Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, September 3, 2020

Are you insuring a vehicle?


Are you insuring a vehicle?
వాహనానికి ఇన్సూరెన్స్‌ చేస్తున్నారా?
ఆర్థిక సంస్కరణల అమలు తర్వాత దేశంలో బీమా (ఇన్సూరెన్స్‌) రంగం వేగంగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం ప్రతి వ్యాపారంలోనూ ఇన్సూరెన్స్‌ ప్రాధాన్యం కనపడుతోంది. భవిష్యత్తులో ఊహించని పరిణామాలు ఎదురైనప్పుడు, ప్రమాద నష్టం నుంచి భయటపడేందుకు, ప్రకృతి పరంగా వచ్చే నష్టాలను అధిగమించేందుకు, ప్రమాదాల్లో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు.. ఇలా అనేక కారణాలతో దేశ పౌరులు వివిధ రకాల ఇన్సూరెన్స్‌ పాలసీలను తీసుకుంటున్నారు. వాటిల్లో జీవిత బీమా, వెహికల్‌, హెల్త్‌, ట్రావెల్‌, ఫైర్‌, పర్సనల్ ఇన్సూరెన్స్‌లు ముఖ్యమైనవి. వీటిల్లో వాహనదారుడికి ఎక్కువగా అవరసమయ్యేది మోటార్‌ ఇన్సూరెన్స్‌.

వీటిల్లో వాహనదారుడికి ఎక్కువగా అవరసమయ్యేది మోటార్‌ ఇన్సూరెన్స్‌. ఈ ఇన్సూరెన్స్‌ తీసుకునేముందు, లేదా రెన్యువల్ చేసుకునేముందు కొన్ని విషయాలపై అవగాహన ఉండాలి. మరి అవేంటో తెలుసుకోండి..

మోటార్‌ వెహికిల్ సవరణ చట్టం

మోటార్‌ వెహికిల్ చట్టం 1988కు ఎన్డీఏ ప్రభుత్వం కొత్తగా సవరణలు చేసింది. మోటార్‌ వెహికిల్ సవరణ చట్టం 2019 పేరుతో కొత్త చట్టానికి రూపకల్పన చేసింది. దీని ప్రకారం రోడ్డు భద్రత, వాహనాలు పర్మిట్లు, ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై జరిమానాలు, మోటార్‌ ఇన్సూరెన్స్ అమలు వంటి అంశాలపై కొన్నిచర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా మోటార్‌ వాహనానికి ఇన్సూరెన్స్ తీసుకునే వారు తప్పనిసరిగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది.

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌

కారు, బైక్‌, బస్సు.. ఇలా ఏదైనా ఒక వాహనానికి ఇన్సూరెన్స్ చేయించేటప్పుడు సాధారణంగా కొన్ని విషయాలు వింటుంటాం. అవే ఫస్ట్ పార్టీ ఇన్సూరెన్స్, సెకండ్ పార్టీ ఇన్సూరెన్స్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌, కంప్రెహెన్సివ్‌ ఇన్సూరెన్స్. ఫస్ట్ పార్టీ ఇన్సూరెన్స్‌లో కేవలం వాహన యజమానికి మాత్రమే బీమా కవరేజీ అందుతుంది. ప్రమాదం వల్ల వాహనానికి, యజమానికి కలిగిన నష్టాన్ని ఈ ఇన్సూరెన్స్ పాలసీ భర్తీ చేస్తుంది. ఇన్సూరెన్స్‌ కల్పించే కంపెనీనే సెకండ్ పార్టీ ఇన్సూరెన్స్‌ అంటాం.

