Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, August 31, 2020

Suggestions for Distribution of Kits at the field level for 'Jagananna Vidya Kanuka ' to students.



Jagananna Vidya Kanuka
Jagananna Vidhya Kanuka Check List and Acquittance

Jagananna vidya kanuka – Distribution of School kits – Certain instructions –clarification issued

●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●
మిత్రులారా జెవికె కిట్స్, బుక్స్ యాప్ లో అప్ లోడ్ అవుతున్నాయి. 
అయితే JVK kit option  పై క్లిక్ చేసిన తర్వాత సెర్చ్ ఆప్షన్లో 
తల్లి ఆధార్ అని ఎంపిక చేసుకొని , తరగతి ఎంపిక చేసుకొని, తల్లి ఆధార్ నంబర్ టైప్ చేసిన తర్వాత  
Get option మీద  
క్లిక్ చేస్తే  పిల్లల వివరం వస్తుంది. దానిని చెక్
 చేసి న  తర్వాత ఐరిష్ పై క్లిక్ చేస్తే ఐ రీష్ ఓపెన్ అవుతుంది. 
ఇదే విధంగా బుక్స్ కూడా చేయవచ్చు.
●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●

Jagananna Vidya Kanuka Updated Android App

JVK APP UDATE చేసుకోమని
NOTICE వస్తుంది.

ఈ NOTICE రావడానికి ముందు
ఏ STUDENT పై CLICK చేసినా
ఈ CHILD ID వేరే SCHOOL తో
MAP అయ్యి ఉంది అని error Message
వస్తుంది.

ఈ పరిస్థితుల్లో App ను DIRECT గా
UPDATE చేసుకుంటే UPDATED APP
పనిచెయ్యదు.

SOLUTIONS
(1) Old App ను Uninstall చేసి
     Latest App ను Download చెయ్యాలి.

(2) Direct గా Update చేసి ఉంటే
APP పై LongPress చేసి
APP INFO Select చేసి
Clear Cache and Clear Storage చేసి
మళ్ళీ APP ను USE చేసుకోవచ్చు.
______________________
APP ను UPDATE చేసుకోకపోతే
CHILD ID వేరే SCHOOL తో
MAP అయ్యి ఉంది అని 
error Message ప్రతి student కు
Display చేస్తూనే ఉంటుంది
📱 *Old JVk app ని uninstall చేసి play store నుండి updated new JVK app ని install version:2.0

▪️Updated on: 08.10.2020

ఈ క్రింది లింకు ద్వారా మీ టీచర్ Tab లో Install చేసుకోండి......


HOW TO USE JAGANANNA VIDYA KANUKA ANDROID APP -JVK KIT-TEXT BOOKS-JAGANANNA VIDYA KANUKA ANDROID APP


HOW TO USE JAGANANNA VIDYA KANUKA ANDROID APP -JVK KIT-TEXT BOOKS-JAGANANNA VIDYA KANUKA ANDROID APP In Iris Tab


జగనన్న విద్యా కానుక (పాఠశాల విద్యా కిట్స్ ) పంపిణీ కార్యక్రమాన్ని రేపు (08.10.2020) ప్రారంభించి మూడు రోజులలో అనగా ది.10.10.2020 నాటికి పూర్తిచేయాలనీ... పాఠశాలలోని విద్యార్థుల మొత్తం సంఖ్యలో ప్రతి రోజు మూడవ వంతు విద్యార్థులకు/తల్లులకు  కోవిడ్ 19 నిబంధనలకు అనుగుణంగా ప్రజాప్రతినిధుల సమక్షంలో కిట్స్ పంపిణీ చేయాలనీ... అన్ని జిల్లా/మండల కేంద్రాలలో గౌరవ శాసన సభ్యుల, శాసన మండలి సభ్యుల, జిల్లా అధికారుల సమక్షంలో ప్రోటోకాల్ పాటిస్తూ కిట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించేలా చూడాలని అందరు RJD SE లను, DEO లను కోరుతూ DSE AP వారు తాజాగా ఉత్తర్వులు జారీ చేసారు.
Jagananna Vidya Kanuka


●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●
 JVK APP OPEN చేసేటప్పుడు ఎదురయ్యే సమస్యలు -- పరిష్కారాలు

