Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, September 4, 2020

Android apps on PC..do you know how?


Android apps on PC..do you know how?
ఆండ్రాయిడ్ యాప్లు పీసీలో..ఎలానో తెలుసా ?

మీ పర్సనల్ కంప్యూటర్‌(పీసీ)లో ఆఫీస్‌కు సంబంధించిన పనేదో చేస్తుంటారు. అంతలో మీ ఫోన్‌లో యాప్‌ అవసరం పడుతుంది. అందుకోసం మీరు చేస్తున్న పని పక్కన పెట్టి ఫోన్‌లో పని పూర్తిచేసి మళ్లీ కంప్యూటర్‌ స్ర్కీన్‌పైకి దృష్టి పెడతారు. ప్రతిసారి ఇలా చేయడం చికాకు కలిగిస్తుంది. అదే మీ ఫోన్‌లోని యాప్‌లు మీ పీసీ స్క్రీన్‌పైకి వస్తే.. ఆలోచన ఎంతో బాగుంది కదా. సరిగ్గా ఇలాంటి ఆలోచనే మైక్రోసాఫ్ట్‌ సంస్థకు కూడా వచ్చింది. రావటమే ఆలస్యం దానిని ఆచరణలో పెట్టి వినియోగదారులకు యువర్‌ ఫోన్‌ కంపానియన్‌ (Your Phone Companion) పేరుతో యాప్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ యాప్‌తో మీరు ఫోన్‌లోని యాప్స్‌ అన్నింటిని మీ పీసీ టాస్క్‌బార్‌కి పిన్‌ చేసుకోవచ్చు.
దీంతో మీరు చేయాలనుకున్న పని మరింత సులభంగా, వేగంగా పూర్తి చేయవచ్చు. అయితే ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ సిరీస్‌ ఫోన్‌ యూజర్స్‌కి మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ త్వరలో అన్ని కంపెనీల ఫోన్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే గెలాక్సీ సిరీస్‌ యూజర్స్‌కి కూడా ఇందులో కొన్ని పరిమితులు ఉన్నాయి.
               

పరిమితులు ఏంటంటే..

* మీ పీసీ విండోస్ 10 ఓఎస్‌తో పనిచేస్తుండాలి. అక్టోబర్‌ 2019 కన్నా ముందే అప్‌డేట్ చేసుండాలి. పీసీ విండోస్‌ వెర్షన్‌ ఏంటో తెలుసుకునేందుకు సెట్టింగ్స్‌లో అప్‌డేట్స్ అండ్ సెక్యూరిటీలోకి వెళ్లితే చెక్‌ చేసుకోవచ్చు.

* అలానే మీరు ఏ యాప్‌లను పీసీతో అనుసంధానం చేయాలనుకుంటున్నారో, అవి లేటెస్ట్ వెర్షన్ యాప్‌లు అయిండాలి.

* ఫోన్‌ కూడా ఆండ్రాయిడ్ 9 ఆపై ఓఎస్‌లతో రన్‌ అవుతుండాలి.

* పీసీ, ఫోన్ ఒకే వైఫైకి కనెక్ట్‌ అయివుండాలి.

* మీరు ఫోన్‌ యాప్స్‌ని పీసీలో యాక్సెస్‌ చేస్తున్నప్పుడు ఫోన్‌ కచ్చితంగా ఆన్‌లో ఉండాలి.

ఎలా కనెక్ట్ చేయాలి..

* ముందుగా మీరు యువర్‌ ఫోన్‌ కంపానియన్ యాప్‌ ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

* తర్వాత యాప్‌లో మెనులోకి వెళ్లి షార్ట్‌కట్‌పై క్లిక్‌ చేయాలి.

* అందులో మీకు ఫోన్‌లోని యాప్స్‌ అన్ని కనిపిస్తాయి. అయితే మౌస్‌, కీబోర్డ్‌కి సపోర్ట్ చేయని యాప్స్‌ మాత్రం కనిపించవు.

* అలా కనిపించే యాప్స్‌పై క్లిక్ చేస్తే ఆ యాప్‌ మీ పీసీ స్క్రీన్‌పై కనిపిస్తాయి.

* సింగిల్‌ క్లిక్‌ చేస్తే ఫోన్‌లో యాప్‌పై టచ్‌/టాప్ చేసినట్లుగా పనిచేస్తుంది.

* రైట్‌ క్లిక్ చేస్తే యాప్‌ స్క్రీన్‌ ముందు పేజికి వెళుతుంది.

* ఏదైనా కంటెంట్‌ని సెలెక్ట్ చేయాలంటే క్లిక్‌ చేసి హోల్డ్ చేసి డ్రాగ్ చేస్తే సరిపోతుంది.

* మౌస్‌ని స్క్రోల్ చేస్తే యాప్‌ స్క్రీన్‌ను అడ్డంగా, నిలువుగా జరుపుకోవచ్చు.

ఇలా మౌస్‌ కంట్రోల్‌తో యాప్‌లో ఫోన్‌ ఆపరేట్ చేసినట్టుగానే పీసీలో కూడా సులభంగా ఉపయోగించుకోవచ్చు.

Thanks for reading Android apps on PC..do you know how?

No comments:

Post a Comment