Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, August 27, 2020

Now it is much easier to get a ration card.


Now it is much easier to get a ration card.
ఇప్పుడు రేషన్ కార్డు పొందడం మరింత ఈజీ..అదెలా అంటే ... !
Now it is much easier to get a ration card

రేషన్ కార్డు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారా..? రేషన్ కార్డు ఉండి కూడా సరుకులు తీసుకోలేకపోతున్నారా..? అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం సరికొత్త అవకాశాన్ని కల్పిస్తోంది. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకం ద్వారా కొత్త రేషన్ కార్డును పొందడంతోపాటు..ఒక ప్రాంతంలో రేషన్ కార్డు ఉండి మరో ప్రాంతంలో నివశిస్తున్న వారు సరుకులు తీసుకునేలా అవకాశం కల్పిస్తోంది. అయితే కొత్త రేషన్ కార్డు పొందాలన్నా..దేశంలో ఏ రేషన్ షాపులో అయినా సరుకులు తీసుకోవాలన్నా పెద్దగా కష్టపడాల్సిన పనేలేదు. ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. ఇంట్లోనే కూర్చోని కొత్త రేషన్ కార్డు పొందొచ్చు. అదేలా అనుకుంటున్నారా..? చాలా సింపుల్. మీరు చెయ్యాల్సింది ఏంటంటే

1. కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్-ONORC స్కీమ్ గురించి తెలుసుకోవాలి.

2. ఈ స్కీమ్ ద్వారా వలస కూలీలు, ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లినవాళ్లు దేశంలోని ఏ రేషన్ షాపులో అయినా సరుకులు తీసుకోవడానికి వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ ఉపయోగపడుతుంది.

3. 2021 మార్చి నాటికి అన్ని రాష్ట్రాలకు ఈ స్కీమ్ అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

4. ఇకపోతే రేషన్ కార్డును ఇంటి నుంచే అప్లై చేసుకోవచ్చు. అందుకు సంబంధించి మీ వివరాలను services.india.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం రెండు రకాల రేషన్ కార్డులు ఉన్నాయి. అందులో ఒకటి బిలో పావర్టీ లైన్-BPL రేషన్ కార్డు. రెండోది నాన్ బీపీఎల్ కార్డు.

5. బీపీఎల్ కార్డు వైట్ లేదా బ్లూ లేదా ఎల్లో లేదా గ్రీన్ లేదా రెడ్ కలర్లలో ఉంటుంది. ఈ కార్డు ద్వారా ఆహార పదార్థాలు, కిరోసిన్, ఇతర వస్తువుల్ని సబ్సిడీ ధరకే పొందొచ్చు.

6. మీరు ఇంటి నుంచే రేషన్ కార్డు తీసుకోవాలనుకుంటే మీరు నివసిస్తున్న రాష్ట్రానికి చెందిన అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఆ వెబ్‌సైట్‌లో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. లాగిన్ చేసిన తర్వాత మీ వివరాలతో దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి.

7.మీ కుటుంబ వివరాలను నమోదు చేసిన తర్వాత వాటికి అనుబందమైన డాక్యుమెంట్స్ ను అప్ లోడ్ చేయాలి. ఆ తర్వాత అప్లై ఆన్ లైన్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఆన్‌లైన్‌లో రేషన్ కార్డుకు దరఖాస్తు చేయడానికి డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, ఎంప్లాయీ ఐడెంటిటీ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, పాస్‌పోర్ట్, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఐడీ కార్డ్, హెల్త్ కార్డ్, ఆరోగ్య శ్రీ కార్డు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

8. నేషనల్ పోర్టబిలిటీ ద్వారా 2020 చివరి నాటికి 23 రాష్ట్రాల్లో 67 కోట్ల లబ్ధిదారులకు అంటే 83 శాతం మందికి వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అమలు చేస్తామని 2020 మేలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

9. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన స్కీమ్‌లో భాగంగా 75 కోట్ల మంది లబ్ధిదారులకు ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉచితంగా ఆహారధాన్యాలు అందించామని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే.

10. అందులో భాగంగా ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన స్కీమ్‌ ద్వారా ఒక్కొక్కరికీ 5 కిలోల ఆహార ధాన్యాలను అందించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో పాటు కుటుంబానికి కిలో పప్పు సరఫరా చేసింది. అయితే కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నవంబర్ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.

Thanks for reading Now it is much easier to get a ration card.

No comments:

Post a Comment