల్పైన దీవి అని అర్థం. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం.. ప్రాచీన కాలం నుంచే వాణిజ్య కేంద్రగా భాసిల్లింది ఈ దీవి. ఎన్నో కర్మాగారాలకు నెలవు. అంతేగాక జపనీస్‌ మిలిటరీ, ఆయుధ సంపత్తికి హబ్‌గా ఉండేది. కాబట్టి రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్‌ను అన్ని రకాలుగా దెబ్బకొట్టేందుకు అమెరికా ఈ నగరాన్ని ఎంపిక చేసుకుందని చెప్పవచ్చు. అణుబాంబు దాడికి కొన్ని రోజుల ముందే ఫైర్‌ బాంబింగ్‌ ఆపేసిన అమెరికా.. సరైన సమయం కోసం వేచి చూసింది. ప్రాణనష్టం, ఆస్తి నష్టాన్ని అంచనా వేసి తమ ప్రణాళికను పక్కాగా అమలు చేసింది.





ఆగష్టు 6, 1945.. ఆరోజు ఏం జరిగింది?

జపాన్‌ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటల 15 నిమిషాలకు బీ-29 బాంబర్‌ ఎనోలా గే.. నాలుగు టన్నుల యురేనియంతో కూడిన బాంబు లిటిల్‌ బాయ్‌ను అమెరికా హిరోషిమాపై ప్రయోగించింది. 9600 మీటర్ల ఎత్తు నుంచి నగరం నడిబొడ్డున ఉన్న అయోవి బ్రిడ్జ్‌ని లక్ష్యంగా చేసుకుని బాంబును జార విడిచింది. బ్రిడ్జి పైనుంచి కేవలం 600 మీటర్ల ఎత్తులో 43 సెకన్లలోనే లిటిల్‌ బాయ్‌ పేలాడు. దీంతో ఒక్కసారిగా భారీ విప్ఫోటనం సంభవించింది. దాదాపు రెండు కిలోమీటర్ల మేర అంతా సర్వనాశనమై పోయింది. మంటల(3-4 వేల డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు) ధాటికి అంతా కాలి బూడిదై పోయారు. నగరమంతా పొగతో నిండిపోయింది. విస్పోటనం తర్వాత గంట సేపటి వరకు రేడియోధార్మిక కణాల వర్షం కురుస్తూనే ఉంది.

లక్షకు పైగా మరణాలు

హిరోషిమాలో లిటిల్‌ బాయ్‌ విధ్వంసం ధాటికి డిసెంబరు 31, 1945 వరకు దాదాపు లక్షా నలభై వేల మంది మృతి చెందినట్లు అంచనా. నాటి నగర జనాభాలో(ఆనాటికి 3,50,000) 40 శాతం ఇది. ఘటన సంభవించిన ప్రదేశం నుంచి అర కిలోమీటర్‌ దూరంలో ఒక్క ప్రాణి కూడా మిగల్లేదు. నేటి వరకు బాంబు ప్రభావం వల్ల మొత్తంగా 3 లక్షల మంది మరణించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కాగా ప్రస్తుతం హిరోషిమా జనాభా దాదాపు 12 లక్షలు(1.2 మిలియన్లు).





రక్తపు వాంతులు, జుట్టంతా రాలిపోయి

యురేనియం తాలూకు దుష్పరిణామాల వల్ల బాంబు దాడిలో బతికి బయటపడ్డ వారి జీవితం డిసీజ్ ఎక్స్ అనే రోగంతో నరకప్రాయంగా మారింది. రక్తపు వాంతులు, జుట్టు రాలిపోవడం వంటి లక్షణాలతో దాదాపు ఆరు వారాల్లోనే చాలా మంది చనిపోయారు. మిగిలిన వాళ్లు కూడా దినదినగండంగానే వెళ్లదీశారు. వివిధ రకాల క్యాన్సర్లు, ఇతరత్రా అనారోగ్య కారణాలతో దయనీయ జీవితం గడిపారు. ప్రభుత్వం వీరి చికిత్స కోసం అనేకానేక ఆరోగ్య కార్యక్రమాలు చేపట్టింది. రెగ్యులర్‌ చెకప్‌, ట్రీట్‌మెంట్‌తో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించింది. దాదాపు 1,36,700 మందిని హిబాకుష(బాధితులు)లను గుర్తించి సేవలు అందించింది. అయితే బాధిత కుటుంబాల నుంచి ఒత్తిడి కారణంగా 1957లో హిబాకుషాల కోసం ప్రత్యేక చట్టం వచ్చిన తర్వాతే ప్రభుత్వం ఈ మేరకు స్పందించడం గమనార్హం.
అయితే ఈ రేడియేషన్ తాలూకు రోగాల ప్రభావం కనీసం వంద ఏళ్ళు ఉంటుందని అప్పటి డాక్టర్లు అంచనా వేశారు. కానీ వారి అంచనా తప్పు అని నిరూపించడానికి హిరోషిమా వాసులంతా కంకణ కట్టుకున్నారు. ఇందులో భాగంగా డిసీజ్ ఎక్స్ సోకిన వారంతా ఆటంబాంబ్ క్యాజువాలిటీ కమిషన్‌కి చేరుకుని స్వచ్ఛందంగా తమ శరీరాలని అప్పజెప్పి ఎన్నో ప్రయోగాల్లో పాల్గొన్నారు. కొన్ని ప్రయోగాలు వారిని శారీరకంగానే కాక, మానసికంగానూ బాధించేవి. ప్రయోగ నిమిత్తం వారిని నగ్నంగా పరీక్షించిన సందర్భాలు ఎన్నో! రాబోయే తరాల క్షేమం కోసం వీటన్నిటినీ పంటి బిగువున భరించి త్యాగధనులయ్యారు.





