Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, August 30, 2020

SGT గా పనిచేస్తున్న Teacher 24 year scale తీసుకోవాలా ! వద్దా..!!


       24 year scale గురించి తెలుసుకుందాం.
      Let's learn about 24 year scale.
SGT గా పనిచేస్తున్న Teacher 24 year scale తీసుకోవాలా ! వద్దా..!!

  1. ముఖ్యంగా SGT లు దీనిపై సరైన అవగాహన లేకపోవడం వలన ఆర్థికంగా నష్టపోతున్నారు
  2. 24 year స్కేల్ తీసుకున్న తర్వాత ప్రమోషన్ వస్తే ...
  3. ప్రమోషన్ ద్వారా రావలసిన రెండు ఇంక్రిమెంట్లు రావు. ఒక్క ఇంక్రిమెంటు మాత్రమే వస్తుంది
  4. మరియు తదుపరి కొత్త కేడర్ లో AAS అంటే 6-12-18 స్కేళ్ళు రావు
  5. ఎవరైనా  SGT లు పదోన్నతి పొందే అవకాశం ఉన్నవారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి
  6. మరో ముఖ్య విషయం 24 సంవత్సరాలు service పూర్తి చేసుకుని, డిపార్ట్మెంటల్ పరిక్షలు ఉత్తీర్ణత పొంది ఉంటే అప్పుడు కూడా మనకు 24 year scale తీసుకోవాలని నిర్బంధం ఏమీ లేదు
  7. మనం DDO కు 24 స్కేలు కావాలని లెటర్ ఇస్తేనే అది మంజూరు చేస్తారు. అది రెగ్యులర్ ఇంక్రిమెంటులాంటిది కాదు
  8. ఒక ఉదాహరణ చూద్దాం A అనే వ్యక్తి 25 సంవత్సరాలు sgt గా పనిచేసి తధుపరి పదోన్నతి తీసుకున్నాడు అనుకుందాం
  9. A తన సర్వీసులో 24 స్కేలు తీసుకుంటే అప్పుడు ఒక్క ఇంక్రిమెంటు వచ్చింది. పదోన్నతి వచ్ఛినపుడు మరొక ఇంక్రిమెంటు వచ్చింది.
  10. మొత్తం రెండు ఇంక్రిమెంట్లు వచ్చాయి
  11. A కు ఇంకా 12 సంవత్సరాల సర్వీసు ఉంది. అతడు 6 సంవత్సరాలకు, 12 సంవత్సరాలకు పొందవలసిన రెండు ఇంక్రిమెంట్లు నష్టపోయాడు
  12. B అనే టీచరు కూడా A తో పాటు సర్వీసు లోకి వచ్చి అతడి లాగే 25 సంవత్సరాల తరువాత పదోన్నతి పొందాడు అనుకుందాం
  13. B మాత్రం 24 సంవత్సరాల స్కేలు వద్దని అధికారులకు తెలిపి తీసుకోలేదు. అతడు పదోన్నతి వచ్చినపుడు 2 ఇంక్రిమెంట్లు పొందాడు. 6 , 12 సంవత్సరాలకు AAS కింద మరో రెండు ఇంక్రిమెంట్లు పొందాడు మొత్తం 4 ఇంక్రిమెంట్లు B పొందాడు
  14. కావున  సర్వీసు ఎక్కువ ఉన్నవారు సరిగా ఆలోచించి ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకోగలరు.

Thanks for reading SGT గా పనిచేస్తున్న Teacher 24 year scale తీసుకోవాలా ! వద్దా..!!

No comments:

Post a Comment