ప్రశ్న : JVK APP లో మన CHILD USER ID,PASSWORD తో ఎంటర్ ఐనపుడు APP OPEN కాకుండా Invalid credentials అనే ERROR వస్తుంటే ఏంచేయాలి?
 జవాబు : chlld info password ను reset చేస్తే, new password తో JVK APP  OPEN  అవుతుంది.
(పాస్వర్డ్ రీసెట్ చేసేటపుడు PASSWORD SUCCESSESFULLY CHANGED అని వచ్చిందో లేదో గమనించండి )
  ప్రశ్న : child info  password ను ఎలా reset చేయాలి ?
 జవాబు : chlild info login లో  User ID ENTER చేసి కింద ఉన్న FORGOT PASSWORD ను CLICK చేస్తే..
ఒక window ఓపెన్ అవుతుంది.
అందులో..
User ID : ----
MOBILE NO : ---
CAPTA : ----
ఎంటర్ చేసి 
GET OTP క్లిక్ చేస్తే..
(Register mobile number కు otp వస్తుంది.)
మళ్లీ
ఒక window ఓపెన్ అవుతుంది.
అందులో..
User ID: ------(mana DISE CODE)
 Otp : --------
 New password:---
(కొత్త గా మనమే క్రియేట్ చేసుకోవాలి)
Conform password :------ (పై న ఏదైతే ఇచ్చామో..అదే.) 
Enter చేసి..submit చేసినపుడు
Password change success fully అని వస్తే.. password reset ఐనట్లే.

ప్రశ్న : Regester mobile no ( HM mobile no) మార్చాలంటే ఏం చేయాలి?
జవాబు  : మన MEO LOGIN లో HM MOBILE UP DATION చేయించుకుని తర్వాత PASSWORD RESET చేసుకోవాలి.

ప్ర .JVK app open చేసినప్పటికీ విద్యార్థుల పేర్లు కనిపించడం లేదు అప్పుడు ఏమి చేయాలి?
జవాబు:ఈ క్రింద తెలిపిన విధంగా అప్లోడ్ చేసినట్లయితే జీవీకే లో సంబంధిత విద్యార్థులు ఇన్ఫర్మేషన్ కనబడుతుంది, ఈ క్రింది ప్రొసీజర్ ఫాలో కావలసిందిగా కోరుచున్నాము,
జగనన్న విద్యాకానుక లో భాగంగా  విద్యార్థులకు పంపిణీ  చేసే పాఠ్య పుస్తకాలు ఒకటి  నుండి పదవ తరగతి వరకు schooledu.ap.gov.in వెబ్సైట్ నందు గల ఎం.ఈ.వో లాగిన్ లో సర్వీసెస్ అనే ఆప్షన్ లో Meo sent to school లో స్కూల్ వైస్ బుక్స్ సెంట్ చేయాలి.
అదే విధముగా స్కూల్ లెవల్ లో ప్రధానోపాధ్యాయుడు హెచ్.ఎం లాగిన్ అయ్యి (యూజర్ నేమ్_U dise code,password_child info)సర్వీసెస్ అనే ఆప్షన్ లో Text book/work book schools received అనే ఆప్షన్ లో సబ్మిట్ చెయ్యాలి.
అప్పుడే జగనన్న విద్యాకానుక  app లో textbooks ఇవ్వడానికి వీలవుతుంది.
●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●
Jagananna Vidya Kanuka: పాఠశాలల్లో పిల్లల నమోదును గణనీయంగా పెంచడంతో పాటు, అభ్యాసనలో వారు ఉత్సాహంగా పాల్గొనేలా చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించడమే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పిల్లలను బడిలో చేర్చే సమయంలో ఖర్చుల కోసం పేద కుటుంబాలు పడుతున్న కష్టాల నుంచి విముక్తి కలిగించడంతో పాటు, పాఠశాలల్లో ‘డ్రాప్‌ అవుట్‌‘ లను గణనీయంగా తగ్గిస్తూ, బాలల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడమే లక్ష్యంగా ‘జగనన్న విద్యాకానుక’ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయబోతోంది. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం, పునాదిపాడు ప్రభుత్వ పాఠశాలలో గురువారం (8-10-2020) ఈ కార్యక్రమాన్ని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ప్రారంభిస్తారు.
ఏమిటి ‘జగనన్న విద్యా కానుక?’:
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అందరు విద్యార్థినీ, విద్యార్థులకు ఈ కార్యక్రమంలో ప్రత్యేక స్కూల్‌ కిట్‌లు అందజేయనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 42,34,322 మంది విద్యార్థులకు ప్రయోజనం కలగబోతోంది. సుమారు రూ.650 కోట్ల విలువైన స్టడీ కిట్లను విద్యార్థులకు ఇస్తారు.
కిట్‌లో ఏముంటాయి?:
జగనన్న విద్యా కానుక కింద పిల్లలకు అందజేసే కిట్‌లో 3 జతల యూనిఫారాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, ఒక సెట్‌ టెస్ట్ బుక్స్, నోటు బుక్స్, వర్క్‌ బుక్స్‌, ఒక స్కూల్‌ బాగ్‌ ఉంటాయి. ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులందరికీ ఆ కిట్లు ఇవ్వబోతున్నారు. దీంతో పాటు పిల్లలకు ఇస్తున్న యూనిఫామ్ కుట్టు కూలీ మూడు జతలకి రూ.120 చొప్పున తల్లుల అకౌంట్‌కే నేరుగా విడుదల చేస్తారు. స్కూళ్లు తెరిచే నాటికి పిల్లలు యూనిఫామ్‌లు కుట్టించుకునే విధంగా వారికి ముందుగానే ఈ కిట్లు ఇస్తున్నారు.
పారదర్శక సేకరణ:
జగనన్న విద్యా కానుకలో పిల్లలకు అందించే వస్తువులు, బుక్స్, యనిఫామ్‌ క్లాత్‌ను ఎక్కడా అవినీతి లేకుండా పారదర్శకంగా రివర్స్‌ టెండరింగ్, ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ విధానంలో సేకరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా, బడి పిల్లలకు ఇన్ని వస్తువులతో కూడిన స్కూలు కిట్లు ఇస్తున్న మొదటి, ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలుస్తోంది.
●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●
'జగనన్న విద్యా కానుక' విద్యార్థులకు కిట్లను క్షేత్ర స్థాయిలో పంపిణీ కొరకు - జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్లకు మార్గదర్శకాలు.

