Exercise for transfers-2020
బదిలీలకు కసరత్తు
𒊹︎︎︎ టీచర్ లాగిన్లో మార్పులకు హెచ్ఎం సమ్మతి అవసరం!
➪ ఈనాడు-గుంటూరు
✰ ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన కసరత్తును పాఠశాల విద్యాశాఖ వేగవంతం చేసింది.
✰ జిల్లాలో 3250 ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్స్, పీఈటీ, హెచ్ ఎంలు అంతా కలిపి 12వేల మంది పనిచేస్తు న్నారు.
✰ బదిలీలపై వీరంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
✰ గతంలో బదిలీల ప్రక్రియలో భాగంగా టీచర్ లాగిన్ నుంచి సమాచారం హెచ్ఎం, ఎంఈవో, డీవైఈవో, డీఈవో లాగిన్లకుచేరాక కూడా కొందరు తిరిగి మార్పులు, చేర్పులు చేసేవారు.
✰ అది ఎవరు చేశారు? ఎప్పుడు చేశారనేది ఉన్నతాధికారులకు తెలిసేది కాదు.
✰ కానీ ఈసారి ఏ స్థాయిలో మార్పులు జరిగినా అది ఎవరి లాగిన్లో జరిగిందో తెలిసిపోతుంది.
✰ ఇలా నూతన విధానం అమలు చేయబోతున్నారు.
✰ ఒకసారి టీచర్ లాగిన్ నుంచి తన సర్వీసుకు సంబంధించిన వివరాలుహెచ్ఎం లాగినకు వెళ్లాక తిరిగి ఉపాధ్యాయుడు ఏదైనా మార్పు, చేర్పులకు ప్రయత్నిస్తే కచ్చితంగా హెచ్ఎం చరవాణికి ఓటీపీ వస్తుంది.
✰ ఆ ఓటీపీ ద్వారానే సదరు టీచర్ మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.
✰ అది కూడా హెచ్ఎం లాగిన్లోనే చేయాలి.
✰ ఆయన లాగిన్ లో ఏదైనా మార్పులుచేస్తే డీవైఈఓ ఫోను ఓటీపీ వెళ్తుంది.
✰ ఇలా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనచర్యలు ఉండడంతో ఒకసారి లాగిన్ అయిన తర్వాత తిరిగి మార్పులు, చేర్పులు చేసు కోవడం టీచర్లకు అసాధ్యమనేది స్పష్టమౌతోంది.
✰ దీంతో ఉపాధ్యాయులు వివరాలను ముందుగా తన లాగి లోనే జాగ్రత్తగా నమోదు చేసుకోవాలి.
✰ మొత్తానికి బదిలీలకు సంబంధించి ప్రభుత్వం తరఫున చర్యలు ఊపందుకున్నాయి.
✰ కేవలం తన సర్వీసు, ఏ కేటగిరిలో ఎన్నాళ్లు పనిచేశారో ఆ వివరాల ఆధారంగానే పాయింట్లు కేటాయించి ఆ మేరకు బదిలీలు చేయడానికి రంగం సిద్ధమవుతోందని ఉద్యోగవర్గాలు తెలిపాయి.
𒊹︎︎︎ మిగులు ఖాళీలన్నీ బ్లాక్ చేస్తారు...
✰ గతంలో క్లియర్ వేకెన్సీలు, ఒకేచోట దీర్ఘకాలికంగా పనిచేసిన ఖాళీలు(లాంగ్ స్టాండింగ్ వేకెన్సీలు) ఇవి మొత్తం చూపేవారు.
✰ కానీ ప్రస్తుతం ఎంత మంది ఉపాధ్యాయులైతే పని చేస్తున్నారో ఆ ఖాళీలనే చూపాలని అధికారులకు సూచించారు.
✰ దీనివల్ల టీచర్లు ఇష్టానుసారం ఆప్షన్లు పెట్టుకోవడానికి కుదరదు.
✰ మిగులు ఖాళీలను కూడా కేటగిరీ 1, 2, 3 విభాగాలుగా విభజించి వాటిని చూపుతారు.
✰ ఈ మిగులు ఖాళీలను కోరుకోకూడదని ముందుగానే తెలియజేస్తారు.
✰ ప్రాథమికోన్నత పాఠశాలల్లో 20 మంది విద్యార్థులు ఉండి ఇద్దరు కన్నా ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉంటే వారిని హైస్కూల్ కు బదిలీ చేస్తారు.
✰ ఇదంతా కూడా తొలుత హేతుబద్ధీకరణ ప్రక్రియ(రేషనలైజేషన్) పూర్తయ్యాకే చేపడతారు.
✰ దీనికి సంబంధించిన ప్రక్రియనుత్వరలోనే పూర్తి చేసి ఏ క్షణాన అయినా బదిలీల ప్రక్రియ నిర్వహణకు దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.
విజయవాడ మీటింగ్ ముఖ్యంశాలు
🔹 బదిలీలకు , రేషనలైజేషన్ కు సంబంధించి మూడు అప్లికేషన్స్ ఆన్లైన్లో ఇవ్వబోతున్నారు.
1. మాస్టర్ అప్లికేషన్
2. వేకెన్సీ అప్లికేషన్
3. టీచర్స్ అప్లికేషన్
1). మాస్టర్ అప్లికేషన్లో టీచర్స్ అందరూ వారి డిడిఓ లాగిన్ లో వారి యొక్క పూర్తి వివరములను అప్లోడ్ చేయవలెను.
2). వేకెన్సీ అప్లికేషన్లో జిల్లా స్థాయిలో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం నుండి అన్ని రకాల ఖాళీలను అప్లోడ్ చేయవలెను, అనగా క్లియర్ వేకెన్సీ లు, రేషనలైజేషన్ వేకెన్సీ లు , 8 ఇయర్స్ వేకెన్సీ లు గైర్హాజర్ వేకెన్సీ లు అప్లోడ్ చెయ్యాలి. అయితే పదోన్నతి, ఉన్నతీకరణ పోస్ట్ ప్లేసెస్ ను వేకెన్సీ గా చూపించరాదు. ఖాళీలను మొత్తము పనిచేస్తున్న టీచర్స్ ఎంత మంది ఉంటారో అన్ని ఖాళీ లను మాత్రమే అప్లోడ్ చెయ్యాలి. మిగిలినవి 1, 2, 3 కేటగిరి లో సమానముగా బ్లాక్ చెయ్యాలి.
3). టీచర్ అప్లికేషన్ లో బదిలీలకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ లో టీచర్స్ వారి వివరములను పొందు పరచవలెను.
☀️ PD పోస్టులో Against గా పనిచేయుచున్న పీఈటీలు ను కదిలించ రాదు, అయితే ఎస్ జి టి పోస్ట్ లో against గా పని చేయుచున్న PET మరియు లాంగ్వేజ్ పండితులను అప్పర్ ప్రైమరీ స్కూల్ నందు ఒక SGT పోస్ట్ నందు నియమించి అక్కడ ఉండి వారికి జీతము డ్రా చేయవలెను.
☀️ తరువాత రేషనలైజేషన్ గురించి LFL పోస్ట్ ను కదిలించరాదు , దానికి బదులుగా SGT పోస్టును షిఫ్టింగ్ చెయ్యాలి.
☀️ 150 రోల్ ఉన్న ప్రాధమిక పాఠశాలకు LFL పోస్ట్ ఇవ్వాలి. వీటి కొరకు ఖాళీగా ఉన్న LFL పోస్టును లిఫ్ట్ చెయ్యాలి.
Thanks for reading Exercise for transfers-2020
No comments:
Post a Comment