Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, September 7, 2020

International Literacy Day- special article.


'అక్షరం’ సంపూర్ణమయ్యేనా..
నిరక్షరాస్యత దేశానికి అతి పెద్ద సమస్య
నేడు "అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం"

అక్షరం ఆయుధం కన్నా గొప్పది. అక్షరం వ్యక్తికి ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. అభివృద్ధికి బాటలు వేస్తుంది. అయినా అక్షరంపై         నిర్లక్ష్యం వీడడం లేదు. సమాజమంతా ఆన్‌లైన్‌ బాట పడుతున్నా, అ,ఆ,ఇ,ఈ అంటే తెలియని వారు ఎందరో ఉన్నారు. ఇంకా చాలా మంది వేలిముద్రలు వేస్తున్నారంటే మనమెక్కడ ఉన్నామో ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అక్షరాస్యతపై లెక్కలు బాగానే ఉన్నా ఆర్థికంగా చేయూత లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. పాలకుల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం.. నిరక్షరాస్యులకు అవగాహన లేవి.. వెరసి వేలిముద్రకు దారి తీస్తుంది

యునెస్కో (UNESCO) సెప్టెంబర్ 8 తేదీని అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం ( International Literacy Day) గా ప్రకటించింది.
దీనిని నవంబర్ 17, 1965 సంవత్సరంలో యునెస్కో సభ్యదేశాల విద్యాశాఖ మంత్రుల మహాసభ అనంతరం ప్రకటించగా 1966నుండి జరుపుకుంటున్నాము. ప్రపంచంలో కొన్ని దేశాలు వెనుకబడి ఉండడానికి నిరక్షరాస్యత ముఖ్యకారణం. దీని ముఖ్య ఉద్దేశం అక్షరాస్యతను వ్యక్తులు మరియు సంఘాలకు అందించడం. ఇది పిల్లల్లోనే కాకుండా వయోజన విద్య మీద కూడా కేంద్రీకరించబడింది. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు.

ప్రపంచవ్యాప్తంగా అక్షరాస్యతా సూచి అభివృధ్ధికోసం ప్రోత్సహించడంకోసం – ప్రజాబాహుళ్యం‌లో అక్షరాస్యతపట్ల, లిఖితాక్షరాలకుగల విశేషమైన విలువలపట్ల చెతన్యంకల్గించి అక్షరాస్యతా సమాజంవైపు ప్రోత్సహించడం కోసం అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని విశేషంగా నిర్వహించుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా పలువురు మేధావులు, దాతృత్వ సంస్థలు, ప్రపంచాభివృధ్ధి పరిశోధనా కెంద్రం, రోటరీ ఇంటర్నేషనల్,మొంట్‌బ్లాక్, జాతీయ అక్షరాస్యతా సంస్థలు ఈ ఉద్యమం‌లో భాగస్వాములౌతున్నాయి.
అక్షరాస్యత వైపుగా సమాజం దృష్టిని ప్రోత్సహించడం, సామాజిక , మానవ అభివృద్ధికోసం వారు తమహక్కులను తెలుసుకోవటం కొరకు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సంబరాలు నిర్వహించుకుంటాము. జీవితానికి ఆహారమెంత అవసరమో, విజయం సాధించడానికి అక్షరాస్యత అంతే ముఖ్యం. అక్షరాస్యతతో శిశుమరణాలు తగ్గించడం, జనాభా నియంత్రణ, లింగసమానత్వం సాధించడంద్వారా కుటుంబహోదా తద్వారా అంతర్జాతీయస్థాయిలో దేశంహోదాను పెరగడానికి దోహదపడుతుంది. నిరంతర విద్య పొందేందుకు ప్రజలను ప్రోత్సహిస్తే వారు కుటుంబం, సమాజంతోపాటు దేశంపట్ల తమబాధ్యతలను అర్థంచేసుకుంటారు.
కాలానుగుణంగా అక్షరాస్యతకు నిర్వచనాలు మరింత స్పష్టతదిశగా పయనిస్తున్నాయి.