 Jagananna Vidya Kanuka Kits Distribution Additional Guidelines as on 6th Oct Rc 151

 ●ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న 'జగనన్న విద్యా కానుక' కార్యక్రమం 8 వ తేదీ ప్రారంభం కాబోతుంది. ఈ పథకానికి సంబంధించి జిల్లా విద్యాశాఖాధికారులకు, సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్లకు, సీఎంవోలకు, జిల్లా సెక్టోరియల్ అధికారులకు, మండల విద్యాశాఖాధికారులకు ఆదేశాలు

ఇందులో ముఖ్యాంశాలు

●'జగనన్న విద్యా కానుక' కిట్ అందుకోవడానికి రోజుకు 50 మందికి మించకుండా! 50 మంది లోపు విద్యార్థులు వారి తల్లి/ సంరక్షకులతో సహా ఏదో ఒక రోజు పాఠశాలకు రావచ్చు.

 ●ఉదాహరణకు: ఉదయం 25 మంది, మధ్యాహ్నం 25 మంది రావచ్చు. అంటే 9 నుండి 12 గంటల లోపు 25 మంది ఒక్కో తరగతికి 5 మంది చొప్పున లేదా కొన్ని తరగతులు ఉదయం, ఇంకొన్ని తరగతులు మధ్యాహ్నం పాల్గొనేలా ఆయా పాఠశాలలోని తరగతులు, విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రధానోపాధ్యాయుడు/ ఉపాధ్యాయ సిబ్బంది ప్రణాళికలు వేసుకోవాలి.

 ●ఆయా పాఠశాల మొత్తం విద్యార్థుల సంఖ్యను బట్టి, పాఠశాల స్థలం బట్టి ప్రణాళిక వేసుకుని మెల్లగా కొన్ని రోజుల్లో 'స్టూడెంట్ కిట్స్' పంపిణీ పూర్తి చేయాలి.