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వల్ల ఉపయోగాలు

ఇక థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీ వాహనం వల్ల ఎదుటి వారి వాహనానికి నష్టం వాటిల్లినా, వారికి ప్రమాదం జరిగినా ఆ నష్టాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ అందిస్తుంది. అదే సమయంలో యాక్సిడెంట్ చేసిన వాహనదారుడికి, ఆ వాహనానికి కలిగిన డ్యామేజ్‌ను ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించదు. ఇక చివరిది కంప్రెహెన్సివ్‌ ఇన్సూరెన్స్. ఈ ఇన్సూరెన్స్ పాలసీ కొంచెం ఖరీదైన దీని వల్ల ప్రయోజనం ఎక్కువ. దీని ప్రకారం రోడ్డు పమాదం కారణంగా థర్డ్ పార్టీకీ, వాహన యజమానికి నష్టం వాటిల్లితే వాహన, మెడికల్‌ ఫీజులను ఇన్సూరెన్స్ కంపెనీనే చెల్లిస్తుంది.

ఇతర పాలసీలతో పోల్చుకోండి

మీ వాహనానికి ఇన్సూరెన్స్ చేస్తున్నప్పుడు లేదా రెన్యూవల్ చేస్తున్నప్పుడు మొదట ఇన్సూరెన్స్ కంపెనీల ఆఫర్ల గురించి తెలుసుకోండి. ఒక్కో కంపెనీ ఒక్కో ప్రీమియం ధరతో పాలసీలను అందిస్తుంది. కాబట్టి వాటిల్లో ఏది సరైనది, చౌక ధరల్లో ఎక్కువ ప్రయోజనం కలిగిస్తుంది, బీమా కవరేజ్‌ ఎంత ఉంది అనే అంశాలను పోల్చుకోవాలి. ఇలా ఒక్కో కంపెనీ పాలసీ ఆఫర్లను పోల్చి చూసుకుంటే ఏ ఇన్సూరెన్స్ కంపెనీ తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభం ఇస్తుందో తెలిసిపోతుంది. దీంతో మీరు ఏ ధరలో వాహనానికి ఇన్సూరెన్స్‌ తీసుకోవాలను కుంటున్నారో సులభంగా తెలుస్తుంది. వాహన బీమా అందించే కంపెనీ ఇన్సూరెన్స్‌ రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఐఆర్‌డీఏ) పరిధిలో ఉందో లేదో వాకబు చేసుకోవాలి.


ఈ విషయాలు గుర్తించుకోండి


  1.  మోటారు వాహనాలకు సంబంధించిన పనిముట్లు తరుగుదలకు గురైనప్పుడు వాటిపై ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్‌ చేయలేము. 
  2. వీటిపై వాహనదారుడికి ఎలాంటి పరిహారం అందదు.
  3.  ఒకవేళ ఏదైనా ప్రమాదంలో మీ కారు లేదా బైకు ఇంజిన్ పాడైపోతే దానిపై పూర్తి నష్ట పరిహారాన్ని క్లెయిమ్‌ చేయవచ్చు. 
  4. ఇంజిన్‌ పూర్తిగా చెడిపోతే దాని స్థానంలో కొత్త ఇంజిన్‌ కోసం కూడా బీమా కంపెనీని క్లెయిమ్‌ చేయవచ్చు.
  5.  మీ వాహనం దొంగిలించినప్పుడు, లేదా ప్రకృతి విపత్తుల వల్ల డ్యామేజ్‌ అయినప్పుడు బీమా కవరేజ్‌ ఉపయోగపడుతుంది. 
  6. ఇన్సూరెన్స్ ఇన్‌వాయిస్‌లను బీమా కంపెనీకి అందించితే దొంగతనానికి గురైన వాహనం విలువ మొత్తాన్ని ఆ కంపెనీలు చెల్లిస్తాయి.
  7.  మీ వాహనానికి ప్రస్తుత ఎక్స్ షోరూం ధర ఎంత ఉందో అంత మొత్తాన్ని చెల్లించే విధంగా కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు.
  8. మీరు ఇన్సూరెన్సు తీసుకొని ఒక సంవత్సరం కాలంపాటు ఎలాంటి క్లెయిమ్‌లు చేయకపోతే నో క్లెయిమ్ బోనస్ (ఎన్‌సీబీ) పొందే అవకాశం ఉంది.
  9.  మీ ఇన్సూరెన్సు విలువలో 20 శాతం వరకు కంపెనీలు

Thanks for reading Are you insuring a vehicle?

No comments:

Post a Comment