Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, August 12, 2020

YSR Pelli Kanuka Scheme 2020: Application Status & Apply Online ysrpk.ap.gov.in


YSR Pelli Kanuka Scheme 2020: Application Status & Apply Online ysrpk.ap.gov.in


వైస్సార్ పెళ్లి కనుక గూర్చి :
ఉద్దేశం
"రాష్ట్రములోని నిరుపేద కుటుంబాలలో ఆడపిల్ల వివాహ కార్యక్రమము భారం కాకుండా మరియు పెళ్లి కుమార్తె పెళ్లి అయి అత్త వారింటికి వెళ్ళిన తరువాత కూడా అభద్రతా భావంతో ఉండకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం వారు పెళ్లి కానుక పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం పేదింటి ఆడపిల్లకు ఆర్ధిక సహాయం చేయడం ద్వారా అండగా ఉండడమే కాక, బాల్య వివాహాలు నిర్మూలించేందుకు మరియు వివాహం రిజిస్ట్రేషన్‌ చెయ్యడం ద్వారా వధువుకి రక్షణ కల్పించడం ''వైఎస్సార్ పెళ్ళికానుక'' రూప కల్పన ముఖ్య ఉద్దేశ్యం."



పథక మార్గదర్శకాలు:
  1. మండల సమాఖ్య / మెప్మా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.
  2. అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు.
  3. వివాహానికి ముందే సాయం మొత్తంలో 20 శాతం పెళ్లికుమార్తె బ్యాంకు ఖాతాలో వేస్తారు.
  4. వివాహమయ్యాక మిగతా మొత్తాన్ని జమ చేస్తారు.
  5. అనంతరం వివాహ ధ్రువీకరణ పత్రం ఇస్తారు.

వైఎస్సార్ పెళ్ళికానుక లో నమోదు చేసుకునే విధానము
నమోదు చేసుకునే సమయానికి వివాహ వేదిక, వివాహ సమయం నిర్ణయించ బడి ఉండాలి. వివాహ తేదీకి కనీసం 5 రోజుల ముందు నమోదు చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారు రూరల్ వెలుగు మండల మహిళ సమాఖ్యలో నమోదు చేసుకోవచ్చు.
నమోదు చేసుకునే సమయానికి వివాహ వేదిక, వివాహ సమయం నిర్ణయించ బడి ఉండాలి. వివాహ తేదీకి కనీసం 5 రోజుల ముందు నమోదు చేసుకోవాలి. పట్టణ ప్రాంతంలో ఉండేవారు అర్బన్ మెప్మా లో నమోదు చేసుకోవచ్చు.



అర్హతలు (వధూవరులిద్దరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారయితే): 
1 వధువు మరియు వరుడు ఇద్దరూ ప్రజా సాధికార సర్వే నందు నమోదు కాబడి ఉండాలి( వాలంటీర్ నందు HOUSEHOLD  సర్వే చేసుకున్న అగును - మార్గ దర్శకాలు రావలిసి ఉంది )
2 వధువు మరియు వరుడు ఇద్దరూ ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర నివాసితులై ఉండాలి
3 వధువు మరియు వరుడు ఇద్దరూ ఆధారు కార్డు కలిగి ఉండాలి.
4 వధువు తప్పనిసరిగా తెల్ల రేషను కార్డు కలిగి ఉండాలి
5 వివాహ తేది నాటికీ వధువుకు 18 సంవత్సరములు మరియు వరుడుకు 21 సంవత్సరములు పూర్తి
6 కేవలం మొదటిసారి వివాహము చేసుకొనే వారు మాత్రమే ఈ పధకమునకు దరఖాస్తు చేసుకొనుటకు అర్హులు. అయితే, వధువు వితంతువు అయినప్పటికీ ఈ పధకమునకు దరఖాస్తు చేసుకొనవచ్చును
7వివాహము తప్పనిసరిగా ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రములో మాత్రమే జరుగవలెను



అర్హతలు (వధువు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెంది ఉండి వరుడు ఇతర రాష్ట్రాలకు (తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, చతీస్ ఘడ్ & ఒడిస్సా) చెందినవారయితే): 
1 వధువు ప్రజా సాధికార సర్వే నందు నమోదు కాబడి ఉండాలి( వాలంటీర్ నందు HOUSEHOLD  సర్వే చేసుకున్న అగును - మార్గ దర్శకాలు రావలిసి ఉంది )
2 వధువు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర నివాసితులై ఉండాలి
3.వధువు మరియు వరుడు ఇద్దరూ ఆధారు కార్డు కలిగి ఉండాలి.
4, వధువు తప్పనిసరిగా తెల్ల రేషను కార్డు కలిగి ఉండాలి
5 వివాహ తేది నాటికీ వధువుకు 18 సంవత్సరములు మరియు వరుడుకు 21 సంవత్సరములు పూర్తి అయి ఉండవలెను.
6 కేవలం మొదటిసారి వివాహము చేసుకొనే వారు మాత్రమే ఈ పధకమునకు దరఖాస్తు చేసుకొనుటకు అర్హులు. అయితే, వధువు వితంతువు అయినప్పటికీ ఈ పధకమునకు దరఖాస్తు
7 వివాహము తప్పనిసరిగా ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రములో మాత్రమే జరుగవలెను.