 ●గుంపులుగా కాకుండా విడివిడిగా, కొందరిని మాత్రమే అనుమతిస్తూ భౌతిక దూరం పాటిస్తూ , ప్రభుత్వ ఆదేశించిన / నిర్దేశించిన కోవిడ్ -19 నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాన్ని అమలు చేయాలి.

 ●కిట్ అందుకున్న తల్లులతో బయో మెట్రిక్/ ఐరిష్ ద్వారా హాజరు వేయించాలి

 ●ఆ సమయంలో ముందు వేలిని శానిటైజ్ చేసి, ఆరిన తర్వాత బయోమెట్రిక్ వేయించాలి.

 ●బయోమెట్రిక్ విధానానికి సంబంధించిన 'యూజర్ మాన్యువల్' ఇప్పటికే అందరికీ ఇ-మెయిల్ ద్వారా పంపబడినది.
ముఖ్య గమనిక:

🎒🎒 కిట్ లో ఆయా తరగతులకు చెందిన పలు రకాల అంశాలు (5 నుండి 7 వస్తువులు) ఉంటాయి.

🎒🎒 వాటిలో బ్యాగు కానీ, షూ కానీ, బెలు, యూనిఫాం వంటి వాటిలో సరైన సైజు రాకపోయినా, డ్యామేజ్ కిట్ కు సంబంధించిన వస్తువులు ఏ పాఠశాలలోనైనా మరికొన్ని అవసరమైనా, మిగిలిపోయినా (ఎక్కువగా ఉన్నా) ఆ వివరాలను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంబంధిత మండల విద్యాశాఖాధికారికి తెలియజేయాలి.

🎒🎒 మండల విద్యాశాఖాధికారులు జిల్లా అధికారులకు తెలియజేయాలి.

🎒🎒 యూడైస్ కోడ్, చైల్డ్ ఇన్ఫోలో ఉన్న వివరాల ప్రకారం ప్రతి విద్యార్థికీ తప్పనిసరిగా అన్ని వస్తువులు అందజేయబడతాయి.

 🎒🎒 విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి అపోహలకు గురి కాకుండా ఈ విషయాన్ని తెలియపరచాలి.

🎒🎒 జగనన్న విద్యాకానుక'కు సంబంధించిన హెల్ప్ లైన్ నంబర్లు 91212 96051, 91212 96052. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటలలోపు పని దినాల్లో సంప్రదించవచ్చు.

🎒🎒 'జగనన్న విద్యాకానుక' స్టూడెంట్ కిట్ ప్రతి విద్యార్థికి తప్పకుండా అందేలా సక్రమ చర్యలకు సిద్ధం కావాలని రాష్ట్రంలోని అందరూ జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్రశిక్షా అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు పూర్తి శ్రద్ధతో పై ఆదేశాలను అత్యంత జాగరూకతతో అమలు చేయవలసిందిగా ఇందుమూలంగా ఆదేశించడమైనది.

Download Proceedings
●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●

 జగనన్న విద్యా కనుక యాప్ కు సంబంధించి కొన్ని ముఖ్య అంశాలు:

