Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, September 12, 2020

Sonu Sood Scholarships for gifted poor students


 Sonu Sood Scholarships for gifted poor students
ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు సోనూసూద్ స్కాలర్ షిప్ లు
ముంబయి : నటుడు సోనూసూద్ కరోనా కష్టకాలంలో వేలాది మంది వలస కార్మికులను ఆదుకొని రియల్ హీరో అనిపించుకున్నారు. అంతేకాదు చాలా మందికి ఉద్యోగాలను కలిపించేందుకు తన వంతు కృషి చేస్తున్నారు. ఇప్పడు ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ఆదుకునేందుకు ఆయన ముందుకు వచ్చారు. ఈ క్రమంలో పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ అందించేందుకు ఓ కార్యక్రమం చేపట్టారు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ఇస్తానని ఆయన ప్రకటించారు.

  రెండు లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన వారికి ఆయన ఈ స్కాలర్ షిప్ లు అందించనున్నారు. వీరు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మెడిసిన్, ఇంజినీరింగ్, రోబోటిక్స్, ఎఐ, సైబర్ సెక్యూరిటీ, బిజినెస్ స్టడీస్, జర్నలిజమ్ తదితర వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న వారు ఈ స్కాలర్ షిప్ కు అర్హులు అని సోనూసూద్ తెలిపారు. స్కాలర్ షిప్ లకోసం scholarships@sonusood.me మెయిల్‌కు పది రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

Thanks for reading Sonu Sood Scholarships for gifted poor students

No comments:

Post a Comment