నగరమంతా ఓరెగామి 'పేపర్‌ క్రేన్లు'

తమ కోరికలు నెరవేరేందుకు జపాన్‌ వాసులు పేపర్లు మడిచి కొంగ ఆకారంలో తయారు చేసి వాటిని ఎగురవేస్తారనే కథ ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో రెండేళ్ల వయసులో అణుబాంబు దాడి ప్రభావానికి లోనైన సడాకో సాసకి అనే బాలికకు లుకేమియా బారిన పడింది. పదేళ్ల పాటు మహమ్మారితో పోరాడిన ఆమె.. చికిత్స తీసుకుంటున్న సమయంలో మెడిసిన్‌ కవర్లను చుట్టి క్రేన్లు తయారు చేసేది. ఈ క్రమంలో పన్నెండేళ్ల వయసులో మరణించిన ఆ బాలికను శాంతి చిహ్నంగా భావిస్తూ నగరమంతా నేడు పేపర్‌ క్రేన్లు ఎగురవేస్తారు. ఇక అణువిధ్వంసం అనంతరం శాంతి చేకూరాలని 1949లో హిరోషిమా పీస్‌ మెమోరియల్‌ పార్క్‌,1955లో హిరోషిమా పీస్‌ మెమోరియల్‌ మ్యూజియాన్ని ప్రారంభించారు. అణ్వాయుధాల పూర్తి నిర్మూలన కొరకు హిరోషిమా మెమోరియల్ పార్క్‌లో 1964లో వెలిగించిన శాంతి జ్యోతి ఇప్పటికీ వెలుగుతూనే ఉంది.





లొంగిపోయే లోపే లిటిల్‌ బాయ్‌, ఫ్యాట్‌మ్యాన్‌లతో విధ్వంసం

రెండో ప్రపంచ యుద్ధ సమయం (1945)లో సోవియట్‌ యూనియన్‌ అధినేత స్టాలిన్, అమెరికా అధ్యక్షుడు హ్యారీ ఎస్‌ ట్రూమన్, గ్రేట్‌ బ్రిటన్‌ ప్రధానమంత్రి విన్‌స్టన్‌ చర్చిల్‌ (చర్చిల్‌ తర్వాత క్లెమెంట్‌ అట్లీ) జర్మనీలో సమావేశమయ్యారు. యుద్ధానికి తెర దించడంపై ఆ ఏడాది జూలై 27 నుంచి ఆగస్టు రెండవ తేదీ వరకు చర్చించారు. జపాన్‌ బేషరతుగా లొంగిపోవాలన్నది డిమాండ్‌. అప్పటి జపాన్‌ అంత సామర్థ్యం, అధికార బలం లేనిది కనుక బేషరతుగా లొంగిపోవడానికి సిద్ధమైంది. జపాన్‌ తమ అంగీకారం తెలిపేలోపే.. తాము తయారుచేసిన అణు బాంబులను వాడే అవకాశం మళ్లీ రాకపోవచ్చునని అమెరికా భావించింది. ఈ కారణంగా ఆగస్టు 6న హిరోషిమాపై లిటిల్‌ బాయ్ అనే అణుబాంబును ప్రయోగించిన అమెరికా.. దాని నుంచి తేరుకునేలోగా నాగసాకి పట్టణంపై ఫ్యాట్‌ మ్యాన్‌ అనే మరో అణుబాంబును ప్రయోగించి తమ రాక్షసత్వాన్ని ప్రదర్శించింది.


View the video



Thanks for reading Little Boy Destruction .. Why Target Hiroshima?

No comments:

Post a Comment