1.ఈ యాప్  ప్లే స్టోర్లో అందుబాటులో ఉండ బడును.
2. ఈ యాప్ ఐరిస్ డివైస్ మరియు ఫింగర్ ప్రింట్  డివైస్ వేరువేరుగా ఇవ్వబడును.
3. యూజర్ మాన్యువల్ చెప్పిన విధంగా పాఠశాల యు యుడేస్ ఆధారముగా లాగిన్ అవ్వ వలయును
4. అమ్మ ఒడిలో పిల్లవాడికి ఎవరినైతే ట్యాగ్ చేసినారు వారి ఆధార్ నంబర్ ఆధారంగానే ఇప్పుడు ఇవ్వబడును ఒకవేళ అందులో తప్పనిసరిగా ఏవైనా మార్పులు ఉన్న ఎడల సంబంధిత ప్రధానోపాధ్యాయుల లాగిన్ లో మార్చుటకు వీలు కలదు.
5. అదే విధముగా కొత్తగా పిల్లలు ఉన్న ఎడల వారి పేర్లను కూడా పాఠశాల లాగిన్ లో పొందుపరిచిన తర్వాత మాత్రమే మే వారికి కిట్ ఇవ్వవలెను
6. ఏ కారణం చేత నైనను బయోమెట్రిక్ అవ్వని ఎడల వారికి చివరలో ఇవ్వవలెను.
7. అతి ముఖ్యముగా ఎక్కువ శాతం ఐరిష్ డివైస్ ను మాత్రమే  ఉపయోగించ వలెను.
8.  అన్ని సిమ్ కార్డులు యాక్టివేషన్ చేయబడును
9. ఏ పాఠశాల డివైస్ అయినా వేరే పాఠశాలకి వాడ  వచ్చును
కావున పాఠశాల లోని పిల్లల సంఖ్య బట్టి ప్లాన్ చేసుకుంటే త్వరితగతిన పూర్తి చేయగలము
10. ముఖ్యముగా 5వ తేదీ నాడు ఏ పాఠశాలలో నైతే మండలంలో ప్రజా ప్రతినిధులు చేత గాని లేదా అధికారులతో ఈ కార్యక్రమం ప్రారంభించబడుతుంది ఆ పాఠశాలలో ముందుగా డివైజ్ చేసుకోవలెను.
11. ఎక్కడైనా ఏ పాఠశాల నేనా కేవలం రోజుకి 50 మందికి మాత్రమే పంపిణీ చేయవలయును అంతకుమించి చేసిన తీసుకోకూడదు.


JAGANANNA VIDYA KANUKA  APP LINK

https://play.google.com/store/apps/details?id=in.apcfss.child.jvk


Download JVK User Manual

View the video


HOW TO EDIT MOTHER / GUARDIAN AADHAR NUMBER FOR JAGANANNA VIDYA KANUKA ANDROID APP - JVK KIT
Suggestions for Distribution of Kits at the field level for  'Jagananna Vidya Kanuka ' to students.



టెలి కాన్ఫరెన్స్ లో జగనన్న విద్యా కానుక వస్తువులు క్రింది విధంగా అక్టోబర్ 5వ తేది న పంపిణీ చేయడానికి సూచనలు

టెలి కాన్ఫరెన్స్ లో  జగనన్న విద్యా కానుక  వస్తువులు క్రింది విధంగా అక్టోబర్ 5వ తేది నాటికీ  రెడీ చేసుకోవాలి అని చెప్పారు.

స్కూల్ బ్యాగులు రెండు రంగులలో ఉంటాయి.

# స్కై బ్లు రంగు అబ్బాయిలకు


#నావి బ్లు రంగు అమ్మాయిలకు


స్కూల్ బ్యాగులు 3 సైజ్ లలో ఉంటాయి.

*ప్రతి విద్యార్థి బ్యాగ్ పై విద్యార్థి పేరు, అడ్మిషన్ నెంబర్, ఆధార్ నెంబర్, తరగతి, ఊరు పేరు చార్ట్ ముక్క లో వ్రాసి ఉంచాలి.
# small : 5వ తరగతి వరకు

# medium : 6 నుండి  8 వ  తరగతి వరకు

#big: 9, 10 తరగతులు.

 బెల్ట్  3 రకాలు ఉంటాయి

 6 నుండి  10 తరగతులు అమ్మాయిలకు  బెల్టులు ఉండవు
అబ్బాయిలకు  రెండు వైపుల  డిజైన్  ఉంటుంది
అమ్మాయిలకు  ఒక వైపు డిజైన్ ఉంటుంది.
 small: 1-5 తరగతులు

 medium:6-8తరగతులు

 big:9-10 తరగతులు

బూట్లు :
ఒక జత బూట్లు, 2 జతల సాక్స్ లు  వారి వారి  సైజ్ లకు  అనుగుణంగా ఇవ్వాలి.


నోట్ బుక్స్:
# 1-5 తరగతిలకు  లేవు!