మన జీవనం, వృత్తి, అధ్యయనం, సామాజికీకరణవంటివాటితోపాటు సమాచార సేకరణ, నిర్వహణ, సామాజిక సేవ, పారిశ్రామికోత్పత్తులతోపాటు మనం పనిచేసే విధానాన్నే మార్చేసింది. సమాచార సాంకేతిక పరిజ్ఞానం‌ లేకపోతే డిజిటల్ లేదా కంప్యూటర్ ఇల్లిటరేట్’గా పరిగణించబడటంతోపాటు తన వృత్తి, జీవన వ్యవహారాలలో వెనుకబడిపోతాడు.
అక్షరాస్యతోపాటు అంక అక్షరాస్యత, వృత్తి నైపుణ్యాలు, జీవన నైపుణ్యాలు నేటి జీవితానికి అత్యవసరమైనవి. నేటి ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా ఈదిశగా కృషిచేయాలి.

యునెస్కో తన తన కార్యక్రమాలను 5 రంగాలలో నిర్వహిస్తుంది, అవేంటంటే... విద్య, ప్రకృతి విజ్ఞానం, సామాజిక మరియు మానవ శాస్త్రాలు, సంస్కృతి, మరియు కమ్యూనికేషన్లు మరియు ఇన్ఫర్మేషన్. యునెస్కో, విద్య ద్వారా "అంతర్జాతీయ నాయకత్వం" కొరకు అవకాశాల కల్పనలో తన వంతు కృషి చేస్తుంది. దీని ప్రధాన ఉద్దేశ్యం... వివిధ దేశాలలో విద్యావిధానలను క్రమబద్ధీకరించడం, ట్రైనింగ్ రీసెర్చ్‌లు చేపట్టడం.

యునెస్కో ప్రజా ప్రకటనలిచ్చి, ప్రజలను చైతన్యవంతం చేస్తుంది. సాంస్కృతిక మరియు శాస్త్రీయ ఉద్దేశ్యాలు కలిగిన ప్రాజెక్టులను చేపడుతుంది. "భావ వ్యక్తీకరణ స్వాతంత్ర్యాన్ని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రోత్సహిస్తుంది. మీడియా ద్వారా, సాంస్కృతిక భిన్నత్వాలను తెలియజేసి, రాజకీయ సిద్ధాంతాలను తయారుజేయడం. వివిధ ఈవెంట్‌లను ప్రోత్సహించడం.. లాంటివి చేస్తుంది.

కాగా... యునెస్కో 1990 సంవత్సరాన్ని అక్షరాస్యతా సంవత్సరంగా ప్రకటించింది. ఇక ఐక్యరాజ్య సమితి అయితే 2003-2012 దశాబ్దాన్ని అక్షరాస్యతా దశాబ్దంగా ప్రకటించింది. "లిటరసీ ఫర్ ఆల్, వాయిస్ ఫర్ ఆల్, లెర్నింగ్ ఫర్ ఆల్" అనే అంశాల్ని ఈ దశాబ్ది లక్ష్యంగా నిర్దేశించింది.

ఆ సంగతల పక్కనబెడితే... ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలతో పోలిస్తే అక్షరాస్యత విషయంలో భారతదేశం అగాథంలో వున్నట్లే చెప్పవచ్చు. ఈ మాత్రమైనా మనదేశ అక్షరాస్యత ఉందంటే దానిక్కారణం కొన్ని రాష్ట్రాలు అక్షరాస్యతను సాధించటంలో ముందుండటం తప్ప మరోటి కాదు. బీహార్, లాంటి రాష్ట్రాలు సగటు అక్షరాస్యతా శాతానికి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. మొత్తం మీద ప్రపంచ నిరక్షరాస్యుల్లో సగం మంది మనదేశంలోనే ఉండటం విచారకరం.

Thanks for reading International Literacy Day- special article.

No comments:

Post a Comment