Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, September 17, 2020

Coronavirus FAQs: Covid - 19 W.H.O Medical Experts Answers to Myths


 Coronavirus FAQs : Covid - 19 అపోహలకు W.H.O వైద్య నిపుణుల సమాధానాలు


ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తోంది. ఈ వైరస్ అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ వ్యాపిస్తోంది. అన్ని వయస్సుల వారిపైనా ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో కోవిడ్ మహమ్మారిపై చేసే యుద్ధంలో మనం గెలవాలంటే ముఖ్యంగా వైరస్ పట్ల పూర్తి అవగాహన ఉండాలి.
అయితే వైరస్ వ్యాప్తిపై అనేక రకాల ప్రచారం జరుగుతోంది. వైరస్ పై అవగాహన పెంచి, పొంచి ఉన్న ప్రమాద తీవ్రతను తెలియజేయడం ఎంతో ముఖ్యం. ఇందులో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (W.H.O) కోవిడ్-19పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడానికి ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో గూగుల్ లో అత్యధికమంది వెతికిన ప్రశ్నలతోపాటు కోవిడ్ పై ఉన్న అపోహలను తొలగించేందుకు డైరెక్టర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గ్లోబల్ ఇన్ఫెక్టియస్ హజార్డ్ ప్రిపేర్డ్ నెస్, డాక్టర్ సెల్వీ బ్రియాండ్ చెప్పిన సమాచారాన్ని తెలుసుకుందాం.
కోవిడ్ పై అవగాహన, పెంచుకుని అప్రమత్తంగా ఉందాం.

ప్రశ్న-1. వాతావరణంలో మార్పులు కూడా కోవిడ్ వ్యాప్తిపై ప్రభావం చూపుతాయి. అంటే శీతాకాలం నుంచి వేసవికాలంలోకి మారే సమయంలోనూ కోవిడ్ వ్యాప్తి జరుగుతుంది అన్నది వాస్తవమా? అవాస్తవమా?

జవాబు: కొన్ని దేశాల్లో వేడిగా ఉంటుంది అయినా కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందుతోంది. అలాగే మరికొన్ని దేశాల్లో దేశాల్లో చల్లగా ఉంటుంది. అక్కడ కూడా కోవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. అంటే ఇక్కడ కోవిడ్ వైరస్ వ్యాప్తిపై వాతావరణం ఏమాత్రం ప్రభావితం చేయదు. ఏదేమైనప్పటికీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే వైరస్ వ్యాప్తి జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఉదాహరణకు రద్దీగా ఉండే ప్రదేశాల్లో, తక్కువ వెలుతురు ఉండే ఇరుకు ప్రదేశాల్లో ఎక్కువ సేపు ఉన్నట్టయితే కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అయితే చలికాలంలో బయట వాతవరణం చల్లగా ఉడడంవల్ల ప్రజలు ఇంట్లోనే ఎక్కువగా ఉంటారు. దీంతో ఇంట్లో తగినంత వెలుతురు లేక ఇరుకుగానూ ఉండవచ్చు. ఇదీ వైరస్ వ్యాప్తికి కారణం అవ్వొచ్చు.

ప్రశ్న-2. నేను కోవిడ్ బారినపడినట్టయితే నేను చల్లని ప్రదేశానికి వెళ్తే.. నానుంచి వైరస్ ఇతరులకు వ్యాపిస్తుందా? నీటి ద్వారా కూడా ఈ వైరస్ వ్యాపిస్తుందా?

జవాబు: ఇది కూడా అవాస్తవం. నీటి ద్వారా కోవిడ్ 19 వైరస్ వ్యాప్తి జరగదు. తాగే నీటిద్వారా కూడా కోవిడ్ వ్యాప్తి కాదు. మనం స్విమ్మింగ్ పూల్ లో లేద చెరువులో ఈత కొట్టినప్పటికీ అందులోని నీటి ద్వారా కోవిడ్ వ్యాప్తించే అవకాశం లేదు. అయితే మీరు స్విమ్మింగ్ పూల్ కి వెళ్లినపుడు అక్కడ ఎక్కువ మంది గుమికూడి ఉండడం, ఒకరికొకరు దగ్గరగా ఉండడం, ఒకవేళ వారిలో ఎవరైనా కోవిడ్ బారినపడి ఉన్నట్టయితే మీకు కూడా వైరస్ సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి స్విమ్మింగ్ పూల్స్ కి వెళ్లినపుడు కూడా భౌతిక దూరం పాటించడం అవసరం

ప్రశ్న-3. దోమలు కోవిడ్-19ను వ్యాపింపజేస్తాయా?ఈ ప్రశ్న గూగుల్ లో ఎక్కువ మంది సెర్చ్ చేశారు.

జవాబు: దోమల ద్వారా కోవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఏమాత్రం లేదు. మనకు తెలుసుకు జికా వైరస్, ఎల్లో ఫీవర్, డెంగ్యూ, చికున్ గున్యా లాంటివి దోమల ద్వారా ఇతరులకు వ్యాపిస్తాయి. కానీ కోవిడ్ దోమల ద్వారా ఇతరలకు వ్యాపించే అవకాశం లేదు.

