Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, September 12, 2020

Follow these precautions after recovery: Central Health Department latest post Covid-19 protocol


Follow these precautions after recovery: Central Health Department latest post Covid-19 protocol
కోలుకున్న తరువాత ఈ జాగ్రత్తలు పాటించండి : కేంద్ర ఆరోగ్య శాఖ తాజా ప్రొటోకాల్
Follow these precautions while recovering: Central Health Department latest post Covid-19 protocol  కోలుకున్నా ఈ జాగ్రత్తలు పాటించండి : కేంద్ర ఆరోగ్య శాఖ తాజా ప్రొటోకాల్

post Covid-19 protocol: కొవిడ్ నుంచి కోలుకున్న వారు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు కొన్ని సూచనలతో కూడిన ప్రొటోకాల్‌ని జారీ చేసింది. కోలుకున్న వారిలో అత్యంత అరుదుగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయని, అందుకే జాగ్రత్తగా ఉండాలంటూ తెలిపింది. చ్యాయవప్రాస్‌ తినడంతో పాటు యోగాసనాలు చేయాలని అలాగే నోటిని పుక్కలిస్తూ ఉండాలని సూచించింది. ఇక వైద్యుల సలహా మేరకు ఆయుష్ కిట్‌ని వినియోగించుకోవాలని తెలిపింది. కొవిడ్-19పై మరింత లోతైన అధ్యయనం, పరిశోధనలు అవసరమని వెల్లడించింది.
                 

తాజా ప్రొటోకాల్ వివరాలివే:

1. మాస్క్‌ని తప్పనిసరిగా వాడాలి, చేతులను తరచుగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి.భౌతిక దూరం పాటించాలి.

2.గోరు వెచ్చని నీరు తాగుతూ ఉండాలి.

3. రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఆయుష్‌ మెడిసిన్‌ని వాడాలి.

4. ఆరోగ్యం బావుంటేనే ఇంట్లో పనులు చేసుకోవాలి. దశల వారీగా ఆఫీసు పనుల్లో చేరాలి.

5. వైద్యులు సూచించిన విధంగా రోజు యోగాసన, ప్రాణాయామ, మెడిటేషన్ చేయాలి.

6. వైద్యుడు చెబితేనే బ్రీతింగ్ వ్యాయామం చేయాలి.

7. రోజూ ఉదయం లేదా సాయంత్రం వీలైనమేర నడవాలి.

8.సరిపోయినంత న్యూట్రిషన్ డైట్ తీసుకోవాలి.

9. తగినంత నిద్ర, విరామం తప్పనిసరి.

10. అధిక జ్వరం, శ్వాససంబంధ సమస్యలు, గుండెల్లో నొప్పి వంటి లక్షణాలు ఉంటే ముందుగానే అప్రమత్తం అవ్వాలి.

11. కరోనాపై అవగాహన కలిగించేలా మీ అనుభవాలను స్నేహితులు, బంధువులతో పంచుకోవాలి.

12. కోలుకున్న వారం తరువాత తమ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడటం మంచిది.

13. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు ఏదైనా ఇబ్బందికర లక్షణాలు కనిపిస్తే.. దగ్గర్లోని ఆసుపత్రికి వెళ్లడం మంచిది.

14. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నవారికి క్రిటికల్ సపోర్ట్ అవసరం.

Thanks for reading Follow these precautions after recovery: Central Health Department latest post Covid-19 protocol

No comments:

Post a Comment