ప్రోత్సహకం
  • .వైఎస్సార్ పెళ్ళికానుక (ఎస్.సి) సాంఘిక సంక్షేమ శాఖ -40,000/-
  • వైఎస్సార్ పెళ్ళికానుక (ఎస్.సి కులాంతర) సాంఘిక సంక్షేమ శాఖ -75,000/-
  • వైఎస్సార్ పెళ్ళికానుక (గిరి పుత్రిక) గిరిజన సంక్షేమ శాఖ-50,000/-
  • వైఎస్సార్ పెళ్ళికానుక (ఎస్.టి కులాంతర) గిరిజన సంక్షేమ శాఖ -75,000/-
  •  వైఎస్సార్ పెళ్ళికానుక (బి.సి) బి.సి సంక్షేమ శాఖ-35,000/-
  •  వైఎస్సార్ పెళ్ళికానుక (బి.సి కులాంతర) బి.సి సంక్షేమ శాఖ-50,000/- @VolunteerConnection
  • వైఎస్సార్ పెళ్ళికానుక (దుల్హన్) మైనారిటీ సంక్షేమ శాఖ-50,000/-
  •  వైఎస్సార్ పెళ్ళికానుక (దివ్యంగులు) దివ్యంగులు సంక్షేమ శాఖ-1,00,000/-
  •  వైఎస్సార్ పెళ్ళికానుక (APBOCWWB) ఆంధ్రప్రదేశ్ భవనములు మరియు ఇతర నిర్మాణ రంగములోని కార్మిక సంక్షేమ సంస్థ, కార్మిక సంక్షేమ శాఖ-20,000/-

 కావలసిన డాకుమెంట్స్ :
  •  కులము - కమ్యూనిటి మరియు జనన ధృవీకరణ పత్రము
  •   వయస్సు -యస్.యస్.సి సర్టిఫికేట్: 2004 వ సంవత్సరము మరియు ఆ తరువాత పదవ తరగతి పాసయిన వారికీ (లేదా) డేట్ అఫ్ బర్త్ (లేదా ) ఆధార్ కార్డు
  •  ఆదాయము (వధువుకి మాత్రమే) -తెల్ల రేషను కార్డు/  ఇన్కమ్ సర్టిఫికేట్
  • నివాసము-ప్రజా సాధికార సర్వే నందు నమోదు / హౌస్ హోల్డ్ సర్వే
  •  అంగవైకల్యము -సదరం సర్టిఫికేట్ (కనీసం 40% గా ఉండి శాశ్వత అంగవైకల్యం అయి ఉండాలి)
  •  వితంతువు-ఆధార్ నెంబర్ ఆధారముగా పింఛను డేటాతో పరిశీలిస్తారు
  •  వితంతువు అయి ఉండి పింఛను పొందకపోతే లేదా ఫించను డేటాలో వివరాలు లేకపోతే వ్యక్తిగత ధృవీకరణ
  •  భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు  - ఎ.పి.బి.ఒ.సి.డబ్ల్యూ.డబ్ల్యూ.బి చే జారీ చేయబడిన కార్మికుని యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్/గుర్తింపు కార్డు


Apply Online For YSR Pelli Kanuka Scheme
  1. To apply for the Pelli kanuka scheme, you need to follow the simple steps given below:-

  2. First, visit the official website of the scheme given.
  3. Download the application form available on the official website.
  4. Enter all of the details.
  5. Upload all the documents mentioned above.
  6. Click on submit
Procedure to Search YSR Pelli Kanuka Application Status
  1. To check the application status, you need to follow the simple steps given below:-
  2. First, visit the Pelli Kanuka Status link given here
  3. A webpage will be displayed on your screen.
  4. Select “దరఖాస్తుస్థితినితెలుసుకోండి / Know Your Application Status”
  5. Enter the Aadhaar Card Number of bride or groom
  6. Click at the “Get Status” button
  7. The AP YSR Pelli Kanuka application status will be displayed.

Thanks for reading YSR Pelli Kanuka Scheme 2020: Application Status & Apply Online ysrpk.ap.gov.in

No comments:

Post a Comment