# 6-7 తరగతులకు  3 వైట్ 4 రూళ్ళ, 1 బ్రాడ్ రూళ్ళ  మొత్తం  8

# 8వ  తరగతి :4వైట్,  4 రూళ్ళ, 1 బ్రాడ్ రూళ్ళ,  1గ్రాఫ్  మొత్తం  10

#9 వ తరగతి : 5-5-1-1 మొత్తం  12

# 10 వ  తరగతి :6-6-1-1 మొత్తం  14.


👉వీటన్నిటిని  టెక్స్ట్ పుస్తకంలతో కలిపి  కిట్  ను  తయారు చేయాలి. అన్నింటినీ  బ్యాగ్ లో సర్ది  చెక్ లిస్ట్  తయారు చేసి బ్యాగ్ కు అంటించాలి.

అక్టోబర్ 4 వ తారీకు నాటికీ ఈ ప్రక్రియ  పూర్తి చేసుకొని  5వ తేది  పంపిణికీ  సన్నద్ధం అవ్వాలి.


👉పై వాట్లో  ఏవైనా రాకపోతే  వున్నవాటితోనే కిట్ ను పంపిణి చెయ్యాలి.


జగనన్న విద్యాకానుక పంపిణీ పై పలువురు ప్రధానోపాధ్యాయుల సందేహాలకు సమాధానాలు:


అందరు మండల విద్యాధికారుల  ద్వారా అందరు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది..

*1)జగనన్న విద్యాకానుకలను ఎవరికి ఇవ్వాలి?*

జ)జగనన్న విద్యాకానుకలను 2019-20 విద్యాసంవత్సరం యొక్క రోలు ఆధారంగా ఇవ్వడం జరిగినది.కానీ మనం ప్రస్తుతం అనగా 2020-2021 విద్యాసంవత్సరంలో (ప్రస్తుతం) ఉన్న *అన్ని తరగతుల విద్యార్థులకు*ఇవ్వవలెను.అనగా ఈ సంవత్సరం *పాఠశాలలో ఉన్న ప్రస్తుత విద్యార్థులకు మాత్రమే* ఇవ్వవలెను.

PS లో 5th పాసయి వెళ్ళిపోయినవారికి, UP లో 8th పాసయి వెళ్ళిపోయినవారికి, HS లో 10th పాసయి బయటకు వెళ్ళిపోయిన వారికి ఇవ్వరాదు.ఒకవేళ పాఠశాల తరగతులలో రోలు అధికంగా ఉన్నట్లయితే ముందు జాయిన్ అయనవారికి ఇచ్చి లేటుగా జాయిన్ అయిన వారికి ఆపవలెను.మిగిలిన విద్యార్థులకు రెండవ విడత వచ్చినప్పుడు ఇవ్వవచ్చు.

ఉదా: ఒక పాఠశాల/తరగతిలో 2019-20 రోలు 60 మంది ఇప్పుడు 70 మంది ఉన్నారనుకుంటే ఆ70 మందిలో ముందుగా జాయిన్ అయినవారికి 60 మందికి ఇవ్వాలి.మిగిలిన 10 మందికి రెండవ విడత వచ్చినపుడు ఇస్తాము.ఆవిధంగా పాఠశాలలో పంపిణీ చేయగలరు.

Jagananna Vidhya Kanuka Check List and Acquittance
Jagananna Vidhya Kanuka Check List and Acquittance

●జగనన్న విద్యా కానుక అక్టోబర్ 5వ తేదీన విద్యార్థులకు పంపిణీ చేయవలసి ఉంటుంది

●ఈ పంపిణి చేయడానికి ఉపాధ్యాయులకు ఉపయోగపడే విధంగా రూపొందించిన చెక్ లిస్టు మరియు Acquittance A4   సైజులో ప్రింట్ తీసుకుని మీ పాఠశాల వినియోగించుకోగలరు.....

Jagananna Vidhya Kanuka Acquittance

Jagananna Vidhya Kanuka Check List

వెబ్ సైట్ లో  జగనన్న విద్యాకానుకలో భాగంగా HMs receive చేసుకున్న Belt, Bag, Uniform, Text books వివరాలను కింది link లో Login అయ్యి servicesలో ఉన్న stock received -HM మీద click చేసి ప్రధానోపాధ్యాయులు అందరూ వారు receive చేసుకున్న వివరాలను enter చేయాలి
https://schooledu.ap.gov.in/CHILDINFOSERVICES/logout.htm

Thanks for reading Suggestions for Distribution of Kits at the field level for 'Jagananna Vidya Kanuka ' to students.

No comments:

Post a Comment