ప్రశ్న-4. కోవిడ్ 19 పై ఇప్పటికీ ప్రజల్లో ఎన్నో అపోహలు ఉన్నాయి. ఏది మంచి, ఏది చెడు అనే వాస్తవాలను ప్రజలు ఎలా తెలుసుకోవాలి?

జవాబు: ఇలాంటి పరిస్థితులను మనం అంటువ్యాధి ప్రభలిన ప్రతిసారి చూస్తూ ఉంటాం. దానికి గురించిన మంచో లేదో చెడో ఏదైనా సమాచారం మాత్రం చాలా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే అందులో ఏది మంచిది, ఏది తప్పు, ఏది పనికిరాని సమాచారం అని ప్రజలు గుర్తించడం కష్టమవుతుంది. దీంతో వారు గందరగోళానికి గురవుతారు. మరికొన్ని సమయాల్లో భయంతోపాటు ఆందోళన పెంచుతుంది. ఇలాంటి మహమ్మారి వ్యాప్తి జరుగుతున్న సమయంలో ప్రజలు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూ.హెచ్.ఓ), ఇతర ప్రముఖ టెక్నికల్ ఏజెన్సీలను గమనించాలి.

ఎందుకంటే మేము వైరస్ కు సబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడంలో ఎంతో సమయం వెచ్చిస్తూ ఉంటాం.
ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. నమ్మదగిన సమాచారం తెలుసుకునే విషయంలో ప్రతి ఒక్కరూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అసవరం ఉంది. మనం ఏదైనా ఒక సమాచారాన్ని మన పక్కవాళ్లతో గానీ స్నేహితులతో గానీ సోషల్ మీడియా ద్వారా గానీ పంచుకునేటప్పుడు ఒక్కసారి ఆ సమాచారం నిజమా కాదా అన్నది నిర్ధారించుకోవాలి. ఇలా చేయడం ద్వారా మనం అవాస్తవాలను ప్రచారం చేయడాన్ని నిరోధించిన వారం అవుతాం.

పైన చెప్పినవే కాకుండా కోవిడ్ పై మరిన్ని అపోహలు కూడా ప్రచారంలో ఉన్నాయి. వాటిని కూడా తెలుసుకుందాం.

ప్రశ్న-5 వేడినీళ్ల స్నానం కోవిడ్-19 వైరస్ వ్యాప్తి నిరోధానికి ఉపయోగపడతుందా?
జవాబు: లేదు. వేడి నీళ్ల స్నానాలు కోవిడ్-19 వైరస్ సంక్రమణను నిరోధించలేవు.

న్యుమోనియా టీకాలు కోవిడ్-19 నుండి రక్షిస్తాయా?

జవాబు: లేదు. మునుపటి టీకాలు కోవిడ్-19 వైరస్ నుంచి మిమ్మల్ని రక్షించలేవు.

శరీరంపై ఆల్కాహాల్ లేదా క్లోరిన్ చల్లినట్టయితే కోవిడ్-19 వైరస్ చనిపోతుందా?

జవాబు: లేదు. ఆల్కాహాల్ లేదా క్లోరిన్ చల్లడం ద్వారా కోవిడ్-19 వైరస్ చనిపోదు.

కోవిడ్-19 వైరస్ సంక్రమణను నివారించడానికి ముక్కును సెలైన్ తో క్రమంతప్పకుండా కడగడం ద్వారా నిరోధించవచ్చా?

జవాబు:లేదు. ముక్కును సెలైన్ తో శుభ్రం చేయడం ద్వారా వైరస్ సంక్రమణను నిరోధించలేదు.

వెల్లుల్లి తినడం కోవిడ్-19 వైరస్ సంక్రమణను నివారించగలదా?

జవాబు:వెల్లుల్లి తినడం వలన కోవిడ్-19 వైరస్ నుంచి రక్షణ లభించదు.

కోవిడ్-19 ను నివారించడంలో మరియు చికిత్స చేయడంలో యాంటీబయోటిక్స్ ప్రభావవంతంగా ఉన్నాయా?

జవాబు: లేదు. యాంటీబయోటిక్స్ వైరస్ లకు వ్యతిరేకంగా పనిచేయవు. అవి బ్యాక్టీరియాకు మాత్రమే పని చేస్తాయి.

కోవిడ్-19 వైరస్ వృద్ధులను ప్రభావితం చేస్తుందా?యువకులు కూడా దీని బారిన పడుతున్నారా?

జవాబు: అన్ని వయసుల వారికి కోవిడ్-19 వైరస్ సోకుతుంది. వృద్ధులు మరియు ముందుగా ఏదైనా దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు తీవ్రంగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది.

కొత్త కోవిడ్-19 వైరస్ ను నివారించడానికి లేదా చికిత్స చేయడానికి ఏదైనా నిర్ధిష్టమైన మందులు ఉన్నాయా?

జవాబు: ఇప్పటి వరకు కోవిడ్-19 వైరస్ ను నివారించడానికి లేదా చికిత్స చేయడానికి నిర్ధిష్టమైన ఔషధాలు సిఫారసు చేయలేదు. అయినప్పటికీ వైరస్ సోకిన వారిలో లక్షణాలను బట్టి వైద్యులు చికిత్స చేస్తున్నారు.

Thanks for reading Coronavirus FAQs: Covid - 19 W.H.O Medical Experts Answers to Myths

No comments:

Post a Comment