Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, August 26, 2020

Jagananna Vidyakanuka: These are the school bags given to the students


 Jagananna Vidyakanuka: These are the school bags given to the students
జగనన్న విద్యాకానుక : విద్యార్థులకు ఇచ్చే స్కూల్ బ్యాగ్స్ ఇవే...

సీఎంగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తాజాగా ఆయన విద్యారంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా సర్కారీ బడుల రూపు రేఖలను మార్చి ఏపీ ప్రభుత్వం నూతన విద్యా ఒరవడికి శ్రీకారం చుట్టింది. అమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన వంటి సంక్షేమ పథకాలతో పాటుగా, ఇంగ్లీష్ మీడియాన్ని కూడా సర్కారీ బడులలో ప్రవేశపెట్టేందుకు జగన్ సర్కార్ కృషి చేస్తోంది.

విద్యా కానుక కిట్ ద్వారా గవర్నమెంట్ స్కూల్స్‌లో చదివే ప్రతీ విద్యార్ధికి మూడు జతల యూనిఫామ్, టెక్ట్స్,నోట్‌ పుస్తకాలు, బ్యాగులు, బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, నోటు పుస్తకాలు అందించనున్నారు.

ఇప్పటికే పలు జిల్లాలకు నోట్ బుక్స్ చేరుకోగా.. పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే నాటికి నోట్‌బుక్స్, యూనిఫాం, బూట్లు, సాక్సులను కూడిన కిట్‌ను విద్యార్ధులకు ఇచ్చేందుకు అధికారులు సిద్దం చేస్తున్నారు.


కాగా సెప్టెంబర్ 5వ తేదీ నుంచి స్కూల్స్ ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అదే రోజు 'జగనన్న విద్యా కానుక' పథకం కింద విద్యార్థులకు స్కూల్ బ్యాగులను అందజేయాలనే ఆలోచనలో ఉందట ప్రభుత్వం. విద్యార్థినీ, విద్యార్థులకు రెండు రంగుల బ్యాగులను ఇవ్వనున్నారు. కాగా ఇప్పటికే ఈ బ్యాగుల డిస్ట్రిబ్యూషన్ గురించి సీఎం జగన్ పరిశీలించిన విషయం తెలిసిందే.

Thanks for reading Jagananna Vidyakanuka: These are the school bags given to the students

No comments:

